SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Radhika Apte Bold Comments: 5 సినిమాల్లో నగ్నంగా నటించిన బాలయ్య హీరోయిన్..దర్శకనిర్మాతలపై ఫైర్..ఎవరో ఆ బ్యూటీ!

Radhika Apte Bold Comments: సినిమా రంగంలో మహిళలను వస్తువుగా చూసే సంస్కృతి, వారి పట్ల ఉన్న సంకుచిత వైఖరిపై ప్రముఖ నటి రాధికా ఆప్టే తీవ్ర విమర్శలు చేశారు. కళాత్మక ప్రాధాన్యత ఉన్న సన్నివేశాల్లో నటించడాన్ని సాకుగా తీసుకుని, నిర్మాతలు కథతో సంబంధం లేని ఎక్స్‌పోజర్, శారీరక మార్పుల కోసం తనపై ఒత్తిడి తెచ్చారని ఆమె వెల్లడించారు. సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది నటీమణులు తమ హద్దులను దాటి కేవలం గ్లామర్‌ పాత్రలకే ప్రాధాన్యమిస్తున్నారని ఆమె తెలిపారు. అయితే ఈ నటి దాదాపుగా 5 సినిమాల్లో నగ్నంగా సన్నివేశాల్లో నటించడం గమనార్హం.

Written By Harish Darla
Published: Sep 19, 2026, 04:51 PM IST | Updated: Sep 19, 2026, 04:54 PM IST
Join

Radhika Apte Bold Comments: చిత్ర పరిశ్రమలో హీరోయిన్లు లేదా మహిళా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లు ఎదుర్కొంటున్న వృత్తిపరమైన ఒత్తిళ్లు, వారి పట్ల ఇండస్ట్రీలో ఉన్న వ్యతిరేక దృక్పథంపై నటి రాధికా ఆప్టే స్పందించారు. సినీ రంగంలో పాతుకుపోయిన వస్తురూప ధోరణితో పాటు హీరోయిన్ల పట్ల వ్యక్తమయ్యే ద్వంద్వ ప్రమాణాలను ఆమె ఎండగట్టారు.

సినిమా స్టోరీ, ఇండస్ట్రీ వాల్యూస్‌కు అనుగుణంగా కొన్ని బోల్డ్ లేదా నగ్న సన్నివేశాల్లో నటించడం ఓ నటిగా తన వృత్తిపరమైన నిర్ణయమని రాధికా ఆప్టే స్పష్టం చేశారు. అయితే, ఆ నిర్ణయాన్ని ఆసరాగా చేసుకుని కొందరు నిర్మాతలు, డైరెక్టర్లు ఆమె వ్యక్తిగత, హీరోయిన్‌తో ఉండే వారి హద్దులు మీరేందుకు ఎంతో ప్రయత్నించారని ఆమె అన్నారు.

సినిమా కథకు ఎలాంటి సంబంధం లేకపోయినా, కేవలం గ్లామర్ ప్రదర్శన కోసమే అనవసరమైన రీతిలో శరీరాన్ని ఎక్స్‌పోజ్ చేయాలని, పలు రకాల శారీరక మార్పులు చేసుకోవాలని తనపై దర్శక నిర్మాతలు ఒత్తిడి తెచ్చారని ఆమె పేర్కొన్నారు.

కథలోని అసలైన భావోద్వేగాలు, క్వాలిటీ స్క్రీన్‌ప్లే కంటే వాణిజ్యపరమైన గ్లామర్‌కే నిర్మాతలు, దర్శకులు పెట్టపీట వేస్తున్నారని నటి రాధిక ఆప్టే ఆరోపించారు. ఇలాంటి ఆలోచనలను స్వార్థపూరితమైనవని ఆమె స్పష్టం చేశారు. ఈ విధంగా తన వైఖరిని చెబుతూనే సినీ ఇండస్ట్రీలో పలువురు నిర్మాతలు, దర్శకుల తీరును ఎండగట్టారు.

కెమెరా ముందు మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ప్రవర్తించే కొన్ని పరిస్థితులపై హీరోయిన్ రాధిక ఆప్టే ఆవేదన వ్యక్తం చేశారు. దానితో పాటు హీరోయిన్లు తమ నటన, తెరపై చేసే ప్రదర్శనను పక్కనపెట్టి, కేవలం ప్రచారం, సంచలనం కోసమే పరిశ్రమలోని కొందరు ప్రాధాన్యమిస్తున్నారని ఆమె విమర్శించారు.  

ఇలాంటి తరహా కొన్ని ప్రతికూల పరిస్థితులు, సవాళ్లను అధిగమనిస్తూ, రాధికా ఆప్టే ఓ నటిగా ఎంతో గొప్ప నటిగా కీర్తి గడించారు. తాను కేవలం కమర్షియల్ ఒత్తిళ్లకు లొంగకుండా, ఆత్మగౌరవంతో, భావోద్వేగభరిత, కంటెంట్‌ ఉన్న పాత్రలనే ఎంచుకుంటున్నట్లు ఆమె చెప్పుకొచ్చింది.

అయితే ఈ హీరోయిన్ రాధికా ఆప్టే దాదాపుగా 5 సినిమాల్లో నగ్నంగా సన్నివేశాల్లో నటించింది. అప్పుట్లో ఆ చిత్రాలు, సన్నివేశాలపై ప్రజల నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన 'రక్త చరిత్ర' సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన హీరోయిన్ రాధికా ఆప్టే.. ఆ తర్వాత నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన 'లెజెండ్', 'లయన్' వంటి హిట్ చిత్రాల్లో నటించింది. అలాగే తమిళ సినిమాల్లో రజనీకాంత్ సరనస 'కబాలి' సినిమాలో అద్భుతమైన నటనతో ఆకట్టుకుంది. ఈ సినిమాలతో పాటు గ్లామర్ పాత్రలను కూడా పోషిస్తూ తనదైన ముద్ర వేసింది నటి రాధికా ఆప్టే.

Also Read: 'విశ్వంభర' Vs 'కాకా'..సంక్రాంతి రేసులో మెగాస్టార్ రెండు సినిమాలు? చరిత్రలో తొలిసారి!

Also REad: లైంగిక వేధింపుల కేసులో 'ఢీ' డ్యాన్సర్ రాజు అరెస్ట్..సినిమాల్లో ఛాన్స్ ఇస్తానని మోసం?
 


 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

Add Zee News as a Preferred Source

About the Author

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.

ZEENEWS TRENDING STORIES