SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

China: గుండెలు గుభేల్.. వెంట్రుక వాసిలో బస్సుకు తప్పిన పెద్ద ప్రమాదం.. ఓళ్లు గగుర్పొడిచే వీడియో..

Bus stuck on flyover in china: బస్సు వంతెన మీద వేలాడుతూ ఉండి పోయింది. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ ఎమర్జెన్సీ డోర్ గుండా ప్రయాణికుల్ని బైటకు పంపించి వేశాడు.ఈ వీడియో వైరల్ గా మారింది.

Written By Inamdar Paresh
Published: Nov 22, 2026, 15:53 IST | Updated: Nov 22, 2026, 16:05 IST
Image Credit: china bus accident video
Join

Bus trapped on broken flyover in China Video: ఇటీవల తరచుగా రోడ్డు ప్రమాద  ఘటనలు ఎక్కువగా వార్తలలో ఉంటున్నాయి. కొంత మంది రోడ్ల మీద వాహనాల్ని ఇష్టారితీన డ్రైవ్ చేస్తు వారి ప్రాణాల్ని మాత్రమే కాకుండా ఇతరుల్ని కూడా ప్రమాదంలో నెట్టేస్తున్నారు. ఇలాంటి ఘటనల వల్ల  చాలా మంది బస్సు ప్రయాణాలంటేనే జడుసుకుంటున్నారు. కొంత మంది తప్పతాగి వాహనాల్ని నడిపిస్తున్నారు. మరికొంత మంది నిద్రమత్తులో లేదా డ్రైవింగ్ రాకున్న కూడా వాహనాల్ని నడిపించడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. 

 

 

కొన్నిసార్లు పెద్ద ప్రమాదాలు కూడా డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరిస్తే వాటి నుంచి ప్రయాణికులు బైటపడిన ఘటనలు కొకొల్లలు.  అచ్చం ఈ కోవకు చెందిన ఘటన చైనాలో చోటుచేసుకుంది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. 

చైనాలో ప్రయాణికులతో వెళ్తున్న ఒక బస్సు రెండు ఎలివేటేడ్ రోప్ వే కుంగిపోవడంతో రెండు బ్రిడ్జిల మధ్య చిక్కుకుని పోయింది. బస్సు వంతెన మీద ప్రమాదకరంగా వేలాడుతూ ఉండిపోయింది.   వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ బస్సు నుంచి ప్రయాణికుల్ని  అత్యవసర ద్వారం గుండా బైటకు పంపించి వేశాడు. ఒక్కొక్కరుగా అందరు బైకు వెళ్లిపోయారు.  

పెద్ద ప్రమాదం తప్పడంతో బస్సులోని వారంతా హమ్మయ్య అని ఊపిరిపీల్చుకున్నారు.ఈ ఘటనను కొంత మంది వీడియో తీసి సోషల్ మీడియాలో  పోస్ట్ చేయగా అది కాస్త వైరల్గా మారింది. దీనిపై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. బాబోయ్ ఎంత డెంజర్గా బస్సు ప్రమాదం నుంచి బైటపడిందని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

ZEENEWS TRENDING STORIES