SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

ఇరాన్‌లో యుద్ధ మేఘాలు...మహిళలకు తుపాకీ శిక్షణ..!

Iran Trains Women: పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ...ఇరాన్‌లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. అమెరికా, ఇజ్రాయెల్‌తో ఉద్రిక్తతలు తీవ్రతరం అవుతున్న టైంలో.. సామాన్య పౌరులను సైతం యుద్ధానికి సిద్ధం చేస్తోంది ఇరాన్. ఇందులో భాగంగా రాజధాని టెహ్రాన్‌లో మహిళలకు సైతం సైనిక శిక్షణ ఇచ్చారు.

Written By TA Kiran Kumar Sharma
Published: Oct 05, 2026, 09:24 AM IST | Updated: Oct 05, 2026, 06:41 PM IST
Image Credit: Iran Army Training
Join

Women Train in Iran:  ఇరాన్, అమెరికా యుద్దంలో మహిళలకు  తుపాకులను ఎలా ఉపయోగించాలి ? అత్యవసర పరిస్థితుల్లో తమను, కుటుంబాన్ని ఎలా రక్షించుకోవాలి? వంటి అంశాలపై వారికి శిక్షణ అందించారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌లోని ఇమామ్ హుస్సేన్ స్క్వేర్‌లో ఏర్పాటు చేసిన సైనిక శిక్షణ కేంద్రానికి పెద్ద సంఖ్యలో మహిళలు హాజరయ్యారు. ముందుగా సైనిక అధికారులు, శిక్షకులు వారికి పలు సూచనలు చేశారు. అనంతరం హ్యాండ్‌గన్లతో సహా వివిధ ఆయుధాలను ఎలా పట్టుకోవాలి, ఎలా కాల్చాలనే అంశాలపై ప్రాక్టికల్‌ శిక్షణ ఇచ్చారు. ఒక రోజు ముందే మరో పౌర సైనిక శిక్షణ కేంద్రాన్ని ఇరాన్ ప్రారంభించింది. అమెరికా, ఇజ్రాయెల్ బలగాలు దాడికి దిగితే ఎదుర్కొనేందుకు పౌరులను సిద్ధం చేయడమే ఈ కేంద్రాల ఉద్దేశమని పలువురు సూచిస్తున్నాయి.

యుద్ధ సమయంలో తన కుటుంబాన్ని, పరిసర ప్రాంతాన్ని రక్షించుకునే సామర్థ్యం ఉంటే భయం కొంత తగ్గుతుందని శిక్షణలో పాల్గొన్న మహిళలు చెబుతున్నారు. ఈ శిక్షణలో పాల్గొంటున్న కొందరికి ప్రత్యక్ష పోరాటం కంటే, అత్యవసర పరిస్థితుల్లో కుటుంబాన్ని కాపాడుకునేందుకు సిద్ధంగా ఉండటమే తమ ప్రధాన లక్ష్యం అంటున్నారు. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన తాజా వ్యాఖ్యలు ఉద్రిక్తతలను మరింత పెంచాయి. ఇరాన్‌పై తదుపరి చర్య విషయంలో త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఆయన సంకేతాలు ఇచ్చారు.

ఇరాన్ ఇప్పటికే తీవ్రంగా దెబ్బతిన్నదని, ఇక తమ ముందున్న మార్గం సులభమైందా? లేదా కఠినమైనదా అన్నదే ప్రశ్న అని ట్రంప్ వ్యాఖ్యానించారు. అనంతరం, ట్రంప్‌ వ్యాఖ్యలకు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ ఘాటుగా స్పందించారు. సైనిక చర్య లేదా కొత్త ఆంక్షలతో ఈ సంక్షోభానికి పరిష్కారం లభించదని స్పష్టం చేశారు. తమపై మరోసారి సైనిక దాడి జరిగితే...గతం కంటే మరింత బలంగా ప్రతిస్పందిస్తామని హెచ్చరించారు. న్యాయం, సమానత్వం ఆధారంగా జరిగే చర్చల ద్వారానే సంక్షోభానికి ముగింపు పలకగలమని పేర్కొన్నారు. దీంతో ఒకవైపు అమెరికా-ఇరాన్ మధ్య దౌత్య చర్చలు నిలిచిపోగా.. మరోవైపు ఇరాన్‌లో పౌరులకు సైనిక శిక్షణ ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇదిలా ఉండగా.. గతంలో ఇరాన్‌లోని మహిళలు ప్రభుత్వ విధానాలపై తీవ్రంగా విమర్శలు, నిరసనలు వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా తప్పనిసరి హిజాబ్‌ నిబంధనలు, మోరాలిటీ పోలీసింగ్‌, మహిళలపై ఆంక్షలకు వ్యతిరేకంగా “ఉమెన్‌ లైఫ్‌, ఫ్రీడమ్‌” ఉద్యమంలో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. తాజాగా కూడా టెహ్రాన్‌లోని అల్లామెహ్‌ తబాతబాయీ యూనివర్సిటీ విద్యార్థులు తప్పనిసరి హిజాబ్‌, మోరాలిటీ పోలీస్‌, రాజకీయ అణచివేతకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయితే ఇప్పుడు అమెరికా, ఇజ్రాయెల్‌తో యుద్ధ ఉద్రిక్తతలు పెరగడంతో.. అదే దేశంలో కొందరు మహిళలు కుటుంబాలు, పరిసరాలను రక్షించుకునేందుకు తుపాకీ శిక్షణ తీసుకోవడం ఆసక్తికర పరిణామంగా మారింది.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES