• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /వినోదం
  • /తెలుగులోకి ఒడియా బ్లాక్‌బస్టర్ ‘జడి’.. క్రైమ్ కామెడీ డ్రామా గ్లింప్స్ చూశారా..!

తెలుగులోకి ఒడియా బ్లాక్‌బస్టర్ ‘జడి’.. క్రైమ్ కామెడీ డ్రామా గ్లింప్స్ చూశారా..!

Odia Blockbuster Jadi: ఒడియా ఇండస్ట్రీలో ఘనవిజయం అందుకున్న క్రైమ్ కామెడీ డ్రామా ‘జడి’ (ది అన్‌టోల్డ్ సైడ్ ఆఫ్ ఇఫ్) త్వరలో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.

Written ByAshok Krindinti
Published: Oct 26, 2026, 04:40 PM IST|Updated: Oct 26, 2026, 04:42 PM IST
joinshare
తెలుగులోకి ఒడియా బ్లాక్‌బస్టర్ ‘జడి’.. క్రైమ్ కామెడీ డ్రామా గ్లింప్స్ చూశారా..!

About the Author

Ashok Krindinti

Ashok Krindinti

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
సంప్రదాయ పంటలకు స్వస్తి.. చామంతి సాగుతో లక్షలు గడిస్తున్న అనంతపురం రైతు రఫీ..!!

సంప్రదాయ పంటలకు స్వస్తి.. చామంతి సాగుతో లక్షలు గడిస్తున్న అనంతపురం రైతు రఫీ..!!

2

తెలంగాణలో విద్యా సంక్షోభం.. 1,000 ప్రభుత్వ పాఠశాలలు మూతపడ్డాయి?: టీ. జీవన్ రెడ్డి

3

Uttar Pradesh: యూపీలో ఘోరం.. హోటల్ లో నవవధువు అనుమానాస్పద మృతి.. వీడియో వైరల్..

4

November 2026 Horoscope: నవంబర్‌లో ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం..లిస్టులో మీ రాశి ఉందా? చెక్ చేసుకోండి!

5

Rashmika Mandanna: విజయ్‌ను రెడ్ ఫ్లాగ్ అన్న ట్రోల్స్.. రష్మిక మందన్న ఘాటు సమాధానం!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Odia Blockbuster Jadi: ఒడియాలో సూపర్ హిట్‌గా నిలిచిన క్రైమ్ కామెడీ డ్రామా  మూవీ జడి (ది అన్‌టోల్డ్ సైడ్ ఆఫ్ ఇఫ్) త్వరలోనే తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. మెగా ప్రొడక్షన్స్ అధినేత ఉడుగుల అశ్విని కుమార్ గౌడ్ సమర్పణలో ఈ సినిమాలో తెలుగులో విడుదల కానుంది. శ్రీయాన్ష్ ప్రొడక్షన్స్ పతాకంపై కాజల్ రే నిర్మించిన ఈ చిత్రానికి దిబ్య జ్యోతి ఉదయ సింగ్ దర్శకత్వం వహించారు. సైలేంద్ర సమంతరాయ్, ప్రియంబద స్వైన్, ఆకాశ్ హోతా ప్రధాన పాత్రలు పోషించారు. సుశాంత్ దాస్ మహాపాత్ర, రబి మిశ్రా, బాలకృష్ణ నాయక్, కృష్ణ రౌత్ కీలక పాత్రల్లో నటంచారు. తాజాగా తెలుగు ప్రమోషన్స్‌లో భాగంగా గ్లింప్స్ రిలీజ్ చేశారు.

గ్లింప్స్‌లో పల్లెటూరి వాతావరణంలో సాగే ఈ కథలో కాలేజ్ యువకుల స్నేహం, అల్లరి, స్వచ్ఛమైన ప్రేమ ప్రధానంగా చూపించారు. కాలేజీలో ఫ్రెండ్స్ స్నేహం, అనుబంధాలు, ప్రేమ, ఫ్రెండ్స్ మధ్య గొడవ, ఊహించని మలుపులతో సీరియస్ క్రైమ్ డ్రామాగా మారుతుంది. జీవితంలో మనం తీసుకునే చిన్న చిన్న తప్పుడు నిర్ణయాలు, అనుకోని పరిస్థితులు ఎలాంటి సంక్షోభాలకు దారితీస్తాయి..? వాటి పరిణామాలు ఆ యువకుల భవిష్యత్తును, వారి బంధాలను ఎలా ప్రభావితం చేశాయి..? అనే అంశాలను ఉత్కంఠభరితమైన స్క్రీన్‌ప్లేతో, వినోదం , భావోద్వేగాలతో ఈ సినిమాలో చూపించినట్లు తెలుస్తోంది.  

గ్రామీణ వాతావరణం రుద్రకాంత సింగ్ తన కెమెరా పనితనంతో అద్భుతంగా తెరకెక్కించగా.. అభిషేక్ పనిగ్రాహి సమకూర్చిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మూవీకి మరింత ప్లస్ అయింది. తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యేలా రాకేందు మౌళి అందించిన డైలాగ్స్, పాటల సాహిత్యం ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. సోమేశ్ సత్పతి మ్యూజిక్ అందించగా.. మనస్ కుమార్ సాహూ ఎడిటర్‌గా పని చేశారు. తెలుగు వర్షన్ విడుదల తేదీని మేకర్స్ త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.

టెక్నీకల్ టీమ్:

  • సమర్పణ (తెలుగు): ఉడుగుల అశ్విని కుమార్ గౌడ్ (మెగా ప్రొడక్షన్స్)
  • నిర్మాత: కాజల్ రే (శ్రీయాన్ష్ ప్రొడక్షన్స్)
  • రచన, దర్శకత్వం: దిబ్య జ్యోతి ఉదయ సింగ్
  • తెలుగు డబ్బింగ్, మాటలు, పాటలు: రాకేందు మౌళి
  • సినిమాటోగ్రఫీ: రుద్రకాంత సింగ్
  • మ్యూజిక్: సోమేశ్ సత్పతి
  • బీజీఏం: అభిషేక్ పనిగ్రాహి
  • ఎడిటింగ్: మనస్ కుమార్ సాహూ
  • మార్కెటింగ్: స్టార్ సర్కిల్
  • PRO: సాయి సతీష్

 

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu Movie