China LAC Troops Withdrawal News: భారత్ చైనా సరిహద్దుల్లో వాస్తవాధీన రేఖ వెంబడి చైనా దేశం తన దూకుడును కొంతమేరకు తగ్గించుకుంది.. సరిహద్దు ప్రాంతాల్లో గత కొంతకాలంగా కొనసాగుతున్న ఉద్రిక్తతల నడుమ చైనా తన బలగాల మొహరింపును గణనీయంగా తగ్గించినట్లు భారత సైన్యం వెల్లడించింది. ఇండియన్ ఆర్మీ విడుదల చేసిన తాజా వార్షిక నివేదికలు సరిహద్దు పరిస్థితులతో పాటు రక్షణ వ్యూహాలకు సంబంధించిన కీలక అంశాలను అధికారికంగా పేర్కొంది. ఇందులో భాగంగానే చైనాకు సంబంధించిన సరిహద్దు అంశాలను కూడా పేర్కొనడం విశేషం..
50 వేల మంది సైనికులు వెనక్కి...
భారత ఆర్మీ నివేదిక అందించిన వివరాల ప్రకారం. భారత్ చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలను తగ్గించే క్రమంలో చైనాకు చెందిన పీపుల్స్ విపరేషన్ ఆర్మీ కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఎల్ ఎసికి సమీపంలో మొహరించిన దాదాపు 50 వేల మందికి పైగా చైనా సైనికులను అక్కడి నుంచి తరలించింది. ఈ బలగాలను సరిహద్దు రేఖకు దూరంగా ఉన్న వారి శాశ్వత సైనిక శిక్షణ కేంద్రాలతో పాటు స్థావరాలకు పంపినట్లు నివేదిక స్పష్టం చేసింది.. శీతాకాల పరిస్థితులతో పాటు సైనిక చర్చల ఫలితంగా చైనా ఈ ఉపసంహరణ చర్యలు చేపట్టినట్లు విశ్లేషకులు చెబుతున్నారు..
భారత్ అప్రమత్తం..
చైనా సరిహద్దు నుంచి బలగాలను తగ్గించినప్పటికీ.. భారత సైన్యం మాత్రం తననిగాను.. మొహరింపును ఎక్కడ తరలించలేకపోయినట్లు తెలుస్తోంది. డ్రాగన్ ఎత్తుగడలను ఏమాత్రం నమ్మకుండా వాస్తవాధీన రేఖ పొడవున భారత సైన్యం గట్టిపహార కొనసాగిస్తోంది.. సరిహద్దు వెంబడి భారత దళాల మొహరింపులో ఎలాంటి మార్పు చేయలేదని అధికారులు ఇప్పటికే పేర్కొన్నారు. ఏ క్షణమైన ఎలాంటి పరిస్థితులైన ఎదుర్కొనేందుకు వీలుగా ముందస్తు రక్షణ ఏర్పాట్లతో పాటు నిఘవ్యవస్థను ప్రతిష్టంగా కొనసాగిస్తున్నట్లు ఆర్మీ స్పష్టం చేసింది.. జనాలకు సంబంధించిన సంసిద్ధతతో పాటు మౌలిక వసతుల పెంపుపై ప్రత్యేకమైన దృష్టి సారించినట్లు ఆర్మీ పేర్కొంది.
ఇది కూడా చదవండి..: అత్యవసరమైతే తప్ప బయటకు రాకండి...
మరోవైపు కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూ కాశ్మీర్‌లో అంతర్గత భద్రత పరిస్థితులపై ఆర్మీ కూడా ప్రత్యేకమైన నివేదిక స్పష్టతనిచ్చింది. అక్కడ శాంతి భద్రతల పరిస్థితిని పూర్తిగా సైన్యం నియంత్రణలోనే ఉందని స్పష్టం చేసింది. ఉగ్రవాద కదలికలను సమర్థవంతంగా తిప్పికొడుతూ సరిహద్దు వెంబడి చొరబాట్లను గట్టిగా అడ్డుకున్నామని.. నియంత్రణ రేఖ వెంబడి పటిష్టమైన నిఘాను కొనసాగిస్తున్నామని భారత సైన్యం వెల్లడించింది. దేశ సర్వభౌమత్వ రక్షణలో ఎలాంటి రాజీ పడే ప్రసక్తే లేదని వార్షిక నివేదిక తేల్చి చెప్పేసింది..
ఇది కూడా చదవండి..: అత్యవసరమైతే తప్ప బయటకు రాకండి...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..