SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

విడుదలకు ముందే ‘రామాయణ’ పై ఈ స్థాయి నెగిటివిటీ ఏంటి.. అసలేం జరుగుతోంది..

Ramayana Negative Compaign: ‘రామాయణ’ సినిమా నవంబర్ 5న దీపావళి కానుకగా విడుదల కాబోతుంది. ఇప్పటికే మేకర్స్ ప్రచారాన్ని ఉదృతం చేశారు. ఎంత చేసిన ఈ భారీ బడ్జెట్ పౌరాణిక చిత్రంలోని గ్రాఫిక్స్‌తో పాటు అందులో నటించిన నటీనటుల పర్సనల్ విషయాలను టార్గెట్ చేస్తూ రామాయణ మహా కావ్యంపై తెరకెక్కిన ఈ చిత్రంపై విష ప్రచారం చేయడం పీక్స్‌కు చేరింది. ఇక  ఈ సినిమా ట్రైలర్ లోని గ్రాఫిక్స్ పై సోషల్ మీడియాలో ట్రోల్స్ ఓ రేంజ్‌లో జరిగింది.  VFX విషయంలో చిన్న చిన్న తప్పులు వెతకడం మానేసి.. సినిమాను ఓపెన్ మైండ్‌తో చూడాలని ప్రేక్షకులను ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరైన యశ్  అభ్యర్ధించిన సంగతి తెలిసిందే కదా. ఇక నమిత్ మల్హోత్రా లాంటి ప్యాషన్ ఉన్న నిర్మాతలను సపోర్ట్ చేయకపోతే ఇండియన్ సినిమా ఎన్నో ఏళ్లు వెనక్కి వెళ్తుందని చెప్పుకొచ్చారు.

Written By TA Kiran Kumar Sharma
Published: Oct 31, 2026, 12:04 PM IST | Updated: Oct 31, 2026, 12:30 PM IST
Image Credit: Ramayana Part 1
Join

Ramayana Negative Compaign: ‘రామాయణ’ సినిమా నవంబర్ 5న దీపావళి కానుకగా విడుదల కాబోతుంది. ఇప్పటికే మేకర్స్ ప్రచారాన్ని ఉదృతం చేశారు. ఎంత చేసిన ఈ భారీ బడ్జెట్ పౌరాణిక చిత్రంలోని గ్రాఫిక్స్‌తో పాటు అందులో నటించిన నటీనటుల పర్సనల్ విషయాలను టార్గెట్ చేస్తూ రామాయణ మహా కావ్యంపై తెరకెక్కిన ఈ చిత్రంపై విష ప్రచారం చేయడం పీక్స్‌కు చేరింది. ఇక  ఈ సినిమా ట్రైలర్ లోని గ్రాఫిక్స్ పై సోషల్ మీడియాలో ట్రోల్స్ ఓ రేంజ్‌లో జరిగింది.  VFX విషయంలో చిన్న చిన్న తప్పులు వెతకడం మానేసి.. సినిమాను ఓపెన్ మైండ్‌తో చూడాలని ప్రేక్షకులను ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరైన యశ్  అభ్యర్ధించిన సంగతి తెలిసిందే కదా. ఇక నమిత్ మల్హోత్రా లాంటి ప్యాషన్ ఉన్న నిర్మాతలను సపోర్ట్ చేయకపోతే ఇండియన్ సినిమా ఎన్నో ఏళ్లు వెనక్కి వెళ్తుందని చెప్పుకొచ్చారు.

బడ్జెట్‌కు తగ్గ క్వాలిటీ లేదనే విమర్శలు.. 
రామాయణ ఫస్ట్ గ్లింప్స్ విడుదలైనప్పటి నుంచి బడ్జెట్‌కు తగ్గ క్వాలిటీ లేదంటూ విమర్శలు వెల్లువెత్తాయి. ఈ మధ్యే వచ్చిన కొత్త ట్రైలర్‌కు మాత్రం మంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ కొందరు  విజువల్స్‌పై కామెంట్స్ చేస్తుండటంతో.. మైనర్ మిస్టేక్స్ వదిలేసి అంతా ఒకటై సినిమాను సపోర్ట్ చేయాలని యశ్ పిలుపునిచ్చారు. అప్పుడే ఇంటర్నేషనల్ రేంజ్‌లో ఇండియన్ సినిమా సత్తా చాటుతుందన్నారు.

రామాయణ క్యాస్ట్ అండ్ క్రూ పై  నెగిటివిటీ.. 
నితీష్ తివారీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన రామాయణ పార్ట్ 1 నవంబర్ 5న విడుదల కానుంది. ఇందులో రణ్‌బీర్ రాముడిగా, సాయి పల్లవి సీతమ్మగా, యశ్ రావణుడిగా నటించిన సంగతి తెలిసిందే కదా. ఇండియన్ సినిమాని నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లే ఇలాంటి సినిమాను విమర్శలతో నిరుత్సాహపరచకూడదన్నారు యశ్. ఇక ఈ సినిమాలో నటించిన రణ్‌బీర్ కపూర్ పై కొంత మంది అతని మాటలను ప్రస్తావిస్తున్నారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో  బీఫ్ తింటానని చెప్పుకొచ్చాడు. ఇలా బీఫ్   తినేవాడిని రాముడి పాత్రలో ఎలా తీసుకున్నారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

 

సాయి పల్లవి కామెంట్స్..

ఇక నక్సల్స్‌తో పాటు టెర్రరిస్టులను  పాకిస్థానీలపను ప్రేమించే సాయి పల్లవి సీత పాత్రకు చేయడం ఏమిటనే ప్రశ్న ఉదయించింది. తాజాగా  రావణాసురుడు మంచోడు అనే కామెంట్స్ చేయడం అగ్గి మీద పెట్రోల్ పోసినట్టైయింది.  ఇక హిందువు నుంచి ముస్లిమ్‌గా మారిన ఏ.ఆర్.రెహమాన్ ఈ సినిమాకు మ్యూజిక్ కు ఇవ్వడంపై సోషల్ మీడియా వేదికగా వాళ్లు గతంలో చేసిన కామెంట్స్‌ను పోస్ట్ చేస్తున్నారు.

 ఇక నటీనటులు వ్యక్తిగత ప్రవర్తన ఇలాంటి సినిమాల విషయంలో రిఫ్లెక్ట్ అవుతుందని కొంత మంది అంటే.. సినిమా వేరు నిజ జీవితం వేరు. వారు ఎంత బాగా యాక్ట్ చేశారన్నది చూడాలనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.  ఏది ఏమైనా కంటెంట్ బాగుంటే ఇలాంటి ట్రోల్స్ అన్ని గాలికి కొట్టుకుపోతాయనే వాళ్లున్నారు. 

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES