SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

ఇరాన్ శాంతి ఒప్పందాన్ని తిరస్కరించిన ట్రంప్.. మళ్లీ పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు..?

Iran America Ceasefire Offer: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత తీవ్రంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. అమెరికా-ఇరాన్‌ మధ్య యుద్ధానికి తెరదించేలా ఇరాన్‌ చేసిన కీలక ప్రతిపాదనకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అంగీకరించలేదని ది వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ నివేదించింది. ఏడు రోజుల్లో హార్ముజ్‌ జలసంధిని తిరిగి తెరవడం, కాల్పుల విరమణకు వెళ్లడం వంటి ప్రతిపాదనను ఇరాన్‌ అమెరికా ముందు ఉంచగా.. ట్రంప్‌ దాన్ని తిరస్కరించినట్లు అమెరికా అధికారులను ఉద్దేశిస్తూ కథనం వెల్లడించింది.

Written By TA Kiran Kumar Sharma
Published: Sep 26, 2026, 01:17 PM IST | Updated: Sep 26, 2026, 01:22 PM IST
Image Credit: America vs Iran (ZEE News/Source)
Join

America Refuges Iran Offer:  మరోవైపు ఇరాన్ శాంతి ఒప్పందాన్ని అమెరికా తిరస్కరించిన  సమయంలో నవంబర్‌లో జరిగే అమెరికా మధ్యంతర ఎన్నికల తర్వాత ఇరాన్‌పై అమెరికా మళ్లీ బాంబు దాడులు ప్రారంభించే అవకాశం ఉందని ట్రంప్‌ తన సన్నిహితులకు చెప్పినట్లు సదరు కథనంలో నివేదించింది. అయితే ఇరాన్‌ ప్రతిపాదనపై అమెరికా నుంచి అధికారిక స్పందన ఇంకా వెలువడలేదని చెప్పింది.

ఐక్యరాజ్యసమితి సాధారణ సభ సమావేశాల సందర్భంగా ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాగ్చీ ఏడు రోజుల ప్రణాళికను వెల్లడించారు. అమెరికా కొన్ని షరతులను అంగీకరిస్తేనే ఏడో రోజు నాటికి హర్మూజ్ జలసంధిని తిరిగి తెరవడంతో పాటు అణు కార్యక్రమంపై సమగ్ర చర్చలను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఇరాన్‌ తాజా ప్రతిపాదన గతంలో అమెరికా-ఇరాన్‌ మధ్య కుదిరిన అవగాహన నేపథ్యంలో  ఉందని చెబుతున్నారు. పశ్చిమాసియాలో భద్రతను పునరుద్ధరించాలంటే ఇరాన్‌పై అమెరికా జరిపే దురాక్రమణ చర్యలకు ముగింపు పలకాలని ఆయన ఉద్ఘాటించారు. ఈ ప్రతిపాదనను మధ్యవర్తుల ద్వారా అమెరికాకు చేరవేసినట్లు పేర్కొన్నారు. టెహ్రాన్‌ ప్రతిపాదనలో అమెరికా నావికా దిగ్బంధాన్ని ఎత్తివేయడం, ఆంక్షలకు సంబంధించిన అంశాలపై చర్యలు తీసుకోవడం, కాల్పుల విరమణకు సంబంధించిన ఏర్పాట్లు వంటి షరతులు ఉన్నట్లు అంతర్జాతీయ నివేదికలు చెబుతున్నాయి. హర్మూజ్​ జలసంధి తిరిగి తెరవడం, ఆ తర్వాత అణు చర్చలు ప్రారంభించడం ఈ ప్రణాళికలో కీలక అంశాలుగా ఉన్నాయి.

ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం సందర్భంగా ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాఘ్చీ ఈ ప్రతిపాదనను వెల్లడించారు. ఖతార్‌ మధ్యవర్తుల ద్వారా అమెరికాకు తమ ప్రతిపాదనను పంపినట్లు తెలిపారు. అమెరికా కొన్ని షరతులను అంగీకరిస్తే ఏడు రోజుల్లో హార్ముజ్‌ జలసంధిని తిరిగి తెరిచి, సాధారణ నౌకా రాకపోకలను పునరుద్ధరిస్తామని చెప్పారు.

ఇరాన్ పై ఆంక్షలను సడలించడం.. 
ఇరాన్‌ షరతుల్లో ప్రధానంగా అమెరికా నౌకాదళ దిగ్బంధాన్ని ఎత్తివేయడం, ఇరాన్‌ చమురు ఎగుమతులపై ఆంక్షలను సడలించడం, మధ్య ప్రాచ్యవ్యాప్తంగా కాల్పుల విరమణ పాటించడం ఉన్నాయి. లెబనాన్‌లోనూ శత్రుత్వాన్ని నిలిపివేయాలని ఇరాన్‌ కోరింది. దీనికి ప్రతిగా హార్ముజ్‌ను తెరిచి, అమెరికాతో అణు కార్యక్రమంపై చర్చలను తిరిగి ప్రారంభించేందుకు సిద్ధమని చెప్పుకొచ్చారు.

