• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /ECI Form 6 SIR Controversy: ఓటర్ల జాబితా సవరణ వివాదం.. SIR ‘ఫారం-6’పై కేంద్ర ఎన్నికల సంఘం క్లారిటీ

ECI Form 6 SIR Controversy: ఓటర్ల జాబితా సవరణ వివాదం.. SIR ‘ఫారం-6’పై కేంద్ర ఎన్నికల సంఘం క్లారిటీ

ECI Form 6 SIR Controversy: SIR ప్రక్రియలో ‘ఫారం-6’ను నిబంధనలకు విరుద్ధంగా మార్చారంటూ వస్తున్న ఆరోపణలను కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా ఖండించింది. ఫారంలో ఎలాంటి మార్పులు చేయలేదని.. జాబితా పవిత్రతను కాపాడేందుకు అదనపు డిక్లరేషన్‌ను కోరే పూర్తి పరిపాలనాధికారం కమిషన్‌కు ఉందని సుప్రీంకోర్టు గత తీర్పులను ఉటంకిస్తూ స్పష్టం చేసింది. వివరాలు ఇలా..

Written ByAshok Krindinti
Published: Oct 12, 2026, 08:27 PM IST|Updated: Oct 12, 2026, 08:29 PM IST
joinshare
ECI Form 6 SIR Controversy: ఓటర్ల జాబితా సవరణ వివాదం.. SIR ‘ఫారం-6’పై కేంద్ర ఎన్నికల సంఘం క్లారిటీ
Image Credit: Election Commission of India (Source: ANI)

About the Author

Ashok Krindinti

Ashok Krindinti

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
ECI Form 6 SIR Controversy: ఓటర్ల జాబితా సవరణ వివాదం.. SIR ‘ఫారం-6’పై కేంద్ర ఎన్నికల సంఘం క్లారిటీ

ECI Form 6 SIR Controversy: ఓటర్ల జాబితా సవరణ వివాదం.. SIR ‘ఫారం-6’పై కేంద్ర ఎన్నికల సంఘం క్లారిటీ

2

Srikanth Daughter Medha: శ్రీకాంత్ కుమార్తె మేధ హీరోయిన్‌గా ఎంట్రీ.. హీరో ఎవరో తెలుసా?

3

Tragedy Accident: విజయవాడలో ఘోర ప్రమాదం.. బైపాస్‌ రోడ్డులో ఈవీ కారు దగ్ధమై నలుగురు మృతి

4

AP Municipal Reservations: ఏపీలో మేయర్‌, మున్సిపల్‌ చైర్మన్‌ రిజర్వేషన్లు ఖరారు.. మహిళలకు 50 శాతం రిజర్వ్‌

5

పవన్ కళ్యాణ్@30ఇయర్స్ ఇండస్ట్రీ.. అల్లు అరవింద్ సహా ప్రముఖుల ప్రశంసలు..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

ECI Form 6 SIR Controversy: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో ఎన్నికల సంఘం చట్టవిరుద్ధంగా ‘ఫారం-6’ను సవరించిందంటూ వస్తున్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. అసలు ఫారాన్ని మార్చడం వేరని.. దానికి డిక్లరేషన్ జతచేయాలని కోరడం వేరని స్పష్టం చేసింది. ఈ అంశంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తప్పుగా అర్థం చేసుకుంటూ కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని తెలిపింది. SIR ప్రక్రియలో ఇతర ఎన్నికల కమిషనర్ల ఆమోదం లేకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారంటూ సీఈసీ జ్ఞానేష్ కుమార్‌పై దాఖలైన పిటిషన్లపై ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించిన విషయం తెలిసిందే. ఎన్నికల సంఘంతో పాటు సీఈసీకి.. ఇతర కమిషనర్లకు నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది. అదే సమయంలో ఈ ప్రక్రియలో ‘ఫారం-6’ను చట్టవిరుద్ధంగా సవరించారంటూ వస్తున్న ఆరోపణలను ఎన్నికల సంఘం ఖండించింది.

