Indonesia Gym Tragedy video: జిమ్ చేస్తుండగా షాకింగ్ ఘటన.. మూడో అంతస్తు నుంచి జారి పడ్డ యువతి.. వీడియో వైరల్..
Gym tragedy in Indonesia: ట్రెడ్ మిల్ చేస్తుండగా యువతి ఒక్కసారిగా బ్యాలెన్స్ కోల్పోయింది. దీంతో ఆమె జారీపడి మూడో అంతస్తు నుంచి కింద పడింది. ఈ ఘటనలో స్పాట్ లోనే యువతి దుర్మరణం చెందింది. ఇండోనేషియాలో జరిగిన ఈ ఘటనకు చెందిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
22 Years old girl dies after falling from gym window in Indonesia: ఇటీవల కాలంలో జిమ్ లో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. చాలా మంది ఫిట్ నెస్ కోసం ఉదయాన్నే జిమ్ కు వెళ్లి వర్కౌట్స్ లు చేస్తారు. అంతే కాకుండా గంటల కొద్ది అక్కడే ఉండి తమ ఒంట్లోని కొవ్వును కరిగించుకునేందుకు నానా తంటాలు పడుతుంటారు. అయితే సరైన జాగ్రత్తలు పాటించకుండా జిమ్ చేయడం వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. జిమ్ లో వర్కౌట్స్ చేసేటప్పుడు కొంత మంది హర్ట్ ఎలాక్ లతో చనిపోతున్నారు.ఈ క్రమంలో జిమ్ లో వర్కౌట్స్ చేసేటప్పుడు ఒక యువతి అనూహ్యంగా ట్రెడ్ మిల్ పైనుంచి బ్యాలెన్స్ తప్పి ఏకంగా మూడొ అంతస్తులో ఉన్న కిటికి నుంచి నెల మీద పడి దుర్మరణం చెందింది. ఇండొనేషియాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదకరంగా మారింది.
ఇండొనేషియాలోని జిమ్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పశ్చిమ కాలిమంతన్‌లోని పొంటియానాక్‌లో 22 ఏళ్ల యువతి జిమ్ లో ట్రెడ్ మిల్ పై వర్కౌట్స్ చేస్తుంది. ఈ జిమ్ మూడొ అంతస్తులో ఉంది. యువతి ట్రెడ్ మిల్ పై జిమ్ చేస్తుండగా ఒక్కసారిగా అదుపు తప్పి వెనకాల ఉన్న విండొ గుండా నెల మీద పడిపోయింది. ఈ ఘటనలో యువతి తీవ్ర గాయాలపాలై రక్త స్రావమైంది.
వెంటనే అక్కడున్న వారు ఆస్పత్రికి తరలించగా అప్పటికే చికిత్స పొందుతూ యువతి మృతి చెందింది. ఈ విషాద ఘటన అక్కడ ఏర్పాటు చేసిన సీసీ టీవీ ఫుటేజీలో రికార్డు అయ్యాయి. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. ట్రెడ్ మిల్ కు, యువతి పడిపోయిన విండొకు మధ్య కేవలం 60 సెంటీ మీటర్ల దూరంమాత్రమే ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. జిమ్ నిర్వాహకుల నెగ్లీజెన్సీ వల్ల యువతి చనిపోయినట్లు ప్రాథమికంగా అంచానా వేస్తున్నారు. దీనిపై యువతి కుటుంబ సభ్యులు జిమ్ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకొవాలని డిమాండ్ చేస్తున్నారు.