ఇరాన్‌ ప్రతిపాదనతో దౌత్యపరమైన చర్చలకు అవకాశం కనిపించినప్పటికీ, ట్రంప్‌ మాత్రం ఒప్పందంపై అనుమానంతో ఉన్నట్లు వాల్‌స్ట్రీట్‌ కథనం పేర్కొంది. ఇరాన్‌ తన డిమాండ్లను పూర్తిగా అమలు చేస్తుందన్న నమ్మకం ట్రంప్‌కు లేదని అమెరికా అధికారులను ఉటంకించింది. మరోవైపు అమెరికా, ఇరాన్‌ మధ్య మధ్యవర్తుల ద్వారా సానుకూల, నిర్మాణాత్మక చర్చలు జరుగుతున్నాయని ఓ అమెరికా అధికారి రాయిటర్స్‌కు తెలిపారు. అందువల్ల ప్రస్తుతం పరిస్థితి ఒకవైపు ఇరాన్‌ ఏడు రోజుల్లో హార్ముజ్‌ను తెరిచే ప్రతిపాదన.. మరోవైపు ట్రంప్‌ దానిపై విముఖతగా కనిపిస్తోంది. ఇరాన్‌ మాత్రం అమెరికా అధికారిక స్పందన కోసం ఎదురుచూస్తోంది.


మాతో అన్ని దౌత్య మార్గాలను మూసివేసింది.. ఇరాన్.. 
ఇదిలా ఉండగా, జూన్​ నెలలో కుదిరిన శాంతి ఒప్పందం విఫలం కావడానికి ట్రంప్ కారణమని ఇరాన్ అధ్యక్షుడు మసూద్​ పెజెష్కియాన్ ఓ వార్త సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ట్రంప్​‌తో  ఒక ఒప్పందానికి వచ్చారని, దానిపై సంతకాలు కూడా జరిగాయన్నారు. ఆ ఫ్రేమ్ వర్క్ ​ ఆధారంగా ముందుకు సాగడానికి ఇప్పటికీ సిద్ధంగా ఉన్నామని తెలిపారు. తాము హర్మూజ్‌ను ​ మూసివేయలేదని, అయినప్పటికీ, అమెరికా దాడి చేస్తోందని చెప్పారు. తమ దేశ సుప్రీం లీడర్‌ను  హతమార్చిందని, ఆయనతో పాటు కీలక సైనిక కమాండర్లు, శాస్రవేత్తలు, ప్రభుత్వ అధికారులు మృతి చెందారని చెప్పారు. చర్చలకు బదులుగా అమెరికా మాపై దాడి చేస్తూ అన్ని దౌత్య మార్గాలను మూసివేస్తోందని ఆరోపించారు. అయినప్పటికీ తాము చర్చలను సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.

సౌదీపై హూతీల దాడులు..

మరోవైపు యెమెన్‌లోని హూతీ తిరుగుబాటుదారులు సౌదీ అరేబియాపై దాడులను చేస్తూనే ఉన్నారు. మరోసారి హూతీలు రియాద్‌లోని పలు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేపట్టారు. ఈ క్రమంలో సౌదీలోని అతిపెద్ద చమురు శుద్ధి కేంద్రాల్లో ఒకటైన అరామ్‌కో రిఫైనరీపై డ్రోన్‌, క్షిపణి దాడులు జరిపినట్లు తెలుస్తోంది. రాస్‌ తనురాలోని ఈ రిఫైనరీ మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకున్నట్లు హూతీ సైనిక ప్రతినిధి పేర్కొన్నారు. ఈ దాడుల్లో పలువురు ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పారు. మరోవైపు, హూతీ దాడులకు గట్టి బదులిచ్చామని సౌదీ అరేబియా పేర్కొంది. దక్షిణ తైఫ్ ప్రావిన్స్, ఎర్ర సముద్ర తీరంలోని యాన్బు ప్రాంతాల్లో హూతీలు ప్రయోగించిన ఆరు బాలిస్టిక్ క్షిపణులను తమ బలగాలు అడ్డుకున్నట్లు చెప్పింది.  అలాగే, హూతీ దాడుల నేపథ్యంలో పవిత్ర మక్కా నగరంతో సహా పలు ప్రాంతాలకు సౌదీ అత్యవసర హెచ్చరికలు జారీ చేసింది.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES