SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

చైనాలో ఆర్థిక పెనుభూతం.. అప్పుల ఊబిలో చిక్కుకున్న 10 కోట్ల మంది ప్రజలు..!!

China Debt Crisis: చైనా ఆర్థిక వ్యవస్థ మందగమనంలో చిక్కుకుంది. దీంతో అక్కడి ప్రజల ఆర్థిక పరిస్ధితి తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. బ్లూమ్ బర్గ్ బిజినెస్ వీక్ రిపోర్టు ప్రకారం.. ఉద్యోగాలు కోల్పోవడం.. రియల్ ఎస్టేట్ రంగం కుప్పకూలడం.. కోవిడ్ మహమ్మారి తాలూకు దీర్ఘకాలిక ప్రభావాల కారణంగా కుటుంబాల ఆదాయం గణనీయంగా పడిపోయాయి.

Written By Bhoomi
Published: Nov 09, 2026, 09:59 AM IST | Updated: Nov 09, 2026, 10:01 AM IST
Image Credit: China Debt Crisis
Join

China Debt Crisis: చైనా ఆర్థిక వ్యవస్థ మందగమనంలో చిక్కుకుంది. దీంతో అక్కడి ప్రజల ఆర్థిక పరిస్ధితి తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. బ్లూమ్ బర్గ్ బిజినెస్ వీక్ రిపోర్టు ప్రకారం.. ఉద్యోగాలు కోల్పోవడం.. రియల్ ఎస్టేట్ రంగం కుప్పకూలడం.. కోవిడ్ మహమ్మారి తాలూకు దీర్ఘకాలిక ప్రభావాల కారణంగా  కుటుంబాల ఆదాయం గణనీయంగా పడిపోయాయి. ఫలితంగా సుమారు 10 కోట్ల మంది వినియోగదారులు తాము తీసుకున్న పర్సనల్ లోన్స్ తిరిగి చెల్లించలేక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. గేవికల్ డ్రాగనోమిక్స్ సంస్థ అంచనాల ప్రకారం.. అప్పుల ఊబిలో చిక్కుకున్న ఈ పౌరుల సంఖ్య చాలా భారీ స్థాయిలో ఉందని స్పష్టం అవుతోంది.

రాయునియన్ క్రెడిట్ ప్లాట్ ఫామ్ డేటా ప్రకారం.. లోన్స్ చెల్లించని వినియోగదారుల రుణాల మార్కెట్ చైనాలో భారీగా విస్తరించింది. 2021లో బ్యాంకులు సుమారు 18.6 బిలియన్ యువాన్ల మొండి బకాయిలను బదిలీ చేయగా.. 2025 చివరి నాటికి ఈ మొత్తం 20 రెట్లు పెరిగి దాదాపు 454 బిలియన్ యువాన్లకు చేరినట్లు పేర్కొంది. ఇవి ఎక్కువగా క్రెడిట్ కార్డు బకాయిలు, పర్సనల్ లోన్స్ వంటి అసురక్షిత లోన్సే కావడం గమనార్హం. హోం, వెహికల్ లోన్స్ ఇందులో భాగంగా కావని పేర్కొంది.

వుహాన్‌కు చెందిన 23 ఏళ్ల ర్యాన్ హు వంటి రుణ వసూలుదారులు.. తాము రోజంతా రుణగ్రహీతలతో ఫోన్‌లోనే గడుపుతున్నామని చెబుతున్నారు. వీరిలో కరోనావైరస్ మహమ్మారి తర్వాత తమ వ్యాపారాలు కోలుకోని రెస్టారెంట్ యజమానులు, రియల్ ఎస్టేట్ ఉద్యోగాలు కోల్పోయిన జంటలు, ఇంకా తమ అద్దె కూడా చెల్లించలేని యువ పట్టభద్రులు ఉన్నారు.

అధికారిక బ్యాంకింగ్ గణాంకాల ప్రకారం..  చైనాలో గృహ రుణాల ఎగవేత రేటు 3శాతం కంటే తక్కువగా ఉంది. ఇది అమెరికాతో పోలిస్తే మెరుగ్గా ఉన్నప్పటికీ.. వాస్తవ పరిస్థితి భిన్నంగా ఉందని విశ్లేషకులు అంటున్నారు. చాలా మంది తమ రుణాలను రీఫైనాన్సింగ్ ద్వారా గానీ లేదా కుటుంబ సభ్యుల ద్వారా గానీ తిరిగి చెల్లిస్తున్నారని.. ఇంకా దేశవ్యాప్తంగా వ్యక్తిగత దివాలా చట్టం లేదని.. అందువల్ల అసలు సమస్య పరిష్కారం కావడం లేదని వారు చెబుతున్నారు.

ఈ సంవత్సరం.. చైనా ప్రభుత్వం రుణ వసూళ్లపై నిబంధనలను కఠినతరం చేసింది. దీనివల్ల దూకుడుగా ఉండే వసూలు పద్ధతులు తగ్గి, రికవరీ రేట్లు మందగించాయి. అంతేకాకుండా, ప్రభుత్వం ఆన్‌లైన్ రుణాలపై వడ్డీ రేట్లకు పరిమితి విధించింది. దీనివల్ల రుణగ్రహీతలు కొత్త రుణాలు పొందడం కష్టంగా మారింది.

Also Read: 

తగ్గుతున్న బంగారం ధరలు.. హైదరాబాద్, విజయవాడలో తులం ధర ఎంతో తెలుసా?

 

మన శరీరానికి నిజమైన ఇంజన్ ఆయిల్ ఇదే.. ఈ పోషకం లోపిస్తే అనారోగ్య సమస్యల సునామీ తప్పదు..!!
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

ZEENEWS TRENDING STORIES