110 ఏళ్ల వృద్ధుడికి పెళ్లి.. అందమైన యువతితో వివాహం.. ఫోటో చూడండి!
110 Year Old Man Marriage: 110 ఏళ్లు కలిగిన ఓ వృద్ధుడు.. అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకున్న దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ప్రస్తుతం వీరికి సంబంధించిన ఫోటో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. అయితే, ఈ ఘటన ఎక్కడ జరిగింది? దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
110 Year Old Man Marriage Viral News: సాధారణంగా పెళ్లి సంబురాలకు సంబంధించిన వీడియోలతో పాటు ఫోటోలు సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతూనే ఉంటాయి. అయితే, తాజాగా సౌదీ అరేబియాకు సంబంధించిన ఓ వివాహానికి సంబంధించిన ఫోటోలు కూడా నెట్టింట విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. దీనికి ప్రధాన కారణం ఆ పెళ్లిలో వరుడి వయసు.. ఏకంగా 110 ఏళ్ల వయసున్న ఓ షేక్ వివాహం చేసుకున్నారంటూ కొన్ని ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాల్లో ఎక్కడగా చూసిన కనిపిస్తూ ఉన్నాయి. ఈ ఘటనకు సంబంధించిన అన్ని రకాల వివరాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
సౌదీ అరేబియాలో జరిగిన ఈ వేడుకకు సంబంధించిన దృశ్యాలను పెళ్లి అటెండ్ అయిన కొంతమంది షేర్ చేశారు.. ఈ ఫోటోలో సంప్రదాయ దుస్తుల్లో ఉన్న ఓ వృద్ధుడు పెళ్లి కుమారుడిగా కనిపించడం మీరు గమనించవచ్చు.. పక్కనే వధువు కూడా ఎంతో అందంగా ఉండడం మీరు గమనించవచ్చు. వరుడి వయసు 110 సంవత్సరాలని కూడా కొంతమంది ఫోటోలతో పాటు క్యాప్షన్ రాసుకొచ్చారు.. ఈ ఘటన చూసి నెటిజన్లు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురవుతున్నట్లు తెలుస్తోంది. ఇంతటి వృద్ధాప్యంలో వివాహం చేసుకోవడంతో సింగిల్స్ ఫీల్ అవుతున్నారట..
ఈ వైరల్ పోస్టులపై సోషల్ మీడియాలో నెటిజన్స్ వివిధ రకాలుగా స్పందిస్తూ వస్తున్నారు. వధూవరుల మధ్య ఉన్న వయసు వ్యత్యాసంపై కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ కామెంట్లు కూడా పెడుతున్నారు. మరికొందరు మాత్రం ఈ జంటకు విషెష్ తెలుపుతూ.. ప్రేమకు, వివాహానికి వయసుతో ఎటువంటి సంబంధం లేదు.. మనసులు కలిస్తే.. ఏ వయసులోనైనా ఒక్కటవ్వొచ్చు.. అంటూ స్పందిస్తున్నారు. ఏదేమైనా.. ఈ వివాహ వేడుక ప్రస్తుతం ఇంటర్నెట్‌లో హాట్ టాపిక్‌గా మారింది..
సోషల్ మీడియాలో ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన దృశ్యాలు విపరీతంగా వైరల్ అవుతున్నప్పటికీ.. ఈ ఘటన వాస్తవమా? లేదా AI వినియోగించి ఏమైనా ఫోటోలు తయారు చేసి పోస్ట్ చేశారా? అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. వైరల్ అవుతున్న ఆ వీడియోలలోని వరుడి వయసు నిజంగానే 110 ఏళ్లా? ఆ జంట వివరాలు ఏమిటి? ఈ వివాహం ఎప్పుడు, ఎక్కడ జరిగింది? అనే అంశాలపై ఇప్పటివరకు బయటికి రాలేదు.. కానీ ఫోటోలు మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.