SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Shriya Saran: దుస్తులను తీసేస్తున్నారు.. శరీర భాగాల సైజులు పెంచుతున్నారు.. శ్రియా శరణ్ ఆవేదన

Shriya Saran: కృత్రిమ మేధస్సు (ఏఐ) టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎన్నో పనులు సులభంగా మారాయి. అయితే కొందరు ఈ టెక్నాలజీని తప్పుగా ఉపయోగిస్తూ ఇతరులకు ఇబ్బందులు కలిగిస్తున్నారు. ముఖ్యంగా సినీ హీరోయిన్ల ఫోటోలు, వీడియోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. తాజాగా నటి శ్రియా శరణ్ కూడా ఏఐ దుర్వినియోగంపై తన ఆవేదనను వ్యక్తం చేశారు.

Written By Vishnu Priya
Published: Oct 15, 2026, 06:14 PM IST | Updated: Oct 15, 2026, 06:19 PM IST
Join

Shriya Saran: సినిమా పరిశ్రమలో డీప్‌ఫేక్ వీడియోలు, మార్ఫింగ్ ఫోటోల సమస్య రోజురోజుకు పెరుగుతోంది. కొందరు వ్యక్తులు హీరోయిన్ల అసలు ఫోటోలను తీసుకుని, ఏఐ సాయంతో వాటిని అసభ్యకరంగా మారుస్తున్నారు. వారి అనుమతి లేకుండానే ఇలాంటి ఫోటోలను ఇంటర్నెట్‌లో ప్రచారం చేస్తున్నారు. గతంలో రష్మిక మందన్న, కత్రినా కైఫ్ వంటి నటీమణులు కూడా డీప్‌ఫేక్ సమస్యను ఎదుర్కొన్నారు. తాజాగా శ్రియా శరణ్ చేసిన వ్యాఖ్యలు ఈ అంశంపై మరోసారి చర్చకు దారితీశాయి.

ఒక జాతీయ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రియా శరణ్ ఈ విషయంపై మాట్లాడారు. ఏఐ సాయంతో మహిళల ఫోటోలను మార్చడం, వారి శరీరాల గురించి అసత్యమైన చిత్రాలను సృష్టించడం చాలా తప్పు అని ఆమె అన్నారు.

తన ఫోటోలను కూడా కొందరు ఏఐ ద్వారా మార్చుతున్నారని శ్రియా వెల్లడించారు. ఫోటోలలో తాము ధరించిన దుస్తులను తొలగించినట్లుగా చూపించడం, శరీర భాగాల పరిమాణాలను మార్చడం వంటి పనులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో కనిపించే కొన్ని ఫోటోలను చూస్తే, అవి నిజంగా తనవేనా అనే సందేహం కలుగుతుందని చెప్పారు.

ఇలాంటి ఘటనలను కొందరు సెలబ్రిటీలు సరదాగా తీసుకుంటున్నారని శ్రియా అభిప్రాయపడ్డారు. కానీ తనకు మాత్రం ఇలాంటి చర్యలు బాధను, చిరాకును కలిగిస్తాయని స్పష్టం చేశారు. మహిళల గౌరవానికి భంగం కలిగించే పనులను తేలికగా తీసుకోకూడదని ఆమె సూచించారు. 

టెక్నాలజీ మానవ జీవితాలను సులభతరం చేయడానికి ఉపయోగపడాలని శ్రియా శరణ్ అన్నారు. ఇతరులను వేధించడానికి, ముఖ్యంగా మహిళల గౌరవాన్ని దెబ్బతీయడానికి దానిని ఉపయోగించకూడదని పేర్కొన్నారు. ఏఐ వల్ల కలిగే ప్రమాదాలను ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలని సూచించారు.

Read More: Puneeth Rajkumar Death: పునీత్ రాజ్‌కుమార్ మరణానికి ముందు చివరి గంటన్నరలో ఏం జరిగింది?

Read More: Jailer 2 Review: ‘జైలర్ 2’ మూవీ రివ్యూ.. రజినీకాంత్ మ్యాజిక్ రిపీట్ అయిందా..!

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.  

ZEENEWS TRENDING STORIES