SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Chinese Husband: ఇదెక్కడి ప్రేమరా సామి.. భార్యను హగ్ చేసుకుని 5 పక్కటేముకలు విరిచేసిన భర్త.. వీడియో..

Chinese man hugs his wife: చైనాకు చెందిన ఒక భర్త తన భార్యను ప్రేమతో గట్టిగా హత్తుకున్నాడు. దీంతో ఆమె కింద పడిపోయి బాధతో విలవిల్లాడిపోయింది.ఈ ఘటనకు చెందిన వీడియో వైరల్గా మారింది.

Written By Inamdar Paresh
Published: Oct 21, 2026, 07:26 PM IST | Updated: Oct 21, 2026, 07:41 PM IST
Image Credit: chinese husband wife ribs broke row
Join

Chinese wife hospitalized with five broken ribs video: ఇటీవల భార్యభర్తలకు చెందిన ఘటనలు నిత్యం వార్తలలో  ఉంటున్నాయి. పెళ్లిళ్లు చేసుకుని ఒకరితో మరోకరు అన్యోన్యంగా ఉండకుండా తమ కాపురంలో నిప్పులు పోసుకుంటున్నారు. వివాహేతర సంబంధాలు, ఆర్థిక పరిస్థితులతో గొడవలు పెట్టుకుని ఒకర్ని మరోకరు చంపుకుంటున్నారు. ఇలాంటి క్రమంలో ఒక జంట ప్రస్తుతం అందరిదృష్టిని తమవైపు తిప్పుకున్నారు. అయితే.. ఇక్కడ భర్త ప్రేమతో చేసిన పని కాస్త భార్య ప్రాణాల మీదకు వచ్చిపడింది.ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది. చైనాలోని జియాంగ్సు ప్రావిన్స్‌ లో ఈ ఘటన చోటు చేసుకుంది.

 

 

స్థానికంగా ఉన్న రెస్టారెంట్ లో భర్త తన భార్యను తీసుకెళ్లాడు. మరీ అక్కడకు వెళ్లిన తర్వాత భార్యను చూసి భలే ఫీలయ్యాడు. మూడ్ వచ్చిందో లేదా ప్రేమ తన్నుకు వచ్చిందో కానీ అతను బలంగా హగ్ చేసుకున్నాడు. ఆ తర్వాత ఎత్తుకుని గిరగిరా తిప్పాడు.  ఇంతలో ఆమె భర్త హగ్ చేసుకుంటే ఫీల్ అవ్వాల్సింది పోయి.. అతని కౌగిలి నుంచి విడిపించుకుని కుప్పకూలిపడిపోయింది. బాధతో విలవిల్లాడిపోయింది. పాపం భర్తకు ఏంజరిగిందో అర్థంకాలేదు.

 వెంటనే తన భార్యను దగ్గరలోని ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెను టెస్ట్ లు చేయగా ఆమె పక్కటేముకలు విరిగినట్లు వైద్యులు చెప్పారు. ఏకంగా 5 ఎముకలకు పగుళ్లు వచ్చినట్లు చెప్పారు. దీంతో ఆ దంపతులు షాక్ అయ్యారు. 

సదరు మహిళ ఆస్టియోపొరోసిస్ తో బాధపడుతుందని వైద్యులు తెలిపారు.ఈ వ్యాధితో బాధపడుతున్న వారిని అకస్మాత్తుగా పైకి ఎత్తడం లేదా వారి ఛాతీని గట్టిగా నొక్కడం వంటివి చేయకూడదని వైద్యులు చెప్పారు. మహిళకు ఆస్పత్రిలో ప్రస్తుతం వైద్య సేవలు అందిస్తున్నారు. తన భార్య పక్కటేముకులు విరిగేందుకు కారణమైనందుకు భర్త తీవ్ర విచారం వ్యక్తం చేశాడు.  తన భార్య మీద ప్రేమ హగ్ చూపించాలని  మాత్రమే తాను అనుకున్నానని, ఈ విధంగా జరుగుతుందని అనుకొలేదని చెప్పుకొచ్చాడు.  ఈ ఘటనకు చెందిన వీడియో  నెట్టింట వైరల్ గా మారింది.

 

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

ZEENEWS TRENDING STORIES