• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /వినోదం
  • /Vishwambhara Vs Kaaka: 'విశ్వంభర' Vs 'కాకా'..సంక్రాంతి రేసులో మెగాస్టార్ రెండు సినిమాలు? చరిత్రలో తొలిసారి..!

Vishwambhara Vs Kaaka: 'విశ్వంభర' Vs 'కాకా'..సంక్రాంతి రేసులో మెగాస్టార్ రెండు సినిమాలు? చరిత్రలో తొలిసారి..!

Vishwambhara Vs Kaaka Sankranti Release: మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న 'విశ్వంభర', 'కాకా' సినిమాల విడుదల తేదీల చుట్టూ టాలీవుడ్‌లో ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. అత్యంత భారీ వీఎఫ్ఎక్స్ (VFX) గ్రాఫిక్స్ పనుల ఆలస్యం కారణంగా సోషియో-ఫాంటసీ మూవీ 'విశ్వంభర' విడుదల వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. బాబీ కొల్లి దర్శకత్వంలో వస్తున్న 'కాకా'ను 2027 జనవరి 13 సంక్రాంతికి విడుదల చేయాలని నిర్ణయించగా, 'విశ్వంభర'ను 2027 సమ్మర్ సీజన్‌కు వాయిదా వేసేలా మేకర్స్ ఆలోచిస్తున్నారు.

Written ByHarish Darla
Published: Sep 13, 2026, 01:19 PM IST|Updated: Sep 13, 2026, 01:50 PM IST
joinshare
Vishwambhara Vs Kaaka: 'విశ్వంభర' Vs 'కాకా'..సంక్రాంతి రేసులో మెగాస్టార్ రెండు సినిమాలు? చరిత్రలో తొలిసారి..!

About the Author

Harish Darla

Harish Darla

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Vishwambhara Vs Kaaka Sankranti Release: మెగాస్టార్ చిరంజీవి నటించిన వరుసగా రెండు భారీ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తుండటంతో ఆయన అభిమానులు తీవ్రమైన ఉత్సాహంలో ఉన్నారు. అయితే, ఇప్పుడు చలనచిత్ర పరిశ్రమలో 'విశ్వంభర' (Vishwambhara), 'కాకా' (Kaaka) విడుదల తేదీల పైనే పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఈ రెండు సినిమాల విడుదల సమయాల్లో అనేక మార్పులు చోటుచేసుకోబోతున్నట్లు ఫిలింనగర్ సమాచారం ద్వారా తెలుస్తోంది.

దర్శకుడు బాబీ కొల్లి తెరకెక్కిస్తున్న 'కాకా' సినిమాను 2027 జనవరి 13న సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. అదే సమయంలో, భారీ వీఎఫ్ఎక్స్ (VFX) పనుల వల్ల ఆలస్యమవుతూ వస్తున్న సోషియో - ఫాంటసీ చిత్రం 'విశ్వంభర'ను దసరా రేస్ నుండి తప్పించి, 2027 జనవరి 9న సంక్రాంతి బరిలోకి దించేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు ప్రచారం సాగుతోంది.

అయితే, కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే ఒకే కథానాయకుడు నటించిన రెండు భారీ చిత్రాలను థియేటర్లలో విడుదల చేయడం సాధ్యం కాదు కాబట్టి, ఏదో ఒక సినిమా సంక్రాంతి రేసు నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 'విశ్వంభర' సాధారణ కమర్షియల్ సినిమాలకు పూర్తి భిన్నంగా, అత్యంత భారీ గ్రాఫిక్స్ ఆధారంగా రూపొందుతున్న సోషియో ఫాంటసీ చిత్రం కావడంతో దీనికి సోలో విడుదల విండో చాలా అవసరమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

మరోవైపు, 'కాకా' చిత్రబృందం సంక్రాంతి సెంటిమెంట్‌ను బలంగా నమ్ముతోంది. గతంలో బాబీ - చిరంజీవి కాంబినేషన్‌లో వచ్చిన 'వాల్తేరు వీరయ్య' చిత్రం సంక్రాంతికి సాధించిన భారీ విజయం దృష్ట్యా, 'కాకా' మేకర్స్ ఈ సంక్రాంతి రేసును వదులుకోవడానికి అంత సులభంగా అంగీకరించేలా లేరు.

తాజాగా వినిపిస్తున్న ఫిలింనగర్ వర్గాల సమాచారం ప్రకారం.. 'కాకా' చిత్రాన్ని ముందే ప్రకటించినట్లుగా జనవరి 13, 2027న సంక్రాంతి బరిలోనే నిలిపి, 'విశ్వంభర' చిత్రాన్ని 2027 సమ్మర్ సీజన్‌కు వాయిదా వేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని భావిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ, రెండు సినిమాల విడుదల విషయంలో మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో, 'విశ్వంభర' కొత్త విడుదల తేదీని మేకర్స్ ఎప్పుడు ప్రకటిస్తారో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడక తప్పదు.

Also REad: 'ఆదర్శ కుటుంబం ఏకే 47' టీజర్ వచ్చేసింది! వెంకీ-త్రివిక్రమ్ కాంబో హిట్ కొడుతుందా?

Also REad: లైంగిక వేధింపుల కేసులో 'ఢీ' డ్యాన్సర్ రాజు అరెస్ట్..సినిమాల్లో ఛాన్స్ ఇస్తానని మోసం?
 


 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

Add Zee News as a Preferred Source