SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్‌తో ‘జో జో’ కాష‌న్ 1’ .. తెలుగు తెరపై మరో రూర‌ల్ కామెడీ డ్రామా..

Jo Jo Caution 1 Teaser: తెలుగు ప్రేక్షకులు ఎపుడు వైవిధ్యమైన కథలను ఇష్టపడుతుంటారు. ఈ నేపథ్యంలో తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న చిత్రం ‘జో జో’. త్వరలో ఈ సినిమాను రిలీజ్ కాబోతుంది. సోమ‌వారం ఈ చిత్రానికి సంబంధించిన వీడియో గ్లింప్స్‌ను కాష‌న్ 1 పేరుతో రిలీజ్ చేశారు మేకర్స్. అంతేకాదు ఈ గ్లింప్స్‌లో ఈ సినిమా కంటెంట్ ఏంట‌నే విష‌యాన్ని రివీల్ చేశారు.

Written By TA Kiran Kumar Sharma
Published: Oct 12, 2026, 05:08 PM IST | Updated: Oct 12, 2026, 08:18 PM IST
Image Credit: Jo Jo (X/Source)
Join

Jo Jo Caution 1: కృష్ణ క‌మ‌ల్ , మ‌హి హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతోన్న  రూర‌ల్ కామెడీ డ్రామా ‘జో జో’. రాయ‌ల‌సీమ బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్కిస్తున్నారు .  ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు దేవ‌క‌ట్టా స‌మ‌ర్ప‌ణ‌లో కిర‌ణ్ జ‌య్ కుమార్ డైరెక్షన్ చేస్తున్నారు.  విజ‌యం బ్యాన‌ర్‌పై విజ‌య్ కృష్ణ లింగ‌మ‌నేని ఈ చిత్రాన్ని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా  నిర్మిస్తున్నారు.

వీడియో గ్లింప్స్..
తాజాగా విడుదలైన వీడియో గ్లింప్స్ విషయానికొస్తే.. రాయ‌ల‌సీమ‌లోని జొన్న‌గిరి నేప‌థ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. వ‌ర్షాలు ప‌డిన‌ప్పుడు రాయలసీమలో వ‌జ్రాలు దొరుకుతాయ‌నే వార్త‌లు మ‌నం వింటూనే ఉంటున్నాము. ఆ పాయింట్‌ను ఆధారంగా చేసుకుని రూర‌ల్ ల‌వ్ స్టోరీగా కామెడీ ట‌చ్‌తో మేక‌ర్స్ ‘జో జో’ సినిమా రాబోతుంది.

ఈ కాష‌న్ వీడియో గ‌మ‌నిస్తే.. మ‌నోభావాల బ్యాచ్ దూరంగా ఉండండి అనే క్యాప్ష‌న్‌తోనే ఇది స్టార్ట్ అవుతుంది. వ‌ర్షం ప‌డిన త‌ర్వాత పొలంలో హీరో హీరోయిన్‌తో పాటు కొంద‌రు వ‌జ్రాల‌ను వెతుకుతుంటారు. హీరోయిన్‌కు ఓ రాయి దొర‌కుతుంది. ఆమెను ప్రేమించే హీరో ఆమె ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి మాట్లాడే ప్ర‌య‌త్నం చేస్తాడు. అయితే ఆమె అత‌డ్ని ఓ బూతు మాట‌తో నోరు మూయించేస్తుంది. ఆ మాట విని హీరోతో పాటు.. అక్క‌డున్న హీరో ఫ్రెండ్ కూడా షాక‌వుతాడు. అయితే హీరో దాన్ని కూడా మోటు స‌ర‌సం అంటూ క‌వ‌ర్ చేయ‌టం.. చూస్తే న‌వ్వు తెప్పిస్తుంది.

రా ర‌స్టిక్ రొమాంటిక్ చిత్రం  త్వ‌ర‌లోనే ఆడియన్స్ ముందుకు రాబోతుంది. కాష‌న్ వ‌న్ వీడియోతో సినిమాపై మేక‌ర్స్ క్యూరియాసిటీ క్రియేట్ చేశారు.  చిత్రానికి సంబంధించిన మరిన్ని అప్‌‌డేట్స్ త్వరలోనే ఇవ్వనున్నట్టు తెలిపారు.  

 

Add Zee News as a Preferred Source

About the Author

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES