వామ్మె.. వృద్ధుడి మలద్వారంలో మొదటి ప్రపంచ యుద్ధం నాటి ఫిరంగి గుండు!
Viral News: వృద్ధుడి మలద్వారంలో మొదటి ప్రపంచ యుద్ధానికి సంబంధించిన ఫిరంగి గుండు ఇరుక్కుపోయిన ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. దీంతో అక్కడికి బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ కూడా చేరుకుని.. డాక్టర్లు ఆఫరేషన్ చేపట్టారు.
Telugu Viral News: వైద్య వృత్తిలో డాక్టర్లతో పాటు నర్సులు ఎన్నో వింతలతో పాటు విచిత్రమైన కేసులు నిత్యం చూస్తూ ఉంటారు. కానీ ఫ్రాన్స్‌లోని ఒక ఆసుపత్రి వైద్యులకు ఎదురైన ఓ వింత అనుభవం మాత్రం వారి జీవితాల్లో ఎన్నడూ మరిపోలేదని నమ్మాల్సిందే.. ఒక అత్యవసర చికిత్స కాస్తా.. నిమిషాల్లో తీవ్రమైన బాంబు బెదిరింపు తరహా అలర్ట్ ఆసుపత్రితో పాటు ఆ పరిసర ప్రాంతాల్లో వారిని తీవ్ర భయభ్రాంతులకు గురిచేసే పరిస్థితి ఏర్పడింది. 88 ఏళ్ల వృద్ధుడి మలద్వారం (Rectum)లో మొదటి ప్రపంచ యుద్ధం నాటి ఆర్టిలరీ షెల్ ఇరుక్కుపోవడంతో వైద్య సిబ్బందితో పాటు బాంబు బృందాలు పరుగులు తీయాల్సి వచ్చింది. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
దక్షిణ ఫ్రాన్స్‌లోని టౌలన్ (Toulon) నగరంలో ఒక 88 ఏళ్ల వృద్ధుడు విపరీతమైన కడుపు నొప్పితో చికిత్స కోసం సెయింట్-ముస్సే హాస్పిటల్‌కు (Sainte-Musse Hospital) వచ్చాడు.. అయితే, అక్కడే వైద్యులు పరీక్షలు నిర్వహించి.. శరీరంలో ఏదో గట్టి వస్తువు ఇరుక్కున్నట్లు గుర్తించి ఎక్స్‌రేతో పాటు స్కానింగ్ తీశారు.. స్క్రీన్‌పై కనిపించిన దృశ్యాన్ని చూసి వైద్యుల సైతం ఆశ్చర్యానికి గురయ్యారు. ఎందుకంటే అతడి శరీరంలో ఉన్నది సాధారణ వస్తువు కాదని.. అది మొదటి ప్రపంచ యుద్ధ కాలం నాటి పురాతన ఫిరంగి పేలుడు గుండు.. అని తెలింది.
శరీరంలో ఉన్న ఆ పురాతన బాంబు ఎక్కడ పేలిపోతుందో అనే తీవ్ర భయంతో ఆసుపత్రి యాజమాన్యం తక్షణమే అలర్ట్ ప్రకటించారు. ప్రమాద తీవ్రతను దృష్టిలో పెట్టుకుని.. ఆసుపత్రిలోని కొన్ని విభాగాలను.. వార్డులను వెంటనే ఖాళీ చేయించిన్నట్లు కూడా సమాచారం.. అలాగే రోగులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సమాచారం అందుకున్న ఫైర్‌ఫైటర్లతో పాటు బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ హుటాహుటిన ఆసుపత్రికి చేరుకున్నారు.
బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ టీమ్ ఆ పేలుడు గుండును పరిశీలించి.. అది అంత ప్రమాదకరం కాదని.. తక్షణమే పేలే అవకాశం లేదనడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఆ తర్వాతే వైద్యులు శస్త్రచికిత్సకు సిద్ధమయిన్నట్లు తెలుస్తోంది.. సర్జన్లు అత్యంత జాగ్రత్తగా ఆపరేషన్ నిర్వహించి.. వృద్ధుడి శరీరం నుంచి ఆ పురాతన ఫిరంగి గుండును విజయవంతంగా బయటకు తీసిన్నట్లు తెలుస్తోంది.. వృద్ధుడు ప్రాణాపాయం నుంచి బయటపడి కోలుకున్నాడు.