SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

మెదడుకు ఆపరేషన్.. ఆ తర్వాత భయం అంటేనే మర్చిపోయిన వ్యక్తి!

Fear Loss News: అమెరికాకు సంబంధించిన ఒక వ్యక్తి మెదడుకు శస్త్రచికిత్స ద్వారా పూర్తిగా భయాన్ని కోల్పోయాడు. ఈ ఘటన ఎప్పుడు జరిగింది కానీ.. ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం..

Reported By Dharmaraju Dhurishetty Written By Dharmaraju Dhurishetty
Published: Sep 30, 2026, 12:46 PM IST | Updated: Sep 30, 2026, 12:47 PM IST
Image Credit: జీ తెలుగు న్యూస్..
Join

Fear Loss Telugu News: వైద్య రంగంలో అప్పుడప్పుడు చోటుచేసుకునే కొన్ని అరుదైన ఘటనలు శాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తూ ఉంటాయి. అలాంటి ఒక అరుదైన వింట ఘటన అమెరికాకు చెందిన జోడీ స్మిత్‌ అనే వ్యక్తి జీవితంలో చోటు చేసుకుంది.. తీవ్ర ఫిట్స్‌తో బాధపడుతూ శస్త్రచికిత్స చేయించుకున్న ఆయన.. ఆ ఆపరేషన్‌ తర్వాత భయం అనే శారీరక అనుభూతినే పూర్తిగా కోల్పోయినట్లు వెల్లడించారు. అయితే, ఈ ఘటన ఇప్పడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

2018 సంవత్సరంలో తీవ్ర మూర్చ వ్యాధితో బాధపడుతున్న జోడీ స్మిత్‌కు వైద్యులు బ్రెయిన్‌ సర్జరీ నిర్వహించారు. న్యూరో సర్జన్లు ఆయన మెదడులోని కుడి టెంపోరల్ లోబ్ భాగాన్ని.. ముఖ్యంగా అందులోని కుడి అమిగ్డలాతో పాటు హిప్పోక్యాంపస్ భాగాలను ఆపరేషన్‌ ద్వారా తొలగించారు. అప్పటి నుంచి ఆ వ్యాధి చాలా వరకు అదుపులోకి వచ్చింది.

ఆపరేషన్ విజయవంతంగా పూర్తయిన కొద్దిరోజులకే జోడీ స్మిత్ తన ప్రవర్తనలో అనేక మార్పులు వచ్చిన్నట్లు వైద్యులు తెలిపారు. ముఖ్యంగా ప్రమాదం లేదా ముప్పు ఎదురైనప్పుడు మెదడు ప్రమాదాన్ని గుర్తిస్తుంది కానీ.. సాధారణంగా మనుషుల్లో కలిగే గుండె వేగంగా కొట్టుకోవడంతో పాటు చెమటలు పట్టడం వంటి తీవ్రమైన శారీరక భయంతో కూడిన ప్రతిస్పందనలు  ఆయనలో పూర్తిగా ఆగిపోయాయని తెలిపారు.. ముఖ్యంగా కొండ అంచులపై నిలబడినప్పుడు.. ఇతర ప్రమాదకరమైన పరిస్థితుల్లో వచ్చినప్పటికీ.. ఎలాంటి వణుకుతో పాటు ఆందోళన లేకుండా ప్రశాంతంగా ఉండగలుగుతున్నానని వైద్యులు తెలిపారు.. అయితే, ఈ సర్జరీ అనంతరం ఆయన జ్ఞాపకశక్తితో పాటు ఏకాగ్రత వంటి సమస్యలను కూడా ఎదుర్కొంటారు.

మానవ శరీరంలో ముప్పులను పసిగట్టడంతో పాటు భయాన్ని ప్రాసెస్ చేయడంలో అమిగ్డలా అద్భుతమైన పాత్ర పోషిస్తూ ఉంటుంది. అయితే, ఇది కేవలం మెదడు భయా ఏర్పాటు చేసే కేంద్రం మాత్రమే కాదని.. భయం, ఆందోళన వంటి క్లిష్టమైన భావోద్వేగాలు మెదడులోని విస్తృతమైన నరాల నెట్‌వర్క్‌పై ఆధారపడి పనిచేస్తాయని వైద్యులు తెలిపారు.. ఒక భాగాన్ని తొలగించినంత మాత్రాన భయమనే వ్యవస్థ పూర్తిగా పోవని.. దాని తీవ్రతలో తేడాలు మాత్రమే వస్తాయని న్యూరో నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..

ZEENEWS TRENDING STORIES