Tamannaah Bhatia: హీరోయిన్ తమన్నా భాటియా మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. అయితే ఈసారి ఆమె సినిమా, ఫ్యాషన్ లేదా కొత్త ప్రాజెక్ట్ కారణంగా వార్తల్లోకి రాలేదు. ఆమె చేతిలో కనిపించిన ఆధార్ కార్డు కారణంగా నెటిజన్ల దృష్టి మొత్తం తమన్నాపై పడింది. ముఖ్యంగా ఆ కార్డులో ఉన్న తమన్నా ఫోటో చూసి చాలామంది సరదాగా కామెంట్లు చేస్తున్నారు.