SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Mamitha Baiju Dating: టాలీవుడ్ యంగ్ హీరోతో మమితా బైజు ప్రేమాయణం..డిసెంబరులో పెళ్లికి లగ్గం..?

Mamitha Baiju Dating News: మలయాళ నటి మమితా బైజు 'ప్రేమలు' సినిమా సక్సెస్‌తో దక్షిణాది వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకొని ఇప్పుడు వరుసగా సినిమా ఆఫర్లు కొట్టేస్తుంది. అయితే ఆమె ప్రస్తుతం టాలీవుడ్‌కు చెందిన ఓ యంగ్ హీరోతో ప్రేమలో ఉన్నట్లు సమాచారం. వీరిద్దరూ డిసెంబరులో పెళ్లి పీటలెక్కనున్నట్లు తెలుగు చిత్రసీమలో చర్చ జరుగుతోంది.

Written By Harish Darla
Published: Oct 13, 2026, 05:38 PM IST | Updated: Oct 13, 2026, 05:56 PM IST
Image Credit: Source: AI-Generated Image
Join

Mamitha Baiju Dating News: కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తూ మలయాళ చిత్ర పరిశ్రమలో తనదైన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మలయాళ నటి మమితా బైజు.. 'ప్రేమలు' చిత్రంతో దక్షిణాది ప్రేక్షకులకు మరింత చేరువైంది. సహజమైన హావభావాలు, పాత్రకు తగ్గ భావోద్వేగాలు, చిలిపి చేష్టలతో కొద్ది కాలంలోనే కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్‌గా మారిపోయింది. ఈ ఒక్క ఏడాదే ఆమె ఏకంగా మూడు పెద్ద చిత్రాలలో నటించి అందరినీ ఆశ్చర్యపరిచింది.

విజయ్ తలపతి‌తో 'జన నాయగన్', సూర్యతో 'విశ్వనాథ్ అండ్ సన్స్', అలాగే నివిన్ పౌలితో 'బెత్లెహెమ్ కుటుంబ యూనిట్' సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలతో అలరించింది.

వివాహంపై ప్రచారం..
గత కొద్ది కాలంగా మమితా బైజు పెళ్లికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఆమె టాలీవుడ్‌కు చెందిన ఒక యంగ్ హీరోతో ప్రేమలో ఉన్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇటీవల వీళ్లిద్దరూ కలిసి ఒక ప్రైవేట్ పార్టీకి వెళ్లి రావడాన్ని ఒక ప్రముఖ మీడియా రిపోర్టర్ చూశారని వార్తలు వచ్చాయి. అంతేకాకుండా, వీరి వివాహానికి ఇరువైపుల ఇంట్లో వాళ్లు కూడా ఒప్పుకున్నారనీ, ఈ ఏడాది డిసెంబర్‌లో పెళ్లి చేసుకోబోతున్నారనీ నెట్టింట ప్రచారం ఊపందుకుంది.

చేతినిండా క్రేజీ ప్రాజెక్టులు..
ఈ ఏడాది హాట్రిక్ హిట్స్ అందుకున్న మమితా బైజు ప్రస్తుతం పలు ఆసక్తికరమైన చిత్రాల్లో నటిస్తోంది. తమిళంలో డీ. రామ్ దర్శకత్వంలో విష్ణు విశాల్ హీరోగా తెరకెక్కుతున్న రొమానిక డ్రామా 'ఇరండు వానమ్'లో ఈమె నటిస్తోంది. మరొకవైపు, దర్శకుడు ప్రశాంత్ వర్మ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న 'జై హనుమాన్' ప్రాజెక్ట్‌లోనూ ఓ కీలక పాత్ర పోషించే అవకాశం దక్కించుకుంది. ఈ 'జై హనుమాన్' చిత్రం విడుదలైన తర్వాత మమితా బైజు తెలుగులోనూ మరింత విశేష పాపులారిటీని సంపాదించుకోనుంది.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నాకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నాను. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశాను.

ZEENEWS TRENDING STORIES