Actress Ambika: నేను త్రిష స్థానంలో ఉంటే విజయ్‌కు దూరంగా ఉంటా.!. నటి అంబిక షాకింగ్ కామెంట్స్.. మ్యాటర్ ఏమిటంటే..?
Ambika comments on cm vijay and trisha row: ఇంగ్లాండ్‌లోని సిల్వర్‌స్టోన్ రేస్‌ట్రాక్‌లో జరిగిన 'మిష్లిన్ లే మాన్స్ కప్' ఈవెంట్‌కు ముఖ్యమంత్రి విజయ్, నటి త్రిష హాజరయ్యారు. దీనిపై రాజకీయ దుమారం చెలరేగింది. ఈ వివాదంపై నటి అంబిక కీలక వ్యాఖ్యలు చేశారు.
Veteran actress ambika response on cm Vijay thalapathy and trisha friendship: తమిళనాడు రాజకీయాలు త్రిష, సీఎం విజయ్ చుట్టు తిరుగుతున్నాయి. ఈ క్రమంలో ఇటీవల విజయ్, త్రిషలు కలిసి లండన్ టూర్ వెళ్లడంపై తమిళనాడు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. విజయ్ లండన్ పర్యటన అధికారికంగా పెట్టుబడుల కోసమని ప్రకటించినప్పటికీ, అక్కడ ఆయన వెంట పారిశ్రామికవేత్తలు ఎవరూ కనిపించలేదని విపక్షాలు ఏకీపారేశాయి.
ఈ వివాదం కారణంగా మరోసారి త్రిష, సీఎం విజయ్ ల మధ్య రిలేషన్ గురించి అన్నాడీఏంకే, బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ వివాదంపై తాజాగా.. అలనాటి నటి అంబికా రియాక్ట్ అయ్యారు. ఇటీవల ఎన్నికల సమయంలో , ఆతర్వాత సీఎంగా విజయ్ గెలిచిన తర్వాత ప్రమాణ స్వీకారం, ఆ తర్వాత స్వాతంత్ర్య దినోత్సం వేళ అధికారిక కార్యక్రమంలో సందడి చేయడంపై కూడా మాట్లాడారు.
ఇంగ్లాండ్‌లోని సిల్వర్‌స్టోన్ రేస్‌ట్రాక్‌లో జరిగిన 'మిష్లిన్ లే మాన్స్ కప్' ఈవెంట్‌కు ముఖ్యమంత్రి విజయ్, నటి త్రిష హాజరయ్యారు. ఈ క్రమంలో అంబికా మాట్లాడుతూ.. నటి త్రిష తన స్నేహితుడితో బయటకు తరచుగా వెళ్తుంటారు.. బహుశా వారిద్దరి మధ్య స్నేహం ఉండి, ఎంత విమర్శలు వచ్చినా దాన్ని చూపించాలని ఇద్దరూ అనుకుంటున్నారేమో అని మాట్లాడారు.
కానీ ఇప్పుడు విజయ్ ఒక క్లిష్ట పరిస్థితిలో ఉన్నాడని, ఈ రిలేషన్ వల్ల ఆయనకు చెడ్డపేరు వస్తుందని అన్నారు. ఇదే క్రమంలో ఒక వేళ తాను.. త్రిష స్థానంలో ఉంటే, విజయ్‌ను మరింత ఇబ్బంది పెట్టేలా ఖచ్చితంగా ప్రవర్తించనని స్పష్టం చేశారు.
ముఖ్యంగా ప్రతికూల, నెగెటివ్ విమర్శలు వస్తే దూరంగా ఉండటమే బెటర్ అని చెప్పుకొచ్చారు.. అయితే.. ఇది కేవలం తన అభిప్రాయమన్నారు. మనం స్నేహాన్ని గౌరవించేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలని నటి అంబికా తెల్చి చెప్పారు.