SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

అదృష్టం అంటే ఇతనిదే.. చెత్త లోహాల కోసం వెళ్తే రూ.1.3 కోట్ల బంగారం దొరికింది!

Australian Man Finds Gold Nugget: పాత లోహాలను సేకరించే ఒక వ్యక్తికి ఎంతగా ఒక కేజీకి పైగా బంగారు రాయి లభించింది. దీని విలువ మార్కెట్‌లో 1.6 లక్షల అమెరికన్ డాలర్లు ఉందట.. అయితే, ఈ ఘటన ఎక్కడ జరింది. ఎవరికి ఈ బంగారం దొరికింది? పూర్తి వివరాలు ఇవే..

Written By Dharmaraju Dhurishetty
Published: Nov 09, 2026, 03:12 PM IST | Updated: Nov 09, 2026, 03:14 PM IST
Image Credit: ZEE TELUGU NEWS
Join

Australian Man Finds Gold Nugget: అదృష్టం ఎప్పుడు.. ఏ రూపంలో తలుపు తడుతుందో ఊహించడం చాలా కష్టం.. ఆస్ట్రేలియాకు చెందిన ఓ యువకుడి జీవితం కూడా సరిగ్గా ఇలాగే రాత్రికి రాత్రే ఊహించని మలుపు తిరిగిందంటే నమ్ముతారా? సాధారణంగా లోహాలను వెతికేందుకు మెటల్ డిటెక్టర్‌తో తిరుగుతున్న అతనికి అరుదైన నిధి దొరికింది.. దాని విలువ తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే..

ఈ ఆసక్తికర ఘటన ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్ పరిధిలో ఉన్న టిబూబురా  ప్రాంతంలో చోటుచేసుకుంది.. మౌంట్ స్టువర్ట్ స్టేషన్ సమీపంలోని ఎర్రటి మట్టి.. బంజరు భూముల్లో సదరు వ్యక్తి పాత లోహల కోసం అన్వేషణ సాగించేవాడు.. రోజులాగే ఆ రోజు కూడా మెటల్ డిటెక్టర్ పట్టుకుని తిరుగుతుండగా.. అతనికి తుప్పు పట్టిన ఇనుప మేకులు.. పనికిరాని లోహపు ముక్కలు.. తుపాకీ బుల్లెట్‌లు మాత్రమే లభించాయి. ఇక అలాగే వెతుకుతూ వెళ్లగా.. ఎర్రటి మట్టి పొరల్లో ఏదో పసుపు రంగులో మెరుస్తూ కనిపించింది..

ఆ మెరుపును చూసి ఆసక్తితో అతడు అక్కడ లోతుగా తవ్వడం మొదలు పెట్టాడు.. పైనున్న మట్టిని తొలగించగానే.. లోపల నుంచి అతిపెద్ద బంగారు ముక్క కనిపించింది. క్వార్ట్జ్ రాయితో ఈ అరుదైన బంగారు ముక్క మొత్తం బరువు సుమారు 1.2 కిలోగ్రాములుగా ఉందట.. పరీక్షలు చేసిన తర్వాత అందులో దాదాపు 940 గ్రాముల అత్యంత స్వచ్ఛమైన బంగారం లభించిన్నట్లు తెలుస్తోంది..

ఈ భారీ బంగారు ముక్కకు టిబూబురా స్పడ్ అని పేరు కూడా పెట్టారట.. అంతర్జాతీయ మార్కెట్ ప్రకారం.. దీని విలువ దాదాపు 1.5 లక్షల నుంచి 1.6 లక్షల అమెరికన్ డాలర్లు ఉంటుందని సమాచారం. భారతీయ కరెన్సీ ప్రకారం.. ఇది దాదాపు రూ.1.2 కోట్ల నుంచి రూ.1.3 కోట్ల వరకు పలుకుతుంది. సాధారణ బులియన్ ధర కంటే.. కూడా అరుదైన గోల్డ్ నగ్గెట్లకు పురాతన వస్తువులకు గిరాకీ ఎక్కువగా ఉంటుందట.. దీనిని అత్యంత త్వరలోనే వేలం వేసే అవకాశాలు కూడా ఉన్నాయి.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..

ZEENEWS TRENDING STORIES