SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

iPhone Boxes Float: సముద్రంలో నౌక మునక.. నడి సంద్రంలో తేలియాడుతున్న ఐఫోన్‌ 18 బాక్స్‌లు

iPhone 18 Boxes Floating In Strait Of Hormuz: ఐఫోన్‌ ప్రియులకు ఇది చేదు వార్త. ఇటీవల విడుదలైన ఐఫోన్‌ 18 ఫోన్లు నడిసంద్రంలో మునిగిపోయాయి. ఓ నౌక మునిగిపోవడంతో సముద్రం ఐఫోన్లు నీటిలో తేలియాడుతున్నాయి. అంతేకాకుండా అత్యంత ఖరీదైన పర్ఫ్యూమ్‌ కూడా నీటిపాలైంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Written By Ravi Kumar Sargam
Published: Oct 15, 2026, 08:43 PM IST | Updated: Oct 15, 2026, 08:49 PM IST
Image Credit: Source: Twitter
Join

Strait Of Hormuz Cargo Ship Accident: అత్యంత విలాసవంతమైన.. లగ్జరీ ఫోన్‌గా ఉన్న ఐఫోన్లు సముద్రంలో తేలియాడుతున్నాయి. వాటిలో ఇటీవల విడుదలైన ఐఫోన్‌ 18 ఫోన్లు కూడా ఉన్నాయి. లక్షలాది ఐఫోన్లు సముద్రపు నీటిపాలయ్యాయి. అంతేకాకుండా అత్యంత ఖరీదైన పర్ఫూమ్‌లు కూడా సముద్రంలో పడిపోయాయి. అంతర్జాతీయ తీవ్ర పరిణామాలకు దారి తీసిన హర్మూజ్‌ జలసంధిలో సరుకు రవాణా నౌక పడిపోవడంతో ఈ పరిస్థితి ఎదురైంది.

కొన్నేళ్లుగా హర్మూజ్‌ జలసంధి కేంద్రంగా అంతర్జాతీయ పరిణామాలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఇరాన్‌, అమెరికా యుద్ధానికి కేంద్రంగా నిలిచిన హర్మూజ్‌ జలసంధిలో కొన్నాళ్లుగా ప్రశాంతంగా ఏర్పడింది. అయితే తాజాగా హర్మూజ్‌ జలసంధిలో సరుకు రవాణా చేస్తున్న భారీ నౌక సముద్రంలో మునిగిపోయింది. సీమైన్‌ను ఢీకొనడంతో కార్గో నౌక మునిగిపోయినట్లు ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్‌ కోర్‌ (ఐఆర్‌జీసీ) ప్రకటించింది. చట్ట విరుద్ధమైన, ప్రమాదకర మార్గంలో ఈ నౌక ప్రయాణిస్తున్న క్రమంలో ఈ ఘటన జరిగిందని అక్కడి మీడియా తెలిపింది.

దాదాపు 2500 కంటైనర్లతో వెళ్తున్న కార్గో నౌక సముద్రంలో మునిగిపోయింది. దీంతో ఆ కంటెయినర్‌లలో ఉన్న ఐఫోన్లు, లగ్జరీ పెర్ఫ్యూమ్‌ బాటిళ్లు ఇతర వస్తువులన్నీ కూడా సముద్రంలో పడిపోయాయి. కంటైనర్లు చెల్లాచెదురు కావడంతో ఐఫోన్‌లన్నీ నీటిలో తేలిపోయాయి. కంటెయినర్‌లోని వస్తువులు కుప్పలుగా నీటిపై తేలియాడుతున్న దృశ్యాలు వైరల్‌గా మారాయి. ఈ కార్గో నౌక సింగపూర్‌ జెండా కలిగి ఉందని.. దుబాయ్ నుంచి సరకులు ఇతర ప్రాంతానికి తీసుకువెళ్తున్నట్లు తెలుస్తోంది. అయితే హర్మూజ్‌ మార్గంలో సింగపూర్‌కు చెందిన మరో సరకు రవాణా నౌక కూడా ప్రమాదానికి గురయినా ఎలాంటి ఆ నౌకకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడి గమ్యానికి చేరుకుంది. రెండు నౌక ప్రమాదాల్లో ఎవరికీ ఎటువంటి గాయాలు కాకపోవడం విశేషం.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

ZEENEWS TRENDING STORIES