Woman arrested after laced colleagues curry with snail poison: ఇటీవల సమాజంలో చుట్టుపక్కల కొంత మంది మరీ దిగజారీ రాజకీయాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఎక్కడ చూసిన కడుపులో కత్తులను పెట్టుకుని నీచంగా ప్రవర్తిస్తున్నారు. పైకి మాత్రం నవ్వుతూనే.. తేనే పూసిన కత్తుల్లా తియ్యగా మాట్లాడుతూనే అదునుకోసం కాచుకుని ఉండే వారు మరీ ఎక్కువయ్యారు. ఇలాంటి వారు ఒకరకమైన అభద్రతా భావంలో ఉంటూ అరాచకాలు చేస్తారు. ఒకరకమైన సైకోలుగా మారి నచ్చని వారితో గొడవలు పెట్టుకొవడం, అకారణంగా కయ్యానికి కాలుదువ్వడం వంటివి చేస్తుంటారు.
ఇక మరికొంత మంది పైకి బాగున్నట్లే నటిస్తు నచ్చని వారిని చంపడానికి సైతం వెనుకాడరు. ఇలాంటి ఘటనలు నిత్యం మనం వార్తలలో చూస్తుంటాం. తాజాగా.. ఆస్ట్రేలియాలోని పెర్త్ లో ఒక మహిళ తన సహోద్యోగిని చంపేందుకు ఏకంగా కర్రీలో విషం కల్పింది. ఈ ఘటన ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.
ఆస్ట్రేలియాలోని పెర్త్ లో షాకింగ్ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పెర్త్ దక్షిణ శివారు ప్రాంతంలోని ఓల్డ్బరీలో ఉన్న ఒక కార్యాలయంలో ఈ దారుణం చోటు చేసుకుంది. గోల్డెన్ బేకు చెందిన 43 ఏళ్ల మహిళ ఇటీవల తన టిఫిన్ లోని కర్రీని తన సహోద్యోగికి ఇచ్చింది. ఆమె ఎంతో ఇష్టంతో దాన్ని తినింది. ఇక మధ్యాహ్నం మరోసారి తినేందుకు రావడంతోనే అదే టిఫిన్ బాక్స్ లో ఆకుపచ్చని రంగులో గుళికలను ఆమె గమనించింది. కొద్దిగా కర్రీ తిన్న తర్వాత ఆమె నాలుక అంతా మొద్దు బారిపోవడంను ఆమె గుర్తించింది.
వెంటనే ఆమె ఆస్పత్రికి వెళ్లింది. అప్పటికే సదరు మహిళ అక్కడి నుంచి మెల్లగా జారుకుంది. ఈ క్రమంలో సరైన సమయంలో ట్రీట్మెంట్ అందడంతో ఆమె ప్రాణాపాయం నుంచి బైటపడింది. ఆ తర్వాత బాధిత మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి విచారణ చేపట్టారు. అక్కడి సిబ్బంది టిఫిన్ బాక్స్ ను స్వాధీనం చేసుకున్నారు.
దానిలో నీలిరంగు గుళికలను గమనించారు. వెంటనే దాన్ని ల్యాబ్ కు తరలించారు. ఈ క్రమంలో ల్యాబ్ లో టెస్టులు చేయగా అవి నత్తలను చంపే విషపు గుళికలుగా విషయం బైటపడింది. అయితే.. గతంలొ పోలీసులు విచారణలో పలు విషయాలపై విచారణలో నెగ్లీజెన్సీగా ప్రవర్తించినట్లు తాజాగా.. బాధితురాలు ఆరోపించడంతో మరల దీనిపై విచారణ చేపట్టారు.
సదరు మహిళకు, తోటి ఉద్యోగికి కొన్ని సంబంధం ఉందని, ఇటీవల గొడవలుజరగడంతోనే ఈ ఘటనకు పాల్పడి ఉంటుందని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. అయితే అభియోగాలు ఎదుర్కొంటున్న సదరు 43 ఏళ్ల మహిళ ఒక రసాయన నిల్వ షెడ్డులోకి నడిచి వెళ్లినట్లు సీసీ ఫుటేజీలో పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత సిబ్బంది గదిలోకి వెళ్లి నత్తలను చంపేదుకు గుళికల గదిలోకి వెళ్లినట్లు గమనించారు. ఈ క్రమంలో సదరు మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. నవంబర్ 5న కోర్టులో దీనిపై విచారణ జరగనుంది. ఈ ఘటన వైరల్ కావడంతో నెటిజన్లు సైతం ఇదెక్కడి సైకోరా బాబు అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.