SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

టీచర్ నుంచి అడ*ల్ట్ కంటెంట్ క్రియేటర్‌గా.. ఇప్పుడు పేద పిల్లల కోసం స్కూల్ నిర్మాణం!

Viral News: ఫిలిప్పీన్స్‌కు సంబంధించిన అ**డల్ట్ కంటెంట్ క్రియేటర్‌ స్కూల్‌ను నిర్మించిన ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. అయితే, గతంలో ఆ యువతి టీచర్‌గా పని చేసింది.. కానీ కొన్ని కారణాల వల్ల అ**డల్ట్ క్రియేటర్‌గా మారింది. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలసుకుందాం.

Reported By Dharmaraju Dhurishetty
Published: Oct 15, 2026, 03:54 PM IST | Updated: Oct 15, 2026, 03:56 PM IST
Image Credit: ZEE TELUGU NEWS
Join

Telugu Viral News: జీవితం విసిరిన సవాళ్లకు ఏ మాత్రం కుంగిపోకుండా.. తన ప్రయాణాన్ని మలుపు తిప్పుకుని సమాజానికి ఆదర్శంగా నిలుస్తోంది.. ఫిలిప్పీన్స్‌కు చెందిన మోడల్ మేయుర్న్ స్మైల్స్.. ప్రస్తుతం అ**డల్ట్ కంటెంట్ క్రియేటర్‌గా పని చేస్తున్న ఈ యువతి.. తన సంపాదనలోని సగం భాగాన్ని.. చిన్నారుల విద్యావకాశాల కోసం ఖర్చు చేస్తూ.. అందరినీ ఆశ్చర్యపరిచేలా చేస్తోంది.. తాను పుట్టి పెరిగిన సెబూ ప్రాంతంలో పేద విద్యార్థుల కోసం ఒక పాఠశాలను స్వయంగా నిర్మించి.. ఎందరికో ఆదర్శంగా నిలుస్తోంది..

చదువులతో బతుకులు మారతాయని.. బలంగా నమ్మిన మేయుర్న్.. 2024లో సెబూ నగర సమీపంలో దాదాపు  రూ.25 లక్షలకు పైగా ఖర్చు చేసి.. భూమిని కొనుగోలు చేసింది. దీంతో 300 మందికి పైగా చిన్నారులకు ఉచిత లేదా అద్భుతమైన విద్యాబుద్ధులు నేర్పించేలా ఒక పెద్ద స్కూల్ భవన నిర్మాణాన్ని మొదలు పెట్టింది.. ప్రధాన భవనం పనులు జరుగుతుండగానే.. సమయం వృథా కాకూడదనే ఉద్దేశంతో అక్కడే.. ఒక చిన్న లెర్నింగ్ సెంటర్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చింది..

కేవలం భవనం కట్టించి.. చేతులు దులుపుకోకుండా.. అక్కడి పిల్లల బాగోగులను ఆమె స్వయంగా పర్యవేక్షిస్తూ వస్తోంది.. విద్యార్థులకు కావాల్సిన పుస్తకాలతో పాటు బ్యాగులు, ఇతర స్టేషనరీ సామగ్రిని ఉచితంగా అందిస్తూ వస్తోంది.. వీటితో పాటు సైన్స్ ప్రయోగాలు, కుకింగ్ క్లాసులు వంటి ప్రాక్టికల్ లెర్నింగ్ వర్క్‌షాప్‌లను కూడా నిర్వహించడం విశేషం..

మేయుర్న్‌కు విద్యతో విడదీయరాని అనుబంధం ఉంది. అడ**ల్ట్ కంటెంట్ పరిశ్రమలోకి అడుగుపెట్టడానికి ముందు ఆమె ఇంగ్లీష్ ఉపాధ్యాయురాలిగా కూడా పని చేశారట. అయితే, అనుకోకుండా లీక్ అయిన ఒక ప్రైవేట్ వీడియో ఆమె వ్యక్తిగత, వృత్తి జీవితాన్ని తలకిందులు చేసిందని తెలిపారు.. ఆ పరిస్థితుల్లో జీవనోపాధి కోల్పోయిన ఆమె.. కుటుంబాన్ని పోషించుకోవడానికి.. తోబుట్టువుల చదువుల ఖర్చులను భరించడానికి తప్పనిసరి పరిస్థితుల్లో ఆన్‌లైన్ అడల్ట్ కంటెంట్ రంగాన్ని ఎంచుకోవాల్సి వచ్చిందని తెలిపింది..

సమాజం నుంచి ఎన్నో విమర్శలతో పాటు హేళనలు ఎదురైనా ఆమె వెనకడుగు వేయలేకపోయింది.. ఆన్‌లైన్‌లో సంపాదించిన గుర్తింపు.. ఆదాయంతో తన కుటుంబాన్ని నిలబెట్టుకోవడమే కాకుండా.. తన గతాన్ని మర్చిపోకుండా తిరిగి విద్యారంగంలోకే అడుగుపెట్టింది. 
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..

ZEENEWS TRENDING STORIES