పురుషులు గూగుల్‌లో ఎక్కువగా వెతుకుతున్న టాప్ 4 విషయాలు ఇవే!
Most Searched Topics By Men: గూగుల్‌లో పురుషులు ఎక్కువగా ఏం సెర్చ్ చేస్తారో తెలుసా? అంతర్జాతీయ పురుషుల దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిందే.. మగవారు ఎక్కువగా.. ఫిట్‌నెస్, బాడీ బిల్డింగ్‌తో పాటు జుట్టు రాలడం, ఇలా చాలా అంశాలను గూగుల్ సెర్చ్‌లో వెతుకుతారట.
Most Searched Topics By Men: సమాజంలో కుటుంబ బాధ్యతలతో పాటు కెరీర్ పరంగా వస్తున్న ఒత్తిడి, బడ్జెట్ ఫ్లానింగ్ కోసం, కష్టాల్లో వస్తున్న ఇబ్బందులను సమర్థవంతంగా మోసే పురుషుల కోసం ప్రతి సంవత్సరం నవంబర్ 19న అంతర్జాతీయ పురుషుల దినోత్సవం జరుపుకుంటూ ఉంటారు. పైకి ఎంతో గంభీరంగా కనిపించే పురుషుల మనసులోనూ అనేక సందేహాలు, ఆందోళనలు, ఒత్తిడి ఉంటాయని మనందరికీ తెలుసు.. అయితే, తమ వ్యక్తిగత సమస్యలను ఇతరులతో పంచుకోవడానికి ఎన్నో అడ్డచ్చినా.. చాలామంది బాయిస్ సమాధానాల కోసం డైరెక్ట్ గూగుల్ సెర్చ్ చేస్తున్నారు.. తాజా డిజిటల్ ట్రెండ్స్ ప్రకారం.. ఫిట్‌నెస్ మొదలుకొని వైవాహిక జీవితం వరకు చాలా మంది పురుషులు ఇంటర్నెట్‌లో అత్యధికంగా కొన్ని విషయాలను సెర్చ్ చేస్తున్నారు. అవేంటో? వాటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
వీటి గురించి ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారు..
ఫిట్‌నెస్, బాడీ బిల్డింగ్..
ఆరోగ్యంతో పాటు శరీరానికి సంబంధించిన ఫిట్‌నెస్ విషయంలో ప్రస్తుతం యువత ఎంతో శ్రద్ధ చూపుతూ వస్తున్నారట.. సిక్స్ ప్యాక్ యాబ్స్ ఎలా పొందాలి? పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును కరిగించడం ఎలా? కండరాల పెరుగుదలకు ఎలాంటి ప్రోటీన్ కలిగిన ఆహారాలు తీసుకోవాలి? జిమ్‌కు వెళ్లకుండా ఇంట్లోనే వ్యాయామం ఎలా చేయాలి? వంటి ప్రశ్నలు గూగుల్ సెర్చ్‌లో మొదటి స్థానంలో ఉందట.
జుట్టు రాలడం..
పురుషులను అత్యధికంగా వేధిస్తున్న సమస్యలలో జుట్టు రాలడం ఒకటి.. జుట్టు రాలడాన్ని తగ్గించుకోవడం ఎలా? తెల్ల జుట్టును సహజంగా నల్లగా మార్చే మార్చుకోవాలంటే ఏం చేయాలి? ఒత్తైన గడ్డం త్వరగా పెరగాలంటే ఏం చేయాలి వంటి అంశాల కోసం ఇంటర్నెట్‌లో విపరీతంగా సెర్చ్ చేస్తున్నారు. గూగుల్ అంధించిన సమాచారం ప్రకారం.. పురుషుల గ్రూమింగ్ సంబంధిత సెర్చ్‌లలో ఏకంగా 50 శాతం పెరిగిందట..
స్కిన్ కేర్..
చర్మ సౌందర్యం కోసం మహిళలలే ఎక్కువగా వెతుకుతారని అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు పురుషులు కూడా తమ స్కిన్ కేర్ కోసం సన్‌స్క్రీన్ లోషన్లతో పాటు ఫేస్ వాష్‌లు, సీరమ్‌లు, మాయిశ్చరైజర్ల గురించి వెతుకుతున్నట్లు తెలుస్తోంది. కళ్ల కింద డార్క్ సర్కిల్స్, మొటిమలకు చిట్కాలను గూగుల్‌లో సెర్చ్ చేస్తున్నారట..
ప్రేమ, పెళ్లి..
భావోద్వేగాలను అస్సలు బయటికి చెప్పుకోలేని చాలా మంచి పురుషులు.. బంధాల విషయంలో గూగుల్ నుంచి సలహాలు తీసుకుంటున్నారట.. తొలి డేట్‌లో ఎలా మాట్లాడాలి? అమ్మాయిలను ఆకట్టుకోవడం ఎలా? వివాహానికి సరైన జీవిత భాగస్వామిని ఎలా ఎంచుకోవాల్సి ఉంటుంది? బ్రేకప్ బాధ నుంచి బయటపడటం ఎలా? సంతోషకరమైన వైవాహిక జీవిత రహస్యాల గురించి తెలుసుకుంటున్నారు.