SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Mahabubabad: అమెరికాలో రోడ్డు ప్రమాదం.. మహబూబాబాద్ కు చెందిన మహిళ మృతి.!.

Woman dies in us road accident: ఆదివారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో భారత్‌కు చెందిన మరో మహిళతో కలిసి కారులో బయల్దేరిన సుప్రియ అనుకొని ప్రమాదంలో చిక్కుకుంది. కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో సుప్రియ స్పాట్ లోనే దుర్మరణం చెందింది.

Written By Inamdar Paresh
Published: Oct 04, 2026, 01:19 PM IST | Updated: Oct 04, 2026, 01:23 PM IST
Image Credit: Tgwomandiesinusroadaccident(file)
Join

Mahabubabad woman dies road accident in America: మన దేశం నుంచి చాలా మంది యువతీ, యువకులు ఎక్కువగా అమెరికాలో ఉన్నత చదువులు, ఉద్యోగాల కోసం వెళ్తుంటారు. అయితే... ఇటీవల మనదేశానికి చెందిన వారిపై తరచుగా దాడులు జరుగుతున్నాయి. ముఖ్యంగా ట్రంప్ వచ్చిన తర్వాత ఈ దాడులుమరింతఎక్కువగా జరుగుతున్నాయి. ఇక రోడ్డు ప్రమాదాలల్లో భారతీయులు ఎక్కువగా చనిపోతున్నారు. 

కొన్ని నెలల క్రితం మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ సతీమణి డాక్టర్ సుచి యాష్కీ అమెరికాలో జరిగిన కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నారు. ఈ క్రమంలో తెలంగాణకు చెందిన మహిళ యూఎస్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో విగత జీవిగా మారింది.  ఈ ఘటనతో మహబూబాబాద్ లో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలానికి చెందిన దారం సుప్రియ జాబ్ చేస్తు  అమెరికాలోని మిస్సోరిలో ఉంటుంది. ఆదివారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో భారత్‌కు చెందిన మరో మహిళతో కలిసి కారులో బయల్దేరిన సుప్రియ రోడ్డు ప్రమాదంలో విగతజీవిలా మారింది. వెనుక నుంచి వేగంగా దూసుకొచ్చి కారుని ట్రక్ బలంగా ఢీకొట్టింది. దీంతో