• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆంధ్రప్రదేశ్
  • /Srisailam Karthika Masam: కార్తీక మాసం వేళ శ్రీశైలం వెళ్లే భక్తులకు అలర్ట్.. పరమశివుడి దర్శనం, సేవలపై కీలక మార్పులు!

Srisailam Karthika Masam: కార్తీక మాసం వేళ శ్రీశైలం వెళ్లే భక్తులకు అలర్ట్.. పరమశివుడి దర్శనం, సేవలపై కీలక మార్పులు!

Srisailam Karthika Masam 2026: కార్తీక మాసం సందర్భంగా శ్రీశైలంలో నవంబర్ 10 నుంచి డిసెంబర్ 9 వరకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని కొన్ని ఆర్జిత సేవలను తాత్కాలికంగా నిలిపివేయగా, పంచమఠాల్లో రూ.216కే అభిషేకం చేసుకునే అవకాశం కల్పించారు. టికెట్ల ఆన్‌లైన్ బుకింగ్ విధానం, దర్శనం మరియు సేవల్లో మార్పుల పూర్తి వివరాలు తెలుసుకోండి.

Written ByHarish Darla
Published: Nov 09, 2026, 04:24 PM IST|Updated: Nov 09, 2026, 04:30 PM IST
joinshare
Srisailam Karthika Masam: కార్తీక మాసం వేళ శ్రీశైలం వెళ్లే భక్తులకు అలర్ట్.. పరమశివుడి దర్శనం, సేవలపై కీలక మార్పులు!

About the Author

Harish Darla

Harish Darla

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నాకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నాను. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశాను.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
Hardik Pandya IPL 2027 Trade: హార్దిక్ పాండ్యాను వదులుకోవడం ముంబై ఇండియన్స్‌కు మంచిదే! మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు!

Hardik Pandya IPL 2027 Trade: హార్దిక్ పాండ్యాను వదులుకోవడం ముంబై ఇండియన్స్‌కు మంచిదే! మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు!

2

Srisailam Karthika Masam: కార్తీక మాసం వేళ శ్రీశైలం వెళ్లే భక్తులకు అలర్ట్.. పరమశివుడి దర్శనం, సేవలపై కీలక మార్పులు!

3

Pakistan TV Anchor Murder: ప్రముఖ టీవీ యాంకర్ దారుణ హత్య.. ఇంట్లోనే తుపాకీతో దారుణంగా..భర్త అరెస్ట్!

4

అదృష్టం అంటే ఇతనిదే.. చెత్త లోహాల కోసం వెళ్తే రూ.1.3 కోట్ల బంగారం దొరికింది!

5

Andhra Pradesh CPS to OPS: ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం తీపికబురు.. CPS నుంచి OPSకు మారేందుకు సర్వం సిద్ధం?!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Srisailam Karthika Masam 2026: శ్రీశైల మహాక్షేత్రంలో కార్తీక మాసోత్సవాలకు రంగం సిద్ధమైంది. నవంబర్ 10 నుంచి డిసెంబర్ 9 వరకు నెల రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు, సాధారణ భక్తులకు ప్రాధాన్యత ఇచ్చేలా దేవస్థానం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.

పంచమఠాల్లో రూ.216కే అభిషేకం
కార్తీక మాసంలో స్వామివారికి అభిషేకం చేయించుకోవాలనుకునే భక్తుల కోసం శ్రీశైల దేవస్థానం ప్రత్యేక అవకాశం కల్పించింది. చారిత్రక ప్రాధాన్యం కలిగిన పంచమఠాల్లో ఆర్జిత అభిషేక సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సేవకు టికెట్ ధరను కేవలం రూ.216గా నిర్ణయించారు. ఒక్క టికెట్‌పై ఒక వ్యక్తి లేదా దంపతులు అభిషేకంలో పాల్గొనవచ్చు.

భక్తులు ముందుగానే టికెట్లు పొందేందుకు డిజిటల్ బుకింగ్ సౌకర్యం కూడా కల్పించారు. ఇందుకోసం 'మనమిత్ర' వాట్సాప్ నంబర్ 9552300009ను లేదా ఏపీటీఎస్ అధికారిక వెబ్‌సైట్ www.tms.ap.gov.inను వినియోగించుకోవచ్చు. రద్దీ సమయంలో టికెట్ల కోసం ఇబ్బందులు పడకుండా ముందస్తు బుకింగ్ చేసుకోవడం మంచిది.

ఏ సేవలు తాత్కాలికంగా నిలిపివేశారు?
కార్తీక మాసంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే రోజుల్లో కొన్ని ఆర్జిత సేవలను తాత్కాలికంగా నిలిపివేయాలని అధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగా రూ.5,000 గర్భాలయ అభిషేకాలు, రూ.1,500 సామూహిక అభిషేకాలు అందుబాటులో ఉండవు. ఉదయాస్తమాన సేవ, ప్రాతఃకాల సేవ, ప్రదోషకాల సేవల టికెట్లను కూడా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. అమ్మవారి అంతరాలయంలో నిర్వహించే రూ.1,000 కుంకుమార్చన సేవలోనూ మార్పు చేశారు. భక్తుల రద్దీని నియంత్రించేందుకు ఈ సేవను ఆశీర్వచన మండపంలో నిర్వహించనున్నారు.

యథావిధిగా కొనసాగనున్న సేవలు
ఆర్జిత హోమాలు, కల్యాణోత్సవ సేవలను మాత్రం ఎలాంటి మార్పులు లేకుండా కొనసాగించనున్నారు. కార్తీక మాసంలో శ్రీశైలం వెళ్లాలని భావిస్తున్న భక్తులు ప్రయాణానికి ముందే సేవల వివరాలు, టికెట్ లభ్యత, దర్శన ఏర్పాట్లను అధికారిక మార్గాల ద్వారా నిర్ధారించుకోవాలి.

Add Zee News as a Preferred Source
TAGS:
Andhra Pradesh
AP News
Telugu News