‘రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎలక్టర్స్ రూల్స్, 1960’ ప్రకారం ఓటర్ల జాబితాలో కొత్తగా పేరు నమోదు చేసుకునేందుకు ఫారం-6 చట్టబద్ధమైన ప్రామాణిక పత్రం. ఈ ఫారం మూల స్వరూపాన్ని, చట్టబద్ధతను ఎక్కడా మార్చలేదని  ఎన్నికల సంఘం తెలిపింది. SIR ప్రక్రియ కింద కొత్తగా దరఖాస్తు చేసుకునే ఓటరు ఫారం-6తో పాటు Annexure-D డిక్లరేషన్‌ను అదనపు రుజువుగా సమర్పించాలని మాత్రమే కోరింది. ఒక ఫారాన్ని సవరించడం అంటే ఫారంలోని అంశాలను మార్చడం. కానీ అదనపు పత్రాన్ని కోరడం అంటే దరఖాస్తుకు తోడుగా మరో పత్రాన్ని జతచేయడం. ఈ రెండూ వేర్వేరు అంశాలని.. వీటిని ఒకేలా చూపిస్తూ తప్పుడు ప్రచారం చేయడం తగదని ఈసీ పేర్కొంది.

సాధారణ ఓటర్ల సవరణ ప్రక్రియలో ఫారం-6 ఒక ప్రామాణిక డాక్యుమెంటేషన్ ఫ్రేమ్‌వర్క్‌ను అందిస్తుందని.. అయితే SIR అనేది ప్రత్యేకమైన ప్రక్రియ అని సుప్రీంకోర్టు గతంలోనే గుర్తించిందని ఈసీ తెలిపింది. అందుకే ఇలాంటి ప్రత్యేక సందర్భాల్లో పరిస్థితులకు అనుగుణంగా తగిన డాక్యుమెంటేషన్‌ను నిర్దేశించే విశేష అధికారం ఎన్నికల సంఘానికి ఉంటుందని బీహార్ SIR తీర్పులోని పేరా 152లో న్యాయస్థానం స్పష్టం చేసిందని తెలిపింది.

ఎన్నికల సంఘం నిర్దేశించిన డాక్యుమెంటేషన్ విధానం రాజ్యాంగబద్ధమైన అధికారాల పరిధిలోనే ఉందని సుప్రీంకోర్టు సమర్థించిన విషయం తెలిసిందే. ఓటర్ల జాబితా సమగ్రతను, విశ్వసనీయతను కాపాడటానికి.. పారదర్శకతను నిర్ధారించడానికి తగిన హేతుబద్ధమైన ప్రమాణాల ప్రకారమే ఈ పత్రాలను కోరింది. ఇది చట్టవిరుద్ధం లేదా ఏకపక్షం ఎంతమాత్రం కాదని న్యాయస్థానం గతంలోనే నిర్ధారించింది.

సెప్టెంబర్ 26న విడుదల చేసిన ప్రెస్‌నోట్‌లో ఫారం-6కు జతచేసిన డిక్లరేషన్‌ను సుప్రీంకోర్టు సమర్థించిందని ఎన్నికల సంఘం పేర్కొంది తప్ప.. ఫారం-6లో మార్పులను కోర్టు ఆమోదించిందని చెప్పలేదు. న్యాయస్థానం కూడా ఫారం-6 మార్పును ఆమోదించలేదని వ్యాఖ్యానించినా.. అదనపు డిక్లరేషన్ కోరే అధికారం ఎన్నికల సంఘానికి ఉందని స్పష్టంగా గుర్తించింది. దీంతో ఈసీ ప్రెస్‌నోట్ అసత్యమని.. కోర్టు తీర్పును తప్పుగా చూపించిందంటూ చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమని తేలిపోయిందని ఎన్నికల సంఘం వెల్లడించింది. 

Add Zee News as a Preferred Source
TAGS:
Supreme Court
National News