• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /లైఫ్‌స్టైల్
  • /బెండకాయ వేపుడు ముద్దలా కాకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా చేయండి..!!

బెండకాయ వేపుడు ముద్దలా కాకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా చేయండి..!!

Bendakaya Vepudu: బెండకాయ ఫ్రై, కూర చేయాలంటే పెద్ద యుద్ధమే చేయాలి. ఎందుకంటే బెండకాయలో ఉండే జిగురు.. కూర, ఫ్రైని ముద్దగా మారుస్తుంది.

Written ByBhoomi
Published: Nov 23, 2026, 20:10 IST|Updated: Nov 23, 2026, 20:12 IST
joinshare
బెండకాయ వేపుడు ముద్దలా కాకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా చేయండి..!!
Image Credit: Bendakaya Vepudu:

About the Author

Bhoomi

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
బెండకాయ వేపుడు ముద్దలా కాకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా చేయండి..!!

బెండకాయ వేపుడు ముద్దలా కాకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా చేయండి..!!

2

Rice Price In India: బియ్యం ధరల పెరుగుదలకు చెక్ పెట్టనున్న కేంద్రం..బియ్యం ఎగుమతులపై ఆంక్షలకు సిద్ధం!

3

Trisha: తమిళ రాజకీయాల్లో మరో సంచలనం.. త్రిష పేరుతో కొత్త పార్టీ ప్రకటన.. అసలు మ్యాటర్ ఏమిటంటే..?

4

గోల్డ్ లోన్ తీసుకున్న వారికి కొత్త చిక్కులు.. బ్యాంకు SMS ల వెనుక అసలు కథ ఇదే..!!

5

Sara Tendulkar: సచిన్‌ ఇంట పెళ్లిభాజాలు.. సారా టెండూల్కర్‌ పెళ్లి కూతురాయెనే?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Bendakaya Vepudu: బెండకాయ ఫ్రై, కూర చేయాలంటే పెద్ద యుద్ధమే చేయాలి. ఎందుకంటే బెండకాయలో ఉండే జిగురు.. కూర, ఫ్రైని ముద్దగా మారుస్తుంది. అయితే జిగురు లేకుండా పొడిపొడిగా రావాలని చాలా మంది ఎన్నో మ్యాజిక్కులు, జిమ్మిక్కులు చేస్తుంటారు. అయితే కొన్ని చిట్కాలు పాటించి జిగురు లేకుండా మంచి రుచితో పొడిపొడిగా తయారు చేసుకోవచ్చు. జిగురు లేకుండా పొడిగా బెండకాయ ఫ్రై ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా అర కిలో బెండకాయలను శుభ్రంగా కడుక్కోవాలి. ఆ తర్వాత ఒక జల్లెడ గిన్నెలో వేసి 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇలా చేస్తే బెండకాయలకు అంటుకున్న అదనపు నీరు పూర్తిగా ఇంకిపోయి.. జిగురు రాకుండా ఉంటుంది. నీరు పూర్తిగా ఆరిపోయిన తర్వాత బెండకాయల మధ్యస్థ పరిమాణంలో ముక్కలు ముక్కలుగా  కట్ చేసుకోవాలి. ముక్కలు మరీ పెద్దగా కాకుండా చిన్నగా కాకుండా ఉండాలి. చిన్నగా ఉంటే జిరుగు ఎక్కువై గుజ్జుగా మారుతాయి.

ఇప్పుడు ఒక మందపాటి కడాయి తీసుకుని వేడి చేసి.. అందులో 2 లేదా 3 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడియ్యాక..అందులో ఆవాలు,  జీలకర్ర, శనగపప్పు, మినపప్ప్పు వేసి ఆవాలు చిటపటలాడే వరకు వేయించుకోవాలి. పోపు దినుసులు వేగిన అనంతరం సన్నగా తరిగిన ఉల్లిపాయ వేసి.. కాస్త మెత్తబడేంత వరకు ఒక నిమిషం పాటు వేయించుకోవాలి. మరీ ఎర్రగా కావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ముందుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్న బెండకాయ ముక్కలను ఆ కడాయిలో వేసి మీడియం ఫ్లేమ్ పై ఉంచాలి.

ఇక్కడే అసలైన చిట్కా ఉంది: 
బెండకాయ ముక్కలు వేసిన తర్వాత వాటిని పదే పదే కలపకుండా.. మధ్య మధ్యలో నెమ్మదిగా కలపుతుండాలి. ఎక్కువగా కలిపితే జిగురు ఎక్కువైతుంది. బెండకాయ వేపులో ఉప్పు వేసే సమయం చాలా కీలకం. బెండకాయ ముక్కలు వేసిన వెంటనే ఉప్పు వేయకూడదు. ముక్కలు కొద్దిగా వేగి వాటిలోని జిగురు చాలా వరకు తగ్గిన తర్వాతే ఉప్పు వేయాలి. సుమారు 5 నిమిషాలు వేగిన తర్వాత జిగురు తగ్గుతుంది. అందులో కొంచెం నిమ్మరసం కానీ, పెరుగు కానీ వేసినట్లయితే జిగురు తొందరగా పోతుంది. ముక్కలు విడివిడిగా మారుతాయి.

ఇప్పుడు రెండు రెమ్మల కరివేపాకు, అరటీస్పూన్ పసుపు వేసి మంటను సిమ్ లో పెట్టాలి. జిగురు పూర్తిగా పోతుంది. వేపుడును కలిపేటప్పుడు గరిటెను ముక్కల లోపలి నుంచి పైకి తిప్పాలి. ఇలా చేయడం వల్ల ముక్కలు చెదరకుండా పొడిపొడిగా వేగుతుంటాయి. మరో 5 నిమిషాలు వేయించిన అనంతరం రుచికి సరిపడా ఉప్పు వేసి సిమ్ లో బాగా వేగనివ్వాలి. ఇంకో 2 నిమిషాలు వేయించిన తర్వాత ఐదారు వెల్లుల్లి రెబ్బలను కచ్చాపచ్చగా దంచి వేసుకోవాలి. వెల్లుల్లిని పోపులో వేయడం కంటే ఇలా మధ్యలో వేస్తే దాని ఫ్లేవర్ వేపుడుకు బాగా పట్టి ఘుమఘుమలాడే వాసనతోపాటు రుచి వస్తుంది. బెండకాయ ముక్కలు ఎర్రగా వేగిపోయిన తర్వాత ఒకటిన్నర టీస్పూన్ కారం వేసి బాగా కలుపుకోవాలి. అంతే సింపుల్ కరకరలాడే బెండకాయ వేపుడు రెడీ.

మనం బంగారం కొనకపోతే రేట్లు దిగొస్తాయా? అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధరలను శాసించే అసలు శక్తులు ఏవో తెలిస్తే షాకవుతారు..!!

గోల్డ్ లోన్ తీసుకున్న వారికి కొత్త చిక్కులు.. బ్యాంకు SMS ల వెనుక అసలు కథ ఇదే..!!

Add Zee News as a Preferred Source
TAGS:
Health