• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /బిజినెస్
  • /సంప్రదాయ పంటలకు స్వస్తి.. చామంతి సాగుతో లక్షలు గడిస్తున్న అనంతపురం రైతు రఫీ..!!

సంప్రదాయ పంటలకు స్వస్తి.. చామంతి సాగుతో లక్షలు గడిస్తున్న అనంతపురం రైతు రఫీ..!!

Flower Farming: అనంతపురం జిల్లా నార్పల మండలం వెంకటాం గ్రామానికి చెందిన రైతు రఫీ... ప్రణాళికాబద్ధమైన సాగు విధానంతో వ్యవసాయంలో సరికొత్త విజయాన్ని అందుకోవడమే కాకుండా తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.

Written ByBhoomi
Published: Oct 26, 2026, 05:31 PM IST|Updated: Oct 26, 2026, 05:32 PM IST
joinshare
సంప్రదాయ పంటలకు స్వస్తి.. చామంతి సాగుతో లక్షలు గడిస్తున్న అనంతపురం రైతు రఫీ..!!
Image Credit: Flower Farming

About the Author

Bhoomi

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
పిల్లలకు చదువు చెప్పే గురువులకే అక్షరజ్ఞానం కరువు..  ప్రాథమిక ప్రశ్నలకు తడబడిన ప్రభుత్వ టీచర్లు.

పిల్లలకు చదువు చెప్పే గురువులకే అక్షరజ్ఞానం కరువు.. ప్రాథమిక ప్రశ్నలకు తడబడిన ప్రభుత్వ టీచర్లు.

2

Anna Lezhneva Instagram Deactivate: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా షాకింగ్ నిర్ణయం..ఏం జరిగిందంటే?

3

Mla Anirudh Reddy: నిధుల కోసం చావుకైన సిద్దమే.. సీఎం రేవంత్ ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే సెన్సెషనల్ కామెంట్స్..

4

సోమరిపోతు బద్ధకం వదిలించిన గుప్త నిధి రహస్యం.. కష్టాన్ని మించిన నిధి లేదని చెబుతున్న నీతి కథ..!!

5

‘జ‌య‌మ్ము నిశ్చ‌య‌మ్మురా’ సీజ‌న్‌2 టాక్ షోలో ఏపీ మంత్రి నారా లోకేశ్‌ సందడి.. మావయ్య డైలాగ్‌తో అదుర్స్..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Flower Farming: అనంతపురం జిల్లా నార్పల మండలం వెంకటాం గ్రామానికి చెందిన రైతు రఫీ... ప్రణాళికాబద్ధమైన సాగు విధానంతో వ్యవసాయంలో సరికొత్త విజయాన్ని అందుకోవడమే కాకుండా తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. రొటీన్‌గా వేసే సంప్రదాయ పంటల జోలికి వెళ్లకుండా.. మార్కెట్‌లో మంచి గిరాకీ ఉండే ప్రత్యామ్నాయ పంటల వైపు ఆయన మొగ్గు చూపారు. ముఖ్యంగా మార్కెట్ ట్రెండ్స్.. పండుగల సీజన్లలో ఉండే డిమాండ్‌ను ముందే ఊహించి అత్యంత వ్యూహాత్మకంగా సాగు ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు.

తనకున్న 6 ఎకరాల పొలాన్ని ఒకేసారి కాకుండా 2 ఎకరాల చొప్పున మూడు విభాగాలుగా వర్గీకరించుకుని.. విడతల వారీగా చామంతి నాట్లు వేశారు. దసరా, దీపావళి, సంక్రాంతి వంటి ప్రధాన పండుగల సమయానికి పూల దిగుబడి సరిగ్గా మార్కెట్‌కు వచ్చేలా కాలానుగుణంగా పంటను ప్లాన్ చేశారు. పండుగల వేళ చామంతి పూలకు మార్కెట్‌లో విపరీతమైన గిరాకీ ఉండటంతో ఆయనకు ఊహించిన దానికంటే అత్యధిక ధరలు దక్కుతున్నాయి. సరైన ఆలోచన, పక్కా ప్రణాళిక ఉంటే వ్యవసాయంలో అద్భుతమైన లాభాలు సాధించవచ్చని రైతు రఫీ నిరూపించారు.

రైతు రఫీ తన పొలంలో బుల్లెట్.. ఐశ్వర్య.. మస్కిన్ వైట్.. పెప్పర్ వెరైటీ.. పూర్ణిమ వంటి అనేక రకాల నాణ్యమైన చామంతి మొక్కలను సాగు చేస్తున్నాడు. రఫీ ఈ మొక్కలను  బెంగళూరు, హైదరాబాద్ నుండి  కొనుగోలు చేశాడు. రవాణా ఖర్చులతో సహా ఒక్కో మొక్కకు రూ. 1.50 చొప్పున మొత్తం రూ.2 ఖర్చు చేశాడు. తీవ్రమైన ఎండ నుండి రక్షించడానికి.. అతను కూలీలతో అర్ధరాత్రి 12 గంటల నుండి ఉదయం 4 గంటల వరకు.. మొక్కల మధ్య ఒక అడుగు దూరం ఉండేలా నాటించాడు. మొక్కలు ఆరోగ్యంగా ఉండేలా చూసుకుంటూ.. బిందు సేద్యం ద్వారా సరైన సమయంలో ఎరువులు.. సూక్ష్మపోషకాలను అందించాడు.  మొగ్గ దశ నుండే పురుగుమందులను వాడుతూ పంటను కాపాడుకున్నాడు.

చామంతి పువ్వుల కోతకు సుమారు 2 నెలల సమయం పడుతుందని రఫీ చెబుతున్నాడు. మొదటి కోతలో, 2 ఎకరాల నుండి 1 టన్ను పువ్వులను కోసి, కిలోకు రూ. 200 చొప్పున రూ. 2 లక్షలు సంపాదించినట్లు వెల్లడించాడు.  మొక్కలు నాటినప్పటి నుండి మొత్తం రూ. 2.25 లక్షల పెట్టుబడి పెట్టినట్లు పేర్కొన్నాడు. పెట్టిన పెట్టుబడి మొదటి పంట నుండే తిరిగి వస్తుంది.  మొత్తం లాభం రెండవ పంట నుండి సమకూరుతుంది. అనంతపురం మార్కెట్‌తో పాటు.. ఈ పువ్వులను బెంగళూరు, చెన్నై   మైసూరు వంటి ప్రధాన నగరాలకు ఎగుమతి చేస్తున్నట్లు రఫీ వివరించారు. వ్యాపారులు నేరుగా పొలాల నుండే కొనుగోలు చేయడం వల్ల రవాణా ఖర్చులు తగ్గుతాయని..  నాణ్యతను బట్టి, మొదటి రకానికి రూ. 275, రెండవ రకానికి రూ.150,  మూడవ రకానికి రూ.100 ధర లభిస్తుందని వెల్లడించారు. 

Also Read: 

డీఎస్సీ షార్ట్ నోటిఫికేషన్ పై నిరుద్యోగుల అసంతృప్తి...పోస్టులు పెంచాలని డిమాండ్..!!

Add Zee News as a Preferred Source
TAGS:
Business News
Telugu News