New Governors Appointments: దేశంలోని పలు కీలక రాష్ట్రాలకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కొత్త గవర్నర్లను నియమించారు. సోమవారం రాత్రి ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. ఇద్దరికి ఇన్‌చార్జ్ బాధ్యతలు తప్పించి పూర్తి స్థాయి బాధ్యతలు ఇవ్వగా.. మరో నాలుగు రాష్ట్రాలకు కొత్త వారిని గవర్నర్లకు రాష్ట్రపతి నియమించారు. కేంద్ర మంత్రివర్గం చేసిన సిఫారసులకు రాష్ట్రపతి ఆమోదం తెలిపి కొత్త గవర్నర్ల నియామకం చేపట్టారు. ఏ రాష్ట్రానికి ఎవరెవరిని నియమించారో తెలుసుకుందాం.
కేరళం గవర్నర్‌గా ఓం ప్రకాశ్ మాథూర్ రాష్ట్రపతి నియమించారు. ఇక తమిళనాడు పూర్తిస్థాయి గవర్నర్‌గా రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్‌ను నియమించగా.. సిక్కిం గవర్నర్‌గా ఉన్న ఓం ప్రకాశ్ మాథూర్‌ను కేరళం గవర్నర్‌ను బదిలీ చేశారు. ఇక మిగిలిన నాలుగు గవర్నర్లను కొత్త వారిని రాష్ట్రపతి నియమించారు. ఒడిశా గవర్నర్‌గా బ్రజ్ మోహన్ రాయ్, కర్ణాటకకు డాక్టర్ సుధా యాదవ్, ఉత్తరఖండ్ డాక్టర్ ధల్‌సింగ్ బిసెన్, సిక్కిం గవర్నర్‌గా దుష్యంత్ గౌతమ్‌ను నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు.
కొత్త గవర్నర్లు వీరే..!
సిక్కిం గవర్నర్ ఓం ప్రకాష్ మాథూర్ కేరళ గవర్నర్‌గా బదిలీ
కేరళం గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ తమిళనాడు గవర్నర్‌గా బదిలీ
ఒడిశా గవర్నర్‌గా బ్రజ్ మోహన్ రామ్
కర్ణాటక గవర్నర్‌గా సుధా యాదవ్
ఉత్తరాఖండ్ గవర్నర్‌గా ధల్ సింగ్ బిసెన్
సిక్కిం గవర్నర్‌గా దుష్యంత్ గౌతమ్