Bandla Ganesh: ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్‌కు ఏడాది జైలు శిక్ష.. మ్యాటర్ ఏమిటంటే..?
Bandla ganesh check bounce case: రూ. 95 లక్షల విలువైన చెక్ బౌన్స్ కేసులో ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ కు ఓంగోల్ కోర్టు ఏడది పాటు జైలు శిక్ష విధించింది. అంతే కాకుండారూ. 95 లక్షల జరిమాన సైతం విధించింది. ఈ ఘటన టాలీవుడ్ లో రచ్చగా మారింది.
Bandla ganesh 1 year jail sentenced by ongole court: టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. పవన్ కళ్యాన్ తో తీసిన గబ్బర్ సింగ్ మూవీతో ఆయన జీవతమే మారిపోయిందని చెప్తుంటారు. తరచుగా మెగాస్టార్ చిరంజీవితో పాటు, పవన్ కళ్యాణ్ లపై ఉన్న తన స్వామి భక్తిని చాటుకుంటు ఉంటారు. పవన్ కళ్యాణ్ పై ఎవరైన ట్రోల్స్ చేస్తే బండ్ల గణేష్ ఎంట్రీ ఇచ్చి ట్విటర్ వేదికగా వారికి కౌంటర్ లు వేస్తారు. అయితే.. తాజాగా.. బండ్ల గణేష్ ఊహించని చిక్కుల్లో పడ్డారు. చెక్ బౌన్స్ కేసులో ఒంగోలు కోర్టు ఏడాది సాధారణ జైలు శిక్ష విధించింది. అంతే కాకుండా..రూ. 95 లక్షల భారీ జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పునివ్వడం టాలీవుడ్ లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
బండ్ల గణేష్ జెట్టి వెంకటేశ్వర్లు అనే వ్యక్తికి తన నిర్మాణ సంస్థ ‘పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్’ పేరిట రూ. 95 లక్షల విలువైన చెక్ ఇచ్చారు. అయితే బ్యాంక్ లో మాత్రం నిధులు లేవు. దీంతో బాధితుడు చెక్ బౌన్స్ పై ఒంగోలు కోర్ట్ ను ఆశ్రయించాడు. దీనిపై సుదీర్ఘంగా విచారణ జరిగింది.
చివరగా ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం, బండ్ల గణేష్ ను దోషిగా ఒంగోలు కోర్టు తెల్చింది. ఈ నేపథ్యంలో ఆయనకు ఏడాది సాధారణ జైలు శిక్షతో పాటు రూ. 95 లక్షల జరిమానా విధించింది. అంతే కాకుండా.. జరిమానాతో పాటు, ఈ కేసు విచారణ నిమిత్తం బాధితుడికి అయిన కోర్టు ఖర్చులను సైతం బండ్ల గణేశే పూర్తిగా భరించాలని న్యాయమూర్తి తీర్పునిచ్చారు. గతంలో కూడా కూడా చెక్ బౌన్స్ కేసుల్లో బండ్ల గణేష్ వివాదాల్లో చిక్కుకున్న విషయం తెలిసిందే.