• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /వినోదం
  • /Vijay vs Vijay Sethupathi: సమస్య వచ్చినప్పుడు వెళ్లిపోవడం కాదు.. విజయ్‌ను టార్గెట్ చేసిన విజయ్ సేతుపతి..!

Vijay vs Vijay Sethupathi: సమస్య వచ్చినప్పుడు వెళ్లిపోవడం కాదు.. విజయ్‌ను టార్గెట్ చేసిన విజయ్ సేతుపతి..!

Vijay Sethupathi Vs Vijay: తమిళ బిగ్ బాస్ షోలో నటుడు విజయ్ సేతుపతి చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చగా మారాయి. ముఖ్యంగా ఆయన నాయకత్వం గురించి చేసిన వ్యాఖ్యలు తమిళ స్టార్ హీరో విజయ్‌ను ఉద్దేశించేలా ఉన్నాయని కొందరు భావిస్తున్నారు. ఈ వ్యాఖ్యలపై విజయ్ అభిమానులు, టీవీకే కార్యకర్తలు సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారు. దీంతో బిగ్ బాస్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తున్న విజయ్ టీవీ దీనిపై వివరణ ఇచ్చింది.

Written ByVishnu Priya
Published: Sep 15, 2026, 12:42 PM IST|Updated: Sep 15, 2026, 12:53 PM IST
joinshare
Vijay vs Vijay Sethupathi: సమస్య వచ్చినప్పుడు వెళ్లిపోవడం కాదు.. విజయ్‌ను టార్గెట్ చేసిన విజయ్ సేతుపతి..!

About the Author

Vishnu Priya

Vishnu Priya

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.  
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Vijay Sethupathi Vs Vijay: బిగ్ బాస్ షోలో ఒక సందర్భంలో నాయకత్వం గురించి విజయ్ సేతుపతి మాట్లాడారు. నాయకత్వం అంటే ఏమిటో అర్థం చేసుకోవాలని హామీలు ఇవ్వడం నాయకత్వం కాదని ఆయన వ్యాఖ్యానించినట్లు సమాచారం. అలాగే సమస్యలు వచ్చినప్పుడు ప్రత్యర్థులను విమర్శించి అక్కడి నుంచి వెళ్లిపోవడం కూడా నిజమైన నాయకత్వం కాదని ఆయన అన్నారు.

ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్న నటుడు విజయ్‌ను ఉద్దేశించేలా ఉన్నాయని సోషల్ మీడియాలో కొందరు పోస్టులు చేస్తున్నారు. విజయ్ తమిళగ వెట్రి కజగం (టీవీకే) పార్టీని స్థాపించి రాజకీయాల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విజయ్ సేతుపతి చేసిన నాయకత్వ వ్యాఖ్యలకు రాజకీయ రంగు వచ్చింది. విజయ్ సేతుపతి డీఎంకేకు అనుకూలంగా వ్యవహరిస్తూ విజయ్‌పై పరోక్ష విమర్శలు చేస్తున్నారని టీవీకే అభిమానుల్లో కొందరు ఆరోపిస్తున్నారు. విజయ్ ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా విజయ్ సేతుపతి ఆయనను అభినందించలేదని కొందరు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు.

అయితే విజయ్ సేతుపతి అభిమానులు మాత్రం ఈ వ్యాఖ్యలకు రాజకీయాలతో సంబంధం లేదని చెబుతున్నారు. బిగ్ బాస్ హౌస్‌లో జరిగిన కొన్ని పరిణామాలను దృష్టిలో పెట్టుకునే ఆయన ఆ వ్యాఖ్యలు చేశారని అంటున్నారు. కార్యక్రమంలో భాగంగానే ఆయన మాట్లాడారని, దానికి అనవసరంగా రాజకీయ అర్థాలు తీసుకోవద్దని వారు కోరుతున్నారు.

ఇదే విషయంపై విజయ్ టీవీ కూడా స్పందించింది. బిగ్ బాస్ ఒక వినోద కార్యక్రమం మాత్రమేనని చానల్ స్పష్టం చేసింది. కార్యక్రమంలో జరిగే పోటీలు, సంఘటనలకు అనుగుణంగానే వ్యాఖ్యలు ఉంటాయని తెలిపింది. ఏ వ్యక్తిని, ఏ రాజకీయ ఉద్యమాన్ని లేదా ఏ సిద్ధాంతాన్ని ఉద్దేశించి మద్దతు ఇవ్వడం లేదా విమర్శించడం తమ ఉద్దేశం కాదని స్పష్టం చేసింది.

సోషల్ మీడియాలో టీవీకే అనుచరుల నుంచి విమర్శలు ఎక్కువైన తర్వాతే ఈ వివరణ రావడం ఆసక్తికరంగా మారింది. విజయ్ సేతుపతి వ్యాఖ్యలు నిజంగా విజయ్‌ను ఉద్దేశించివేనా? లేక బిగ్ బాస్ షోలో భాగంగానే ఆయన మాట్లాడారా? అనే చర్చ మాత్రం కొనసాగుతోంది.
 

Also Read: 'ఆదర్శ కుటుంబం ఏకే 47' టీజర్ వచ్చేసింది! వెంకీ-త్రివిక్రమ్ కాంబో హిట్ కొడుతుందా?

Also Read: లైంగిక వేధింపుల కేసులో 'ఢీ' డ్యాన్సర్ రాజు అరెస్ట్..సినిమాల్లో ఛాన్స్ ఇస్తానని మోసం?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  
 

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
 

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 
 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

Add Zee News as a Preferred Source