SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Aadarsha Kutumbam: ఆదర్శ కుటుంబం సినిమాలో పర్ణశాల పాట.. కాపీరైట్ వివాదంపై నిర్మాత వెంకట్ ఆవేదన

Aadarsha Kutumbam Controversy: టాలీవుడ్‌లో కాపీరైట్ హక్కుల విషయంలో మరో వివాదం తెరపైకి వచ్చింది. చిన్న సినిమాల హక్కులకు ప్రాధాన్యత ఇవ్వడం లేదంటూ ‘పర్ణశాల’ నిర్మాత వెంకట్ మంచి ఆవేదన వ్యక్తం చేశారు. వెంకటేష్ హీరోగా నటించిన ‘ఆదర్శ కుటుంబం’ సినిమాలో తమ చిత్రానికి చెందిన పాటను అనుమతి లేకుండా ఉపయోగించారని ఆయన ఆరోపించారు.

Written By Vishnu Priya
Published: Oct 31, 2026, 08:50 PM IST | Updated: Oct 31, 2026, 08:53 PM IST
Join

Aadarsha Kutumbam Copyright Controversy: 'పర్ణశాల’ సినిమాలోని ‘జిమ్ జిమ్ తార’ పాటను ‘ఆదర్శ కుటుంబం’ చిత్రంలో సుమారు 15 సెకన్ల పాటు ఉపయోగించారని నిర్మాత వెంకట్ తెలిపారు. ఈ పాటను ఆదిత్య మ్యూజిక్ ద్వారా అధికారికంగా విడుదల చేసినట్లు పేర్కొన్నారు.

తమ అనుమతి లేకుండా పాటను మరో సినిమాలో ఉపయోగించడం వల్ల ‘పర్ణశాల’ ప్రచారానికి నష్టం కలిగే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కష్టపడి రూపొందించిన పాటలను ఇతర సినిమాల్లో వాడేటప్పుడు సంబంధిత హక్కుల గురించి ఆలోచించాలని అన్నారు.

 

చిన్న సినిమాల నిర్మాతలు తమ చిత్రాలను ప్రేక్షకుల దగ్గరకు తీసుకెళ్లేందుకు ఎంతో కష్టపడతారు. ప్రచారం కోసం కూడా పరిమిత బడ్జెట్‌తో అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. ఇలాంటి సమయంలో తమ సినిమాకు సంబంధించిన కంటెంట్‌ను అనుమతి లేకుండా ఉపయోగిస్తే ఎలా ముందుకు వెళ్లాలని వెంకట్ మంచి ప్రశ్నించారు.

చిన్న సినిమాల హక్కులను గౌరవించాలని, వాటిని కాపాడేందుకు అందరూ సహకరించాలని కోరారు. ఇకపై కూడా తమ అనుమతి లేకుండా పాటను ఉపయోగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

 

ఎస్‌ఎల్‌టీ ఫిలిమ్స్ బ్యానర్‌పై వెంకట్ మంచి నిర్మిస్తున్న ‘పర్ణశాల’ సినిమాకు వై.జి. భరత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం హారర్ కామెడీ, సస్పెన్స్ థ్రిల్లర్ అంశాలతో రూపొందుతోంది.

ఈ సినిమా ప్రచారంలో భాగంగా ‘జిమ్ జిమ్ తార’ పాటను ప్రత్యేకంగా ప్రమోట్ చేశారు. లక్ష్మీదేవి వేషధారణలో పాటను పాడిస్తూ వినూత్నంగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు. ఈ పాట సోషల్ మీడియాలో కూడా మంచి స్పందన పొందింది.

 

వెంకటేష్ హీరోగా నటించిన ‘ఆదర్శ కుటుంబం’ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించారు. అక్టోబర్ 30న విడుదలైన ఈ చిత్రం ప్రస్తుతం థియేటర్లలో ప్రదర్శితమవుతోంది.

మరి ‘జిమ్ జిమ్ తార’ పాట వినియోగంపై వస్తున్న ఆరోపణలకు ‘ఆదర్శ కుటుంబం’ చిత్ర బృందం ఎలా స్పందిస్తుందో చూడాలి. ఈ వివాదం చిన్న సినిమాల కాపీరైట్ హక్కులపై మరోసారి చర్చకు దారితీసింది.

Also Read: 

అన్ని బంధాల కన్నా రక్త సంబంధమే బలమైందని.. స్వార్థంతో జీవించే వారికి నష్టం తప్పదని చెబుతున్న అన్నదమ్ముల నీతికథ..!!

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.  

ZEENEWS TRENDING STORIES