SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Surekha Vani: ప్రైవేట్ వీడియోల వివాదం.. పోలీసులకు ఫిర్యాదు చేసిన సురేఖా వాణి..!

Surekha Vani: టాలీవుడ్ నటి సురేఖా వాణి ప్రస్తుతం ప్రైవేట్ వీడియోల వివాదంతో వార్తల్లో నిలిచారు. తనకు సంబంధించిన కొన్ని వ్యక్తిగత వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన అనుమతి లేకుండా వ్యక్తిగత విషయాలను ప్రచారం చేయడం వల్ల మానసికంగా ఎంతో ఇబ్బందికి గురవుతున్నానని తెలిపారు. అంతేకాకుండా ఈ వ్యవహారంపై తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు.

Written By Vishnu Priya
Published: Nov 07, 2026, 06:53 PM IST | Updated: Nov 07, 2026, 06:58 PM IST
Join

Surekha Vani: సురేఖా వాణి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్నో సినిమాల్లో అక్కగా, వదినగా, తల్లిగా విభిన్న పాత్రలు పోషించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సినిమాలతో పాటు సోషల్ మీడియాలో కూడా ఆమె చాలా యాక్టివ్‌గా ఉంటారు. ముఖ్యంగా తన కుమార్తె సుప్రీతతో కలిసి చేసే రీల్స్, ఫొటోలు తరచూ నెట్టింట వైరల్ అవుతుంటాయి.

అయితే గత కొన్ని రోజులుగా ఆమెకు సంబంధించినవిగా చెబుతున్న కొన్ని ప్రైవేట్ వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ వీడియోలు మొదట ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కనిపించి ఆ తర్వాత తొలగిపోయినట్లు ప్రచారం జరిగింది. దీంతో ఈ వ్యవహారంపై అనేక రకాల చర్చలు మొదలయ్యాయి. మరోవైపు ఆ వీడియోలు నిజమైనవా, మార్ఫింగ్ చేసినవా అనే విషయంపై కూడా సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ వివాదంపై సురేఖా వాణి ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా స్పందించారు. తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా హ్యాక్ అయిందని, తన అనుమతి లేకుండానే వ్యక్తిగత కంటెంట్ బయటకు వెళ్లిందని ఆమె పేర్కొన్నారు. తన వ్యక్తిగత జీవితాన్ని ఆధారంగా చేసుకుని అసత్య ప్రచారం చేయవద్దని కోరారు.


అయితే కొన్ని సోషల్ మీడియా పేజీలు, యూట్యూబ్ ఛానెళ్లు ఆ వీడియోలను ఇంకా ప్రచారం చేస్తుండటంతో ఆమె మరోసారి స్పందించారు. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో వీడియో విడుదల చేసి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.

తన వ్యక్తిగత విషయాల గురించి అసత్య ప్రచారం చేయడం వల్ల ఎంతో మానసిక బాధకు గురవుతున్నానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేశానని తెలిపారు. తనకు సంబంధించిన వీడియోలను షేర్ చేసిన వారు వెంటనే వాటిని తొలగించాలని కోరారు.

ఎవరైనా తన అనుమతి లేకుండా వ్యక్తిగత వీడియోలను పోస్టు చేసినా, ఇతరులకు పంపించినా చట్టపరమైన చర్యలు తీసుకుంటానని స్పష్టం చేశారు. క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి కూడా వెనుకాడబోనని హెచ్చరించారు.

ఈ సమస్యపై వెంటనే స్పందించిన తెలంగాణ పోలీసులకు సురేఖా వాణి కృతజ్ఞతలు తెలిపారు. సెలబ్రిటీలు అయినా సాధారణ వ్యక్తులు అయినా ప్రతి ఒక్కరికీ వ్యక్తిగత గోప్యత ఉంటుందని ఈ ఘటన మరోసారి చర్చకు తెచ్చింది. ఇతరుల ప్రైవేట్ కంటెంట్‌ను అనుమతి లేకుండా షేర్ చేయడం తప్పు అనే విషయాన్ని నెటిజన్లు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది.
 

Read More: Vivek Oberoi: రామాయణం రెమ్యునరేషన్ రూ. 6 కోట్లు విరాళం.. నిజ జీవితంలో రియల్ హీరో అనిపించుకున్న వివేక్ ఒబెరాయ్!

 

Read More:పండక్కి ‘కాకా’వెనక్కి తగ్గేదే లే.. మెగాధీమా అదేనా..!!

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.  

ZEENEWS TRENDING STORIES