SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

తల్లిగా ప్రమోషన్ పొందిన సమంత.. ఇన్‌స్టాగ్రామ్‌లో స్పెషల్ పోస్ట్.. కొడుకు పేరు ఏంటో తెలుసా?

ప్రముఖ నటి సమంత.. ప్రముఖ దర్శకుడు రాజ్ నిడిమోరు తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందారు. నిన్న ( నవంబర్ 19)న సమంత పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు.

Written By Bhoomi
Published: Nov 20, 2026, 14:00 IST | Updated: Nov 20, 2026, 14:01 IST
Image Credit: Samantha
Join

ప్రముఖ నటి సమంత.. ప్రముఖ దర్శకుడు రాజ్ నిడిమోరు తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందారు. నిన్న ( నవంబర్ 19)న సమంత పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ శుభవార్తను సమంత నేడు తన అధికారిక ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా ఫ్యాన్స్ తో షేర్ చేసుకున్నారు. తమ మొదటి సంతానం రాకతో ఆనందంలో మునిగిపోయిన ఈ దంపతులు.. తమ కుమారుడికి దేవ్ నిడిమోరు అని నామకరణం చేశారు. ఈ సందర్బంగా బాబు మొదటి ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసిన సమంత.. ఎమోషనల్ క్యాప్షన్ ను జత చేశారు. మా అందమైన మగబిడ్డ..దేవ్ నిడిమోరు.. 19.11.2026. మా హృదయాలు ఇంతకంటే సంతోషంగా ఎప్పుడూ లేవు అంటూ సమంత తన ఆనందాన్ని వ్యక్తపరిచారు.

కాగా డిసెంబర్ 1, 2025న వివాహ బంధంతో ఒక్కటైన సమంత, రాజ్ నిడిమోరు జీవితంలో ఈ కొత్త అధ్యాయం మొదలవ్వడంతో వారి కుటుంబాల్లో సంతోషం వెల్లివిరుస్తోంది. సమంత పోస్ట్ చేసిన కొద్దిసేపటికే ఈ ఫొటో నెట్టింట్లో వైరల్ అయ్యింది. సినీప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా సమంతకు, చిన్నారి దేవ్ నిడిమోరుకు శుభాకాంక్షలు, ఆశీస్సులు తెలుపుతున్నారు. 
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

ZEENEWS TRENDING STORIES