• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /వినోదం
  • /‘కిల్లర్’ కోటి రూపాయల కాంటెస్ట్.. బిగ్ ట్విస్ట్ ఇచ్చిన దర్శక నిర్మాత పూర్వాజ్..

‘కిల్లర్’ కోటి రూపాయల కాంటెస్ట్.. బిగ్ ట్విస్ట్ ఇచ్చిన దర్శక నిర్మాత పూర్వాజ్..

Killer one Crore Contest: ఈ మధ్యకాలంలో ఏ సినిమాకు లేని హైప్ ‘కిల్లర్’ సినిమాకు వచ్చింది. ఈ సినిమాలో సెకండాఫ్‌లోని ట్విస్ట్ చెప్పి న వారికి కోటి రూపాయల నజరానా చిత్ర బృందం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఈ మూవీ మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన విన్నర్స్ లిస్ట్‌ను అనౌన్స్ చేస్తా అని చెప్పింది. ఇక్కడ పెద్ద మడతకాజా లాంటి పేచీ పెట్టింది.

Written ByTA Kiran Kumar Sharma
Published: Nov 07, 2026, 08:52 AM IST|Updated: Nov 07, 2026, 02:55 PM IST
joinshare
‘కిల్లర్’  కోటి రూపాయల కాంటెస్ట్.. బిగ్ ట్విస్ట్ ఇచ్చిన దర్శక నిర్మాత పూర్వాజ్..
Image Credit: Killer Movie (Source/X)

About the Author

TA Kiran Kumar Sharma

TA Kiran Kumar Sharma

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
దీపావళి తర్వాత ఈ 4 రాశులకు జాక్‌పాట్.. నవంబర్ 14 నుంచి శుక్రుడి అనుగ్రహంతో పట్టిందల్లా బంగారమే!

దీపావళి తర్వాత ఈ 4 రాశులకు జాక్‌పాట్.. నవంబర్ 14 నుంచి శుక్రుడి అనుగ్రహంతో పట్టిందల్లా బంగారమే!

2

Diwali Festival: దీపావళి అంటే ఆ గ్రామస్తులకు హడల్.. వందల ఏళ్లుగా పండగకు దూరం.. మహిళ పెట్టిన శాపం తెలిస్తే మైండ్ బ్లాంక్...

3

IND vs NZ 2nd ODI: టీమ్ఇండియాతో రెండో వన్డేలో న్యూజిలాండ్ ఓటమి..వన్డే సిరీస్ క్లీన్ స్వీప్‌పై కన్నేసిన భారత్!

4

Rice Price In India: పండగపూట కేంద్రం గుడ్‌న్యూస్.. భారీగా తగ్గనున్న బియ్యం ధరలు? కేంద్రం మాస్టర్ ప్లాన్

5

దీపాలు పెట్టడం వల్ల డిప్రెషన్ దూరమవుతుందా? లైట్ థెరపీకి దీపావళికి ఉన్న లింక్ ఇదే!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Killer Telugu Movie Contest: కిల్లర్" మూవీ కోటి రూపాయల కాంటెస్ట్ లో ఎవరూ సరైన సమాధానం చెప్పలేదు.  దగ్గరగా ఆన్సర్ చెప్పిన 10 మందికి లక్ష రూపాయల చొప్పున బహుమతి ఇస్తున్నట్టు ప్రకటించారు ఈ సినిమాలో ప్రధాన నటుడు కమ్ ప్రొడ్యూసర్ కమ్  డైరెక్టర్ పూర్వాజ్ ప్రకటించారు.

ఇటీవలే థియేట్రికల్ రిలీజ్ కు వచ్చి ప్రేక్షకులు థ్రిల్లింగ్ సినిమాటిక్ ఎక్సిపీరియన్స్ ఇచ్చింది "కిల్లర్" చిత్రం. ఈ చిత్రానికి చేసిన కోటి రూపాయల కాంటెస్ట్ ప్రమోషన్ హ్యూజ్ రెస్పాన్స్ వచ్చిందన్నారు. సినిమా సెకండాఫ్ ట్విస్ట్ చెప్పిన వారికి కోటి రూపాయల బహుమతి ఇస్తామంటూ మేకర్స్ ముందుగానే ప్రకటించి సినిమాపై అంచనాలు పెంచేలా చేసింది. మూవీ రిలీజై సక్సెస్ అయిన నేపథ్యంలో ఈ కోటి రూపాయల కాంటెస్ట్ గురించి వివరాలు తెలిపారు యాక్టర్, ప్రొడ్యూసర్, డైరెక్టర్ పూర్వాజ్, హీరోయిన్ జ్యోతి పూర్వజ్.

హీరోయిన్ జ్యోతి పూర్వజ్ మాట్లాడుతూ .. మా సినిమాకు ప్రేక్షకుల నుంచి ఈ రేంజ్ రెస్పాన్స్ వస్తుందనుకోలేదు. క్రిటిక్స్ నుంచి కూడా మంచి రివ్యూస్ వచ్చాయి. కొందరు కొన్ని సజెషన్స్ ఇచ్చారు. వాటిని కూడా పాజిటివ్‌గా  తీసుకున్నాము.  ఓవరాల్ గా మా మూవీకి రెస్పాన్స్, బిజినెస్ పరంగా హ్యాపీగా ఉన్నాము.  ఇలాంటి మంచి చిత్రాలు మరిన్ని చేయబోతున్నట్టు తెలిపారు.

యాక్టర్, ప్రొడ్యూసర్, డైరెక్టర్ పూర్వాజ్ మాట్లాడుతూ - "కిల్లర్" సినిమాకు మేము చేసిన ప్రమోషన్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ క్రియేట్ చేసిందన్నారు. అయినా అనుకోని కారణాల వల్ల మేము ఆశించినంత థియేట్రికల్ రెస్పాన్స్ అయితే  రాలేదు. రూ. 2 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు మా సినిమకు దక్కాయి. ఓటీటీ, ఇతర బిజినెస్ కలిపి రూ. 8 కోట్ల రూపాయల దాకా రిటర్న్స్ వచ్చాయి. మా పెట్టుబడి 5 కోట్లకు రూ. 8 కోట్ల రూపాయలు రావడం వల్ల బిజినెస్ పరంగా లాభాల్లోనే ఉన్నాము. కోటి రూపాయల కాంటెస్ట్ గురించి ఆ వివరాలు చెప్పాలనుకుంటున్నాం. మేము సినిమా ఇంటర్వెల్ అయిన 5 నిమిషాలకు సెకండాఫ్ ట్విస్ట్ ఒక్క లైన్ లో పంపాలని చెప్పాము.  కానీ మా సినిమాకు కొన్ని చోట్ల రాత్రి 10, 10.30, 10.45 గంటలకు ప్రీమియర్స్ పడ్డాయి. అందుకే ఇచ్చిన 5 నిమిషాలు టైమ్ ను 30 నిమిషాలకు పెంచాము.  అందులో తమ సమాధానాలతో మాకు 5 వేల మంది స్క్రీన్ షాట్స్ పంపిన విషయానని ప్రస్తావించారు. వాటిలో మేము అనుకున్న ఆన్సర్ ఎవరూ చెప్పలేకపోయారు. అయినా దగ్గర దగ్గరగా ఆన్సర్ పంపిన 10 మందిని సెలెక్ట్ చేశాం. వారు నాగేంద్ర (హైదరాబాద్), సాగర్ (వైజాగ్), గోపి (హైదరాబాద్), హరి (వైజాగ్), కళ (వైజాగ్), ధృవ్ (హైదరాబాద్), వెంకట్ నాయుడు (హైదరాబాద్), భాను (హైదరాబాద్)కేశవశర్మ (వైజాగ్), మురళి (హైదరాబాద్), . వీరి ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున రూ. 10 లక్షల బహుమతి ఇవ్వబోతున్నాం. ఈ విజేతలతో కలిసి లంచ్ చేస్తాము. త్వరలో కిల్లర్ 2 సినిమా కూడా ఉంటుందని చెప్పుకొచ్చారు.  అన్నారు.

ఈ చిత్రంలో జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ , మనీష్ గిలాడ, చంద్రకాంత్ కొల్లు, అయినాబత్తిన దశరథ మాధవ్, విశాల్ రాజ్, అర్చన అనంత్, గౌతమ్ చక్రధర్ కొప్పిశెట్టి, తదితరులు ముఖ్యపాత్రల్లో నటించారు. 

Add Zee News as a Preferred Source
TAGS:
Tollywood
Telugu News
Telugu Movie