SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

అమెరికాలో చదువుతున్న భారతీయ విద్యార్థులకు పిడుగులాంటి వార్త..ఓపీటీపై 70 వేల డాలర్ల ఫీజు ప్రతిపాదన..!!

OPT Fee Proposal: అమెరికాలో ఉన్నత విద్యనభ్యసించే విదేశీ విద్యార్థులకు బిగ్ షాకిచ్చింది అక్కడి ప్రభుత్వం. ముఖ్యంగా అక్కడ ఉద్యోగ అనుభవం పొందేందుకు ప్రయత్నించే వారికి కోలుకోలేని షాక్ ఇచ్చే దిశగా ట్రంప్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది.

Reported By Bhoomi Written By Bhoomi
Published: Oct 08, 2026, 11:06 AM IST | Updated: Oct 08, 2026, 11:07 AM IST
Image Credit: F1 Visa Work Permit
Join

OPT Fee Proposal: అమెరికాలో ఉన్నత విద్యనభ్యసించే విదేశీ విద్యార్థులకు బిగ్ షాకిచ్చింది అక్కడి ప్రభుత్వం. ముఖ్యంగా అక్కడ ఉద్యోగ అనుభవం పొందేందుకు ప్రయత్నించే వారికి కోలుకోలేని షాక్ ఇచ్చే దిశగా ట్రంప్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. చదువు పూర్తి అయిన తర్వాత అమెరికాలో తాత్కాలికంగా ఉద్యోగం చేసుకునేందుకు ఉపయోగపడే.. ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ పై భారీగా ఫీజు విధించే ప్రతిపాదనను అంతర్గత భద్రతా విభాగం తెరపైకి తీసుకువచ్చింది.

తర్వాత మరోసారి ఓపీటీలో పాల్గొనే వారికి 30వేల డాలర్ల ఫీజు విధించాలని తెలిపింది. అయితే ఇది కేవలం ప్రతిపాదనలు మాత్రమే. అవి ఇంకా అమల్లోకి రాలేదు. అక్టోబర్ 8 నుంచి నవంబర్ 9వ తేదీ వరకు దీనిపై ప్రజల నుంచి అభిప్రాయాలను డీహెచ్ ఎస్ స్వీకరించనుంది. ఎఫ్ 1 వీసాపై అమెరికాలో చదివేందుకు అర్హత ఉన్న విదేశీ విద్యార్థులకు చదువుకు సంబంధించిన ఉద్యోగం చేసేందుకు OPT అవకాశాన్ని కల్పిస్తుంది. ముఖ్యంగా సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, గణితం రంగాల్లో చదివే విద్యార్థులకు ఇది ఎంతో కీలకమని చెప్పాలి.

ప్రతిపాదిత విధానం ప్రకారం.. విద్యార్థి ఓపీటీకి దరఖాస్తు చేసుకునే ముందే సంబంధిత విద్యాసంస్థ ఈ ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. విద్యాసంస్థ చెల్లింపు చేయనట్లయితే.. ఉద్యోగం చేసుకునేందుకు అమెరికా  పౌరసత్వం, వలస సేవల విభాగం అనుమతి మంజూరు చేయదు. అయితే వలస వ్యవస్థ వల్ల జరుగుతున్న మోసాలు, దుర్వినియోగానికి అడ్డుకట్ట వేసేందుకే ఈ మార్పులు ప్రతిపాదించినట్లు డీహెచ్ఎస్ వెల్లడించింది. కొన్ని విద్యాసంస్థలు, ఏజెన్సీలు, విద్యార్థులు నిబంధనలను దుర్వినియోగం చేస్తున్నట్లు డీహెచ్ఎస్ పేర్కొంది.

ప్రస్తుతం అర్హత ఉన్న విద్యార్థులు ఒక్కో విద్యాస్థాయిలో 12 నెలల వరకు ఓపీటీ పొందే అవకాశం ఉంటుంది.  ఇక స్టెమ్ కోర్సుల గ్రాడ్యుయేట్లకు మరో 24 నెలల పొడిగించే అవకాశం కూడా ఉంది.  ప్రజాభిప్రాయం అనంతరం  ప్రతిపాదనలో మార్పులు చేసి తుది నిబంధనలను ప్రకటించే అవకాశం ఉందని పేర్కొంది.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

ZEENEWS TRENDING STORIES