• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /అంతర్జాతీయం
  • /లక్కీ డ్రాలో అదృష్టం వరించింది.. ఏకంగా 365 రోజుల పెయిడ్ లీవ్ గెలుచుకున్న ఉద్యోగి!

లక్కీ డ్రాలో అదృష్టం వరించింది.. ఏకంగా 365 రోజుల పెయిడ్ లీవ్ గెలుచుకున్న ఉద్యోగి!

China Employee Wins Paid Leave: చైనాలో ఒక ఉద్యోగికి బంపర్ జాక్‌ఫాట్‌ తగిలింది.. ఆఫీసు నిర్వహించిన లక్కీ డ్రాలో ఏకంగా ఒక ఉద్యోగి 365 రోజుల పెయిడ్‌ లీవ్‌ను గెలుచుకున్నాడు. ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Reported ByDharmaraju DhurishettyEdited ByDharmaraju Dhurishetty
Published: Oct 02, 2026, 12:31 PM IST|Updated: Oct 02, 2026, 12:33 PM IST
joinshare
లక్కీ డ్రాలో అదృష్టం వరించింది.. ఏకంగా 365 రోజుల పెయిడ్ లీవ్ గెలుచుకున్న ఉద్యోగి!
Image Credit: జీ తెలుగు న్యూస్..

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

Trending

  • News
  • Photos
  • Videos
'నోషనల్ ఇంక్రిమెంట్' అంటే ఏంటి? జీతం పెరగకపోయినా ఇంక్రిమెంట్ వచ్చినట్టేనా?.. రూల్స్ ఇవే!

'నోషనల్ ఇంక్రిమెంట్' అంటే ఏంటి? జీతం పెరగకపోయినా ఇంక్రిమెంట్ వచ్చినట్టేనా?.. రూల్స్ ఇవే!

2

Jason Sanjay: దళపతి విజయ్‌కి, అమ్మ సంగీతకి ఉన్న తేడా చెప్పిన జాసన్ సంజయ్

3

OnePlus ఫోన్లపై రూ.24,000 వరకు భారీ డిస్కౌంట్.. త్వరలోనే సేల్‌లో అదిరిపోయే ఆఫర్లు!

4

Adoni New District Demand: ఆదోని ప్రత్యేక జిల్లా కోసం పోరాటం.. పల్లెపల్లెనా ఉద్యమ పోరు..!

5

లక్కీ డ్రాలో అదృష్టం వరించింది.. ఏకంగా 365 రోజుల పెయిడ్ లీవ్ గెలుచుకున్న ఉద్యోగి!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

China Employee Wins Paid Leave: రోజూ ఉదయాన్నే లేవడంతో పాటు ట్రాఫిక్‌ను దాటుకుంటూ ఆఫీసలకు చేరడం, పని ఒత్తిడిని భరించడం.. ఇదీ సగటు ఉద్యోగి రోజు లైఫ్‌.. అయితే, ఏడాది పొడవునా.. ఒక్క రోజు కూడా ఆఫీసుకు వెళ్లకుండా.. ఇంట్లోనే హాయిగా గడిపినా.. ప్రతి నెలా పూర్తి జీతం ఖాతాలో పడితే ఎలాంటి ఉంటుంది. అయితే, సారిగ్గా ఇలాంటి ఊహించని బంపర్‌ జాక్‌ఫాట్‌ చైనాకు చెందిన ఓ ఉద్యోగిని వరించింది. కంపెనీ నిర్వహించని ప్రత్యేకమైన లక్కీ డ్రాలో భాగంగా అతను ఏకంగా 365 రోజుల పెయిడ్ లీవ్ గెలుకుని ఇంటర్నెట్‌లో నిలిచాడు. ఇప్పుడు చైనా సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన అతనే కనిపిస్తున్నాడు. అయితే, ఈ ఘటనకు సంబంధించిన అన్ని వివరాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

14 ఏళ్ల సేవకు దక్కిన జాక్‌పాట్..
ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. చైనాలోని ఓ ప్రైవేట్ సంస్థలో సదరు ఉద్యోగి గత 14 సంవత్సరాలుగా ఎంతో నమ్మకంగా.. చాలా నిజాయితీగా ఉద్యోగం చేస్తున్నాడు.. కంపెనీకి సంబంధించిన వార్షిక వేడుకల్లో భాగంగా యాజమాన్యం ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా ఒక లక్కీ డ్రాకు సంబందించిన పోటీని నిర్వహించింది. ఇందులో ఊహించని విధంగా అతనికి అత్యంత భారీ బహుమతి తగిలింది.. ఏడాది పొడవునా.. ఆఫీసుకు రాకపోయి, పూర్తి జీతం చెల్లించేలా పెయిడ్‌ లీవ్‌ను ఆ సంస్థ బహుమతిగా ప్రకటించింది.

ఈ వార్త బయటకు రావడంతోనే అంతర్జాతీయంగా సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది.. తీవ్రమైన పని ఒత్తిడితో సతమతమయ్యే కార్పొరేట్ ఉద్యోగులు ఈ వార్తను చూసి ఆశ్చర్యపోతున్నారు. ప్రపంచంలోనే అత్యుత్తమ ఉద్యోగి బహుమతి ఇది.. అని కొందరు కామెంట్లు చేస్తుంటే.. ప్రతి ఉద్యోగి జీవితంలో కనీసం ఒక్కసారైనా ఇలాంటి అదృష్టం తగలాలని కోరుకుంటాడు.. అంటూ మరికొందరు సరదాగా పోస్టులు పెడుతూ వస్తున్నారు. తన 14 ఏళ్ల కష్టానికి.. సంస్థ పట్ల చూపిన అంకితభావానికి సరైన న్యాయం జరిగిందని నెటిజన్లు ఆ ఉద్యోగిపై ప్రశంసలు కురిపిస్తూ వస్తున్నారు.

సాధారణంగా కంపెనీల లక్కీ డ్రాలలో ఎలక్ట్రానిక్ గాడ్జెట్లతో పాటు ట్రిప్ టిక్కెట్లు లేదా బోనస్‌లు ఇవ్వడం సర్వసాధారణం. కానీ, ఏకంగా 365 రోజుల పాటు పని నుంచి విరామం ఇచ్చి.. వేతనం ఇవ్వడం కార్పొరేట్ చరిత్రలోనే అత్యంత అరుదైన విషయంగా చెప్పుకొచ్చాడు.. కుటుంబంతో సమయం గడపడానికి.. కొత్త ప్రదేశాలను సందర్శించడానికి లేదా వ్యక్తిగత అభిరుచులను నెరవేర్చుకోవడానికి ఈ సెలవులు అతనికి ఒక సువర్ణావకాశం.

 

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu News
Trending News