• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /వినోదం
  • /Zee Entertainment: బుల్లితెర, ఓటీటీ వీక్షకులకు పండగే.. సరికొత్త షోలతో రాబోతున్న జీ ఎంటర్‌టైన్‌మెంట్..!

Zee Entertainment: బుల్లితెర, ఓటీటీ వీక్షకులకు పండగే.. సరికొత్త షోలతో రాబోతున్న జీ ఎంటర్‌టైన్‌మెంట్..!

Zee Entertainment New Shows: టెలివిజన్, డిజిటల్ వినోద రంగంలో సరికొత్త అధ్యాయానికి ‘జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్’ (ZEEL) శ్రీకారం చుట్టింది. బుల్లితెర ప్రేక్షకులతో పాటు జీ5 ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు వివిధ ప్రాంతీయ భాషల్లో భారీ స్థాయిలో నాన్-ఫిక్షన్ కార్యక్రమాలను ప్రారంభించేందుకు రెడీ అయింది. పూర్తి వివరాలు ఇలా..

Written ByAshok Krindinti
Published: Oct 21, 2026, 07:47 PM IST|Updated: Oct 21, 2026, 07:49 PM IST
joinshare
Zee Entertainment: బుల్లితెర, ఓటీటీ వీక్షకులకు పండగే.. సరికొత్త షోలతో రాబోతున్న జీ ఎంటర్‌టైన్‌మెంట్..!

About the Author

Ashok Krindinti

Ashok Krindinti

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. దీపావళికి ముందే కేంద్ర ఉద్యోగులకు 3శాతం డీఏ పెంపు... జీతాలు ఎంత పెరుగుతాయంటే...?

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. దీపావళికి ముందే కేంద్ర ఉద్యోగులకు 3శాతం డీఏ పెంపు... జీతాలు ఎంత పెరుగుతాయంటే...?

2

Zee Entertainment: బుల్లితెర, ఓటీటీ వీక్షకులకు పండగే.. సరికొత్త షోలతో రాబోతున్న జీ ఎంటర్‌టైన్‌మెంట్..!

3

Chinese Husband: ఇదెక్కడి ప్రేమరా సామి.. భార్యను హగ్ చేసుకుని 5 పక్కటేముకలు విరిచేసిన భర్త.. వీడియో..

4

Delhi: ఢిల్లీలో ఒక్కసారిగా పెరిగిన వాయు కాలుష్యం.. గ్రాప్-1 ఆంక్ష‌లు జారీ చేసిన అధికారులు .!.

5

Rachita Ram Video: సెల్ఫీ పేరుతో అరాచకం.. కన్నడ భామ రచితా రామ్ భుజంపై చెయ్యివేసి బలంగా లాగిన అభిమాని.. వీడియో..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Zee Entertainment New Shows: ప్రముఖ నెట్‌వర్క్ ‘జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్’ (ZEEL) సరికొత్త కంటెంట్ వ్యూహాంతో మార్కెట్‌లోకి వచ్చేందుకు సిద్ధమైంది. బుల్లితెర ప్రేక్షకులతో పాటు ఓటీటీ వీక్షకులను అలరించేందుకు విభిన్న ప్రాంతీయ భాషల్లో భారీ స్థాయిలో నాన్-ఫిక్షన్ కార్యక్రమాలను ప్రారంభించేందుకు సన్నాహాలు పూర్తి చేసింది. కుటుంబ సభ్యులందరూ కలిసి చూసేలా.. ప్రేక్షకులే ప్రత్యక్ష భాగస్వాములయ్యేలా పాత ఐకానిక్ షోలను సరికొత్త హంగులతో పునఃప్రారంభించడంతో పాటు ఆధునిక ఫార్మాట్లను రంగంలోకి దించుతోంది. గత మూడు దశాబ్దాలుగా సంగీతం, కామెడీ, గేమ్‌ షోలు, టాలెంట్ హంట్ వంటి విభాగాల్లో ‘డాన్స్ ఇండియా డాన్స్’, ‘ఛోరియాన్ చలీ గావ్’ వంటి ఎన్నో సక్సెస్‌ఫుల షోలో టెలివిజన్ రంగంలో  జీ ఎంటర్‌టైనమెంట్ చెరగని ముద్ర వేసింది. ఇప్పుడు అదే ఒరవడిని కొనసాగిస్తూ.. మారుతున్న ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా సరికొత్త లైనప్‌ను సిద్ధం చేసింది.

ఐదు భాషల్లో ‘స రే గ మ ప’ నాదం

దేశవ్యాప్తంగా మ్యూజిక్ ప్రియులను అలరిస్తున్న ప్రముఖ సంగీత రియాలిటీ షో ‘స రే గ మ ప’ను ఒకేసారి తెలుగు, హిందీ, తమిళం, మరాఠీ, మలయాళం భాషల్లో తీసుకువచ్చింది. దేశం నలుమూలల నుంచి ప్రతిభను వెలికితీసి, సంగీత ప్రియులకు ఒక అద్భుతమైన వేదికను అందించడమే దీని ముఖ్య ఉద్దేశం. అలాగే ప్రాంతీయంగా అగ్రస్థానంలో కొనసాగుతున్న ‘జీ బంగ్లా’లోని ‘దాదాగిరి’, ‘జీ మరాఠీ’లోని ‘హోమ్ మినిస్టర్’ వంటి రియాలిటీ షోలు తమ హవాను కొనసాగిస్తున్నాయి. ప్రముఖుల నిజ జీవిత విశేషాలతో గతంలో మంచి ఆదరణ పొందిన టాక్ షో ‘జీనా ఇసీ కా నామ్ హై’ సరికొత్తగా ‘2.0’ వెర్షన్‌తో రీ-ఎంట్రీ ఇస్తోంది. ప్రముఖ నటుడు ఆర్. మాధవన్ హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. ఈ షోలో విభిన్న రంగాలకు చెందిన ప్రముఖుల సక్సెస్ స్టోరీలను పరిచయం చేయనున్నారు.

  • తెలుగులో ప్రముఖుల ముచ్చట్లతో ‘ది మెగా మల్టీప్లెక్స్’ రానుంది.
  • తమిళంలో ‘లెజెండ్స్’ పేరుతో మరో విలక్షణ సెలబ్రిటీ టాక్ షో ప్రసారం కానుంది.

నోరూరించే వంటల ప్రొగ్రామ్స్

ఆహార ప్రియుల కోసం ప్రాంతీయ భాషల వారీగా ప్రత్యేక షోలను ‘జీ’ రూపొందించింది.

  • తెలుగు: వారెవా (Varewa)
  • తమిళం: సమయల్ ఎక్స్‌ప్రెస్ (Samaiyal Express)
  • మరాఠీ: కిచెన్ కళాకార్ (Kitchen Kalakar)
  • కన్నడ: ఓగ్గరనే దబ్బి (Oogarane Dabbi)

వీటితో పాటు గేమ్ షోల విభాగంలో జీ అన్మోల్‌లో ‘లక్షపతి దీదియా’, జీ కేరళంలో ‘జోడి నెం. 1’ షోలు సందడి చేయనున్నాయి. హాస్య ప్రియుల కోసం జీ బంగ్లాలో ‘మిరక్కల్’, జీ మరాఠీలో సరికొత్త సీజన్‌తో రానున్న ‘చలా హవా యేవు ద్యా’ సరికొత్త వినోదాన్ని అందిచేందుకు వచ్చేస్తున్నాయి.

‘జీ5’లోనూ వినోదం..

ఈ సరికొత్త వ్యూహంపై జీ ఎంటర్‌టైన్‌మెంట్ చీఫ్ కంటెంట్ ఆఫీసర్ రాఘవేంద్ర హున్సూర్ మాట్లాడుతూ.. ఫిక్షన్ సీరియళ్లు బుల్లితెర ప్రేక్షకుల ఇళ్లలో జీ నెట్‌వర్క్‌ను నిత్య అలవాటుగా మార్చగా.. నాన్-ఫిక్షన్ షోలు ప్రతి ఒక్కరూ తప్పక చూడాల్సిన అనుభూతిని అందిస్తున్నాయన్నారు. ప్రస్తుతం ఆడియెన్స్ అభిరుచి పూర్తిగా మారిపోయిందని.. ఫ్యామిలీ అంతా కలిసి టీవీ ముందు కూర్చుని చూస్తూనే.. అందుకు సంబంధించిన డైలాగ్స్ మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారని అన్నారు. అందుకే ప్రేక్షకులు కేవలం వీక్షకులుగా మాత్రమే మిగిలిపోకుండా.. అందులో ప్రత్యక్షంగా భాగస్వాములయ్యేలా తమ సొంత ఐపీలను (IPs) డిజైన్ చేస్తున్నామని తెలిపారు. 

టీవీతో పాటు ‘జీ5’ (ZEE5) డిజిటల్ వీక్షకులకు మరిన్ని ప్రత్యేక అవకాశాలను కల్పిస్తూ సమగ్ర విధానాన్ని అమలు చేస్తున్నామని వెల్లడించారు. రోజూ అలరించే డ్రామా సీరియళ్లతో పాటు.. ప్రేక్షకులను సుదీర్ఘకాలం కట్టిపడేసే నాన్-ఫిక్షన్ షోల కలయికతో వినోద రంగంలో తన ప్రత్యేక ముద్రను మరింత విస్తరించేందుకు ‘జీ’ ముందడుగు వేస్తోందన్నారు. మూడు దశాబ్దాలకు పైగా నాణ్యమైన కంటెంట్‌తో సుమారు 190కి పైగా దేశాల్లో 140 కోట్ల మందికి పైగా ప్రేక్షకులను అలరిస్తున్న జీ.. తాజా వ్యూహంతో వినోద రంగంలో సరికొత్త శకానికి నాంది పలుకుతోందని నిపుణులు చెబుతున్నారు. 

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu News
Tollywood