SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Trisha: తమిళ రాజకీయాల్లో మరో సంచలనం.. త్రిష పేరుతో కొత్త పార్టీ ప్రకటన.. అసలు మ్యాటర్ ఏమిటంటే..?

Trisha new party: తిరునెల్వేలిలో “ఇళయ పురట్చి తలైవి త్రిష పేరవై” పేరుతో కొత్త సంస్థను త్రిషఅభిమానులు ప్రారంభించారు. భవిష్యత్తులో దీనినే తన పార్టీపేరుగా మార్చుకుంటారని తమిళనాట జోరుగా ప్రచారం జరుగుతుంది.

Written By Inamdar Paresh
Published: Nov 23, 2026, 19:30 IST | Updated: Nov 23, 2026, 19:37 IST
Image Credit: Trisha news party rumours in tamil nadu
Join

Trisha going to launches new party  in tamil nadu rumours: తమిళనాడు రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. టీవీకే విజయ్ ఇటీవల తమిళనాడులో జరిగిన ఎన్నికల్లో సీఎంగా ప్రభుత్వంను ఏర్పాటు చేశాయి. పలుపార్టీల మద్దతుతో విజయ్ సీఎంగా బాధ్యతలు తీసుకున్నారు. మరోవైపు డీఎంకే పార్టీ మాత్రం టీవీకే విజయ్ ప్రభుత్వం ఏడాది పాటుకూడా ఉండదని మరికొన్ని రోజుల్లో కూలిపొవడం పక్కా అంటూ జోస్యం చెబుతు వస్తున్నారు. ఇక టీవీకే విజయ్, త్రిష మధ్య సీక్రెట్ రిలేషన్ నడుస్తుందని అధికారిక కార్యక్రమాల్లో సైతం త్రిష కన్పించడంతో ఆమెకు మంత్రి పదవి ఇస్తారని, ప్రభుత్వంలో కీ రోల్ ప్లేచేస్తారని కూడా జోరుగా ప్రచారం జరిగింది. 

 

 

గతంలో తిరుచ్చిఈస్ట్ లో నుంచి బరిలో నిలుస్తారని ప్రచారం జరిగింది. ఇటీవల కొలత్తూరు ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూశారు. ఆస్థానం నుంచి త్రిష బరిలో ఉంటారని ప్రచారం జరిగింది. మొత్తంగా  తమిళనాట రాజకీయాల్లో ఈ రచ్చ నడుస్తుండగానే తిరునెల్వేలిలో “ఇళయ పురట్చి తలైవి త్రిష పేరవై” పేరుతో కొత్త సంస్థను అభిమానులు ప్రారంభించారు.  అధికారిర లోగోను సైతం ఆవిష్కరించడం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

 

తిరునెల్వేలిలో సమన్వయకర్త రాజగోపాల్ ఆధ్వర్యంలో..  ‘ఇళయ పురట్చి తలైవి త్రిష పేరవై’ (యువ విప్లవ నేత త్రిష వేదిక) పేరిట ఒక సంస్థను ఏర్పాటు చేశారు.ఈ క్రమంలో త్రిషకు మద్దతుతెలిపే వారు తమ సంస్థలో చేరొచ్చని ప్రకటించారు. గతంలో  మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలితను ప్రజలు ‘పురట్చి తలైవి’ అంటూ అభిమానించేవారు. 

ప్రస్తుతం ఇదే తరహాలో త్రిషకు ‘ఇళయ పురట్చి తలైవి’ అనే బిరుదు పెట్టడం అరవ రాజకీయాల్లో సంచలనంగా మారింది. మరోవైపు త్రిషరానున్న రోజుల్లో ఇదే పార్టీతో కొత్త పార్టీని ప్రారంభించేందుకు వేగంగా పావులు కదుపుతున్నారంటూ తమిళనాట జోరుగా ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం త్రిష అంశం సోషల్ మీడియాలో  మరోసారి వైరల్గా మారింది.

 

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

ZEENEWS TRENDING STORIES