SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Murali Mohan: ఎన్టీఆర్‌పై అభిమానంతోనే రాజకీయాల్లోకి వచ్చా.. నెగెటివిటీని కూడా ఎదుర్కొన్నా: మురళీమోహన్

Murali Mohan: తెలుగు సినీ పరిశ్రమలో సీనియర్ నటుడిగా మురళీమోహన్‌కు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఎన్నో సినిమాల్లో హీరోగా, సహాయ నటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. దాదాపు 350 సినిమాల్లో నటించిన ఆయన సినిమా రంగంతో పాటు వ్యాపార రంగంలోనూ మంచి పేరు సంపాదించారు. జయభేరి గ్రూప్ ద్వారా రియల్ ఎస్టేట్ రంగంలోనూ గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాకుండా రాజకీయాల్లోకి అడుగుపెట్టి ఎంపీగా కూడా పనిచేశారు.

Written By Vishnu Priya
Published: Nov 06, 2026, 08:15 PM IST | Updated: Nov 06, 2026, 08:22 PM IST
Join

Murali Mohan: తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మురళీమోహన్ తన రాజకీయ ప్రయాణం గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా తాను రాజకీయాల్లోకి ఎందుకు రావాల్సి వచ్చిందో వివరించారు. రాజకీయాల్లో ఉన్న సమయంలో ఎదురైన అనుభవాలు, నెగెటివిటీ గురించి కూడా మాట్లాడారు.

ఎన్టీఆర్‌పై అభిమానంతోనే రాజకీయాల్లోకి..

తనకు మొదటి నుంచి రాజకీయాలపై పెద్దగా ఆసక్తి లేదని మురళీమోహన్ తెలిపారు. అయితే సీనియర్ ఎన్టీఆర్‌పై ఉన్న అభిమానం, ప్రేమ, గౌరవం కారణంగానే రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చిన సమయంలో ఆయనకు మద్దతుగా నిలవాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు.

అప్పట్లో తెలుగు ప్రజలను దేశంలోని ఇతర ప్రాంతాల్లో మద్రాసీలుగా పిలిచేవారని ఆయన గుర్తుచేసుకున్నారు. తెలుగు ప్రజలకు ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలని, వారి ఆత్మగౌరవాన్ని దేశవ్యాప్తంగా చాటాలని ఎన్టీఆర్ ఎంతో కష్టపడ్డారని చెప్పారు. ఆయన ఆశయాలు నచ్చడంతో రాజకీయాల్లో తన వంతు పాత్ర పోషించానని వివరించారు.

యువతకు మురళీమోహన్ సలహా..

రాజకీయాల్లోకి రావాలనుకునే యువత ముందుగా తమ లక్ష్యాన్ని స్పష్టంగా నిర్ణయించుకోవాలని మురళీమోహన్ సూచించారు. డబ్బు సంపాదించడానికి, పేరు తెచ్చుకోవడానికి రాజకీయాల్లోకి రావడం సరైన పద్ధతి కాదని అభిప్రాయపడ్డారు. నిజంగా ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన ఉన్నప్పుడే రాజకీయాల్లోకి రావాలని చెప్పారు.

ఓటుకు డబ్బులు తీసుకోవద్దు..

2029 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి ఎవరు అవుతారనే ప్రశ్నకు ఆయన నేరుగా ఎవరి పేరును చెప్పలేదు. అయితే ఓటు విలువ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. డబ్బులు తీసుకొని ఓటు వేస్తే ప్రజలే తమ హక్కులను కోల్పోతారని అన్నారు.

ఓటుకు డబ్బులు తీసుకునే అలవాటు ఉంటే జీవితాంతం ఇతరులపై ఆధారపడాల్సి వస్తుందని హెచ్చరించారు. ప్రజాసేవ చేయగల అర్హత ఉన్న నాయకులను మాత్రమే ఎన్నుకోవాలని సూచించారు. ప్రస్తుతం మురళీమోహన్ చేసిన ఈ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
 

Read More: Amitabh House Bomb Threat: ముంబైలో మరోసారి బాంబు కలకలం..ఏకంగా అమితాబ్ బచ్చన్ ఇంటికే స్పాట్ పెట్టిన దుండగులు!

 

Read More:‘సమ్మర్ హాలీడేస్’ తెలుగు మూవీ రివ్యూ రేటింగ్.. మెప్పించిందా..!!

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.  

ZEENEWS TRENDING STORIES