• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /అంతర్జాతీయం
  • /ఇజ్రాయిల్ రాజకీయాల్లో కీలక పరిణామం.. నెతన్యాహుకు పార్లమెంట్‌లో ఎదురుదెబ్బ..

ఇజ్రాయిల్ రాజకీయాల్లో కీలక పరిణామం.. నెతన్యాహుకు పార్లమెంట్‌లో ఎదురుదెబ్బ..

Isreal PM Netanyahu: ఇజ్రాయెల్‌ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహుకు పార్లమెంట్‌లో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆయన ప్రత్యర్థి, మాజీ సైన్యాధిపతి గాడి ఐసెన్‌కాట్‌ వర్గానికి చెందిన మాటన్‌ కహానా ఇజ్రాయెల్‌ పార్లమెంట్‌ స్పీకర్‌గా ఎన్నిక కావడం ఆయనకు కోలుకోలేని దెబ్బ.

Written ByTA Kiran Kumar Sharma
Published: Nov 18, 2026, 15:18 IST|Updated: Nov 18, 2026, 15:22 IST
joinshare
ఇజ్రాయిల్ రాజకీయాల్లో కీలక పరిణామం.. నెతన్యాహుకు పార్లమెంట్‌లో ఎదురుదెబ్బ..
Image Credit: Israel PM Major Set back ()

About the Author

TA Kiran Kumar Sharma

TA Kiran Kumar Sharma

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

2

బయట ఫుడ్ తినకపోయినా ఫ్యాటీ లివర్ వస్తోందా? ఇంట్లో చేసే ఈ 5 పొరపాట్లే అసలు కారణమా?

3

Congress: సంక్రాంతి తర్వాత 'ప్రజా బలం' చేపడతాం.. నాయకులు గ్రామాలకు వెళ్లండి: రేవంత్‌ రెడ్డి

4

Revanth Reddy: 'ఎమ్మెల్యేలు అనిరుధ్, రాజగోపాల్ రెడ్డిలను ఈసారి క్షమించేద్దాం: రేవంత్ రెడ్డి

5

Kishan Reddy: రెబల్ స్టార్ ప్రభాస్‌తో భేటీ అయిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. అసలు కారణం ఏమిటంటే..?..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Netanyahu Set Back:  120 మంది సభ్యులున్న పార్లమెంట్‌లో కహానాకు 66 మంది మద్దతు పలకగా.. నెతన్యాహు పార్టీ అభ్యర్థి ఒఫిర్‌ కాట్జ్‌కు 52 ఓట్లు మాత్రమే వచ్చాయి.ఈ ఎన్నిక నెతన్యాహు రాజకీయ ఆధిపత్యానికి మరో సవాలుగా మారింది. ఇప్పటి వరకు స్పీకర్‌గా కొనసాగిన అమీర్‌ ఓహానా నెతన్యాహు లికుడ్‌ పార్టీకి చెందినవారు. ఆయన స్థానంలో ఐసెన్‌కాట్‌ వర్గానికి చెందిన కహానా బాధ్యతలు చేపట్టడం పార్లమెంట్‌లో అధికార సమీకరణాలను మార్చే పరిణామంగా అంతర్జాతీయ విశ్లేషకులు చెబుతున్న మాట.  ఓ రకంగా నెతన్యాహుకు ఇది ఊహించని పరిణామం.

స్పీకర్‌ కీలక పాత్ర.. 
ముఖ్యంగా పార్లమెంట్‌లో ఏ అంశాలపై చర్చ జరగాలి? ఏ బిల్లులను ఓటింగ్‌కు తీసుకురావాలి? అనే విషయాల్లో స్పీకర్‌కు కీలక పాత్ర ఉంటుంది. దీంతో నెతన్యాహు ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించే ప్రతిపక్ష కూటమికి పార్లమెంట్‌లో మరింత పట్టు లభించనుంది.

న్యాయవ్యవస్థ సంస్కరణలను రద్దు చేయడం..
నెతన్యాహు ప్రభుత్వం తీసుకొచ్చిన న్యాయవ్యవస్థ సంస్కరణలను రద్దు చేయడం ఐసెన్‌కాట్‌ కూటమి ప్రధాన లక్ష్యాల్లో ఒకటి. న్యాయవ్యవస్థ స్వతంత్రతను తగ్గించేలా ఈ సంస్కరణలు ఉన్నాయంటూ గతంలో ఇజ్రాయెల్‌లో భారీ నిరసనలు జరిగాయి. వీటితో పాటు 2023 అక్టోబర్‌ 7న హమాస్‌ దాడులను అడ్డుకోవడంలో భద్రతా వైఫల్యాలపై స్వతంత్ర విచారణ కమిషన్‌ ఏర్పాటు చేయాలని ఐసెన్‌కాట్‌ కోరుతున్నారు. ప్రధానమంత్రి పదవికి కాలపరిమితి విధించే ప్రతిపాదన కూడా ఆయన ఎజెండాలో ఉంది. ఈ అంశాలపై పార్లమెంట్‌లో చర్యలు ప్రారంభించే అవకాశం ఉంది.

అక్టోబర్‌ 27న జరిగిన ఎన్నికల్లో 120 స్థానాలున్న ఇజ్రాయెల్‌ పార్లమెంట్‌లో నెతన్యాహు కూటమికి 53 సీట్లు, ఐసెన్‌కాట్‌ నేతృత్వంలోని కూటమికి 48 సీట్లు వచ్చాయి. అరబ్‌ పార్టీలకు చెందిన రెండు కూటములు కలిపి 19 స్థానాలు గెలుచుకున్నాయి. దీంతో ఏ పక్షానికీ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 61 స్థానాల మెజారిటీ లభించక పోవడం గమనారహం.

స్పీకర్ ఎన్నికలో ఐసెన్ కాట్‌ విజయం..

అరబ్‌ పార్టీల మద్దతుతోనే స్పీకర్‌ ఎన్నికలో ఐసెన్‌కాట్‌ వర్గం 66 ఓట్లు సాధించింది. ఇదిలా ఉంటే.. ఇజ్రాయెల్‌ అధ్యక్షుడు ఐజాక్‌ హెర్జోగ్‌ ఇప్పటికే ప్రభుత్వ ఏర్పాటుకు ఐసెన్‌కాట్‌కు అవకాశం ఇచ్చారు. ఆయనకు ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు 28 రోజుల గడువు ఉండగా, అవసరమైతే మరో 14 రోజులు పొడిగించే అవకాశాలున్నాయి.  అయితే అరబ్‌ పార్టీల మద్దతును ప్రభుత్వ ఏర్పాటు వరకు కొనసాగించడం ఆయనకు కీలకం కానుంది.

అపద్ధర్మ ప్రభుత్వం..

మరోవైపు కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు నెతన్యాహు ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగుతారు. ఐసెన్‌కాట్‌ ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో విఫలమైతే వచ్చే ఏడాది మరోసారి ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో స్పీకర్‌ ఎన్నికలో ఎదురైన పరాజయం నెతన్యాహుకు రాజకీయంగా మరో ఎదురుదెబ్బగా మారింది.

Add Zee News as a Preferred Source
TAGS:
Trending News
Telugu News