• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /అంతర్జాతీయం
  • /Donald Trump: గొప్పలు కాదు.. నిజాలే చేప్తున్నా.!. నోబెల్ శాంతి బహుమతిపై మరోసారి రెచ్చిపోయిన డొనాల్డ్ ట్రంప్.!.

Donald Trump: గొప్పలు కాదు.. నిజాలే చేప్తున్నా.!. నోబెల్ శాంతి బహుమతిపై మరోసారి రెచ్చిపోయిన డొనాల్డ్ ట్రంప్.!.

Donald trump on nobel peace prize: ఇప్పటికే తనను పాకిస్థాన్, కంబోడియా, ఇజ్రాయెల్, దేశాల అధినేతలు తన నోబెల్ శాంతి బహుమతికి తన పేరును నామినేట్ చేశారని ట్రంప్ చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో నోబెల్ శాంతి బహుమతిపై ట్రంప్ మరోసారి వైట్ హౌస్ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Written ByInamdar Paresh
Published: Oct 08, 2026, 09:12 AM IST|Updated: Oct 08, 2026, 09:26 AM IST
joinshare
Donald Trump: గొప్పలు కాదు.. నిజాలే చేప్తున్నా.!. నోబెల్ శాంతి బహుమతిపై మరోసారి రెచ్చిపోయిన డొనాల్డ్ ట్రంప్.!.
Image Credit: donaldtrump(file)

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
తెలుగు సినిమాలతో నానా పాటేకర్ అనుబంధం..

తెలుగు సినిమాలతో నానా పాటేకర్ అనుబంధం..

2

నవరాత్రుల వేళ ఈ 4 రాశుల జాతకంలో గజకేశరి యోగం.. డబ్బు, ఉద్యోగం, అదృష్టంలో భారీ మార్పులు!

3

అహంకారంతో నిర్ణయాలు తీసుకుంటే చేటు తప్పదు.. ముగ్గురు స్నేహితులు - తేనె - తేలు నీతి కథ.!!

4

Nana Patekar Wife: ఐఐటీ ర్యాంకర్ నుంచి నటిగా.. నానా పటేకర్ భార్యతో హీరోయిన్ రష్మికకు ప్రత్యేక అనుబంధం..

5

ఇంజినీరింగ్ పూర్తి చేశారా? HAL నుండి బిగ్ నోటిఫికేషన్! రూ.1.2 లక్షల వరకు జీతం, అప్లై ప్రాసెస్ ఇదే!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Donald trump comments on nobel peace Prize: ప్రతిఏటా  అక్టోబర్ నెలలో నోబెల్ బహుమతులను ప్రకటిస్తారు. ఆల్ఫ్రెడ్ నోబెల్ వర్ధంతి రోజైన డిసెంబరు 10వ తేదీన విజేతలకు బహుమతులను అందజేస్తారు. ముఖ్యంగా ఆరు రంగాలలో ఈ పురస్కారాలు అందజేస్తారు. అయితే నోబెల్ పురస్కారాల ప్రకటన ఇప్పటికే మొదలైంది. అయితే.. గతేడాది నుంచి తనకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాల్సిందేనంటూ రచ్చ చేసిన అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మరోసారి వైట్ హౌస్  వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు.

డొనాల్డ్ ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఆయన ప్రపంచ దేశాలకు తన దుందుడుకు నిర్ణయాలతో చుక్కలు చూపిస్తున్నారు.  అంతే కాకుండా పక్క దేశాలతో పదే పదే కయ్యానికి కాలుదువ్వుతున్నారు. గతేడాది నుంచి తనకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని మంకుపట్టు పట్టారు.

 భారత్, పాక్ తో పాటు ఎనిమిది దేశాల మధ్య యుద్దంను తాను ఆపానని, శాంతి చర్చలతో ఆయా దేశాలలో ప్రశాంత వాతావరణం కలిగేలా చేశారని డొనాల్డ్ ట్రంప్ మరోసారి వైట్ హౌస్ లో కీలక వ్యాఖ్యలు చేశారు. తానేమి గొప్పలు చెప్పుకొవట్లేదని, చేసిందే చెప్పుకుంటున్నట్లు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడారు.

 దౌత్య ప్రయత్నాల వల్ల ఎనిమిది యుద్ధాలకు ముగింపు పలికానని చెబుతూ.. తనలా గతంలో  ఏ అమెరికా అధ్యక్షుడు ఇలాంటి గొప్పతనం సాధించలేడని ఢంకా బజాయించి మరీ చెప్పారు.  అంతే కాకుండా.. మరో అంతర్జాతీయ వివాదాన్ని కూడా త్వరలో పరిష్కరించే అవకాశం ఉందని కూడా మాట్లాడారు. గతంలో తనను పాకిస్థాన్,  కంబోడియా, ఇజ్రాయెల్ వంటి  దేశాల అధినేతలు తన పేరును నోబెల్ శాంతి బహుమతికి  నామినేట్ చేశారని చెప్పుకొచ్చారు.

గతంలో వెనిజులా ప్రతిపక్ష నేత మరియా కొరినా మచాడో తన నోబెల్ శాంతి బహుమతి పతకాన్ని నాకు బహూకరించారని మాట్లాడారు. చరిత్రలో నా కన్నా ఎక్కువ అర్హులు ఎవరూ లేరని ట్రంప్ అభిప్రాయపడ్డారు. 

అదే విధంగా ట్రంప్.. భారత్‌-పాక్, ఇజ్రాయెల్‌-ఇరాన్‌,  సెర్బియా-కొసోవో, కంబోడియా-థాయ్‌లాండ్‌, రువాండా-డెమొక్రటిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగో,  అర్మేనియా-అజర్‌బైజాన్‌, ఈజిప్ట్‌-ఇథియోపియా, తదితర దేశాల్లో ఉద్రిక్త పరిస్థితుల్లో జోక్యం చేసుకుని దౌత్యంతో యుద్దంను ముగించామని ట్రంప్ చెప్పుకొచ్చిన 8 దేశాల జాబితాలో ఉన్నాయని చెప్పుకొచ్చారు. అయితే ఆయా దేశాలు మాత్రం ట్రంప్ వాదనలను బహిరంగంగానే ఖండించాయి. 

కానీ ట్రంప్ మాత్రం తన టెంపరి తనం మానుకోలేదు. ఇక ట్రంప్ అమెరికా పగ్గాలు స్వీకరించిన తొలి ఏడాది నుంచే నోబెల్ శాంతి బహుమతిపై గంపెడాశాలు పెట్టుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 2018లో ఉత్తర కొరియాలో శాంతిని నెలకొల్పిన నేపథ్యంలో.. నార్వేకు చెందిన కొందరు రాజకీయ నాయకులు ట్రంప్‌ పేరును నోబెల్‌ శాంతి బహుమతికి ప్రతిపాదించాయని ఆయన చెప్పుకొచ్చారు. 

కానీ అప్పటి జపాన్ ప్రధాని షింజో అబే ఈ నామినేషన్‌ను బహిరంగంగా ధృవీకరించలేదు. ఆ తర్వాత కూడా తనకు ఈ పురస్కారం దక్కాలని పలుమార్లు చెప్పారు. కానీ ఆయనకు మాత్రం నోబెల్ శాంతి దక్కలేదు. కానీ ట్రంప్ మాత్రం.. 2025లో అయితే  ఇప్పటికే నాలుగైదు సార్లు నోబెల్‌ శాంత బహుమతి రావాల్సిందంటూ ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. 

అయితే.. ప్రస్తుతం ఇరాన్ తో, ఇజ్రాయేల్ తో యుద్దం నడుస్తున్న నేపథ్యంలో  ట్రంప్‌కు 2026 నోబెల్ శాంతి బహుమతి లభించే అవకాశం లేదని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు నోబెల్ శాంతి బహుమతిని ఈసారి ఎవరిని వరిస్తుందో అన్నది ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది.

 

 

 

 

 

Add Zee News as a Preferred Source
TAGS:
Donald Trump
America