అదృష్టమంటే ఇదేనేమో.. తవ్వకాల్లో దొరికిన బంగారు బంగాళదుంప!
Australian Farmer Gold Discovery: ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్ రాష్ట్రంలో ఒక రైతుకు తవ్వకాల్లో బంగాళదుంప ఆకారంలో ఉన్న గోల్డ్ రాయి దొరికింది.. అయితే, దీని విలువ భారత కరెన్సీలో దాదాపు రూ.1 కోటికిపై ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, దీనికి సంబంధించిన అన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
Australian Farmer Gold Discovery: మనిషి అదృష్టం ఎప్పుడు.. ఏ రూపంలో తలుపు తడుతుందో ఊహించడం చాలా కష్టం.. కష్టపడి పనిచేసే వారిని ప్రకృతి కూడా ఒక్కోసారి అద్భుతమైన గిఫ్ట్స్‌తో అద్భుతం సృష్టిస్తాయి. తాజాగా ఆస్ట్రేలియాకు చెందిన ఓ రైతు విషయంలో సరిగ్గా ఇదే జరిగింది.. రోజువారీ పనుల్లో భాగంగా భూమిలోని పాత వస్తువులను సేరిస్తూ ఉంటాడు.. ఒక రోజు ఆ రైతుకు అచ్చం బంగాళదుంప ఆకారంలో ఉన్న ఓ భారీ బంగారు ముద్ద దొరికిందట.. దీని విలువ భారత కరెన్సీలో సుమారు కోటి రూపాయలకు పైగా ఉండటంతో అతను ఒక్కసారిగా కోటీశ్వరుడు అయ్యాడు.
ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్ రాష్ట్రంలో టిబూబురా ప్రాంతానికి సమీపంలో ఉన్న స్టార్ట్ స్టోనీ ఎడారి బంగారు తవ్వకాలకు చాలా ప్రసిద్ధి.. చాలామంది ఇక్కడ బంగారం కోసం వెతుకుతూ ఉంటారు. ఇదే ప్రాంతానికి చెందిన ఓ రైతు కూడా గత కొద్దిరోజులుగా తన వద్ద ఉన్న మెటల్ డిటెక్టర్ సహాయంతో ఈ రాతి నేలపై బంగారం కోసం వెతుకుతూ ఉన్నాడు..
ప్రతి రోజు బంగారం కోసం వెతుకున్న సమయంలో ఒక రోజు మెటల్ డిటెక్టర్ నుంచి పెద్దగా ఏమీ స్పందన రాలేదట.. కానీ, ఓ చోట భూమిని సుమారు 100 మిల్లీమీటర్ల లోతు తవ్విన తర్వాత ఆ డిటెక్టర్ ఒక్కసారిగా బలమైన సిగ్నల్స్ ఇచ్చింది.. ఆసక్తితో మట్టిని తొలగించి చూడగా.. లోపల పసుపు రంగులో మెరిసిపోతున్న ఓ భారీ లోహపు పెద్ద ముద్ద కనిపించిందట.. చూడటానికి అచ్చం బంగాళదుంపలా ఉన్న ఆ వస్తువును చేతిలోకి తీసుకుని చెక్ చేయగా.. అది అత్యంత విలువైన బంగారు ముద్ద అని తేలడంతో ఆ రైతు ఆనందానికి అవధుల్లేకుండా పోయాయట.. ఆకారాన్ని బట్టి దీనికి టిబూబురా స్పడ్ అని పేరు పెట్టారట.
అయితే, ఈ బంగారు ముద్దను చెక్ చేయగా.. దీని మొత్తం బరువు సుమారు 1.2 కిలోగ్రాములు ఉన్నట్లు తెలిసింది. ఇందులో రాళ్లతో పాటు మట్టి పోను ఏకంగా 940 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ఉండటం విశేషం.. ఇది దొరికిన సమయంలో మార్కెట్ ధర ప్రకారం దీని విలువ 1.95 లక్షల ఆస్ట్రేలియన్ డాలర్లుగా ఉన్నట్లు సమాచారం.. అయితే, ఆ తర్వాత అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరల్లో వచ్చిన చిన్న హెచ్చుతగ్గుల కారణంగా దీని విలువ సుమారు 1.60 లక్షల ఆస్ట్రేలియన్ డాలర్లు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఇది భారత కరెన్సీలో దాదాపు రూ.1 కోటికి పైగా ఉండే అవకాశాలు ఉన్నాయట..