• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /అంతర్జాతీయం
  • /ముస్లిం శరణార్థులు అనుకుని గొడవ.. తీరా దగ్గరికి వెళ్లి చూస్తే గొడుగులు!

ముస్లిం శరణార్థులు అనుకుని గొడవ.. తీరా దగ్గరికి వెళ్లి చూస్తే గొడుగులు!

Man Arguing With Umbrellas: తాజాగా సోషల్ మీడియాలో ఒక యువకుడు చీకట్లో నిలిచి ఉంచిన గొడుగులతో వాదనలకు దిగిన ఘటన అందర్నీ నవ్వు పుట్టించేలా చేసింది. విదేశీ శరణార్థులు అనుకొని ఆ యువకుడు మద్యం మత్తులో వాటితో గొడవకు దిగాడు. ఇప్పుడు ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో సైతం వైరల్ అవుతున్నాయి..

Reported ByDharmaraju DhurishettyEdited ByDharmaraju Dhurishetty
Published: Sep 26, 2026, 03:10 PM IST|Updated: Sep 26, 2026, 03:12 PM IST
joinshare
ముస్లిం శరణార్థులు అనుకుని గొడవ.. తీరా దగ్గరికి వెళ్లి చూస్తే గొడుగులు!
Image Credit: జీ తెలుగు న్యూస్..

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Man Arguing With Umbrellas Video: చీకటి సమయాల్లో.. ఆపై ఒంట్లో పీకల దాకా తాగిన మద్యం.. ఇంకేముంది కళ్ళ ముందు కనిపించే దృశ్యాలు.. మెదడులో ఎన్నో సరికొత్త ఊహలు వస్తూ ఉంటాయి. విదేశీ శరణార్థుల సమూహం అనుకొని ఒక వ్యక్తి ఏకంగా అరగంట పాటు నడి రోడ్డుపై తెగ వాదించుకున్న ఘటన ఇప్పుడు ఇంటర్నెట్ను సైతం షేక్ చేస్తుంది. ఎదురుగా ఉన్నవారు ఎంతకీ సమాధానం చెప్పలేకపోవడంతో ఆగ్రహంతో ఊగిపోయాడు కూడా.. తీరా అసలు విషయం తెలిసాక అతనికి దిమ్మతిరిగే బొమ్మ కనిపించేసింది. ఎందుకంటే అక్కడ ఉన్నది మనుషులు కాదు.. కేవలం నల్లటి కవర్లు చుట్టిన పెద్దని గొడుగులు..

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వింత ఘటన తీవ్ర చర్చనీ అంశంగా మారింది. చూసేవారికి ముందుగా పెద్ద ఘర్షణల అనిపించినప్పటికీ వాస్తవం తెలియక.. చాలామంది పడి పడి నవ్వుకున్నట్లు తెలుస్తోంది.. సదర్ వ్యక్తి మద్యం మత్తులో వీధి లోపల నుంచి వెళ్తూ ఉన్నాడు.. ఒకచోట వరుసగా నిలబెట్టి ఉంచిన పెద్ద గొడుగులు కనిపించాయి.. రాత్రివేళ వెలుతురు తక్కువగా ఉండడంతో.. ఆ గొడుగులపై ఒక బ్లాక్ కలర్లో క్లాత్ కప్పి ఉండడంతో.. సాంప్రదాయ దుస్తులు ధరించిన విదేశీ వలసదారుల గుంపు అని అతని భావించాడు..

అనుమానంతో పాటు మత్తు కలిసి అతడిలో ఒక తీవ్రమైన ఆవేశాన్ని తెచ్చేలా చేశాయి.. వారి వద్దకు వెళ్లి తన వాదనలు వినిపించడం ప్రారంభించాడు.. ఆ గల్లీ ఎంత నిశ్శబ్దంగా ఉండడంతో.. వారు మౌనంగా ఉన్నారని.. అతని పట్ల నిర్లక్ష్యంగా భావిస్తున్నారని అనుకొని తీవ్ర అసహనానికి గురైనట్లు కూడా తెలుస్తోంది. దాదాపు 30 నిమిషాల పాటు ఒంటరిగానే పెద్ద ఎత్తున కేకలు వేస్తూ.. చేతులను ఊపుతూ వాదనలను కొనసాగించాడు..

ఎంత అరిచినప్పటికీ.. అవతలి నుంచి స్పందన లేకపోవడంతో పాటు దూరం నుంచి పరిశీలించి చూడడం దండగని.. దగ్గరికి వెళ్లి చూడగా.. అప్పుడు అతనికి పరిస్థితి ఏంటి అనేది అర్థం అయింది. ఇందాకటిదాకా ఆవేశంగా వాదించింది మనుషులతో కాదని.. చాపల ముందు మూసి పెట్టిన పెద్ద గొడుగులని భావించుకున్నాడు. ఒక్కసారిగా ఆశ్చర్యపోయి బిత్తిరి చూపుతో అక్కడి నుంచి అతను వెళ్ళిపోయాడు..

ఈ వ్యవహారంలో ఎలాంటి ఘర్షణ జరగలేదు.. ఎవ్వరికి ఎలాంటి హాని కలగలేదు.. అయితే మనసులో ముందస్తు భావన.. ఆసక బారిన కంటిచూపు, మద్యం ప్రభావం కలిస్తే సాధారణ వస్తువులు కూడా ఎలాంటి ఊహాత్మక ప్రత్యర్థులుగా మారిపోతాయో అనేది ఈ ఘటన ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచింది.. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ గా మారింది. అత్తి తెచ్చిన తంట అంతే ఇదే.. అంటూ కొంతమంది జోకులుగా కామెంట్లు రాసుకు వస్తున్నారు..

 

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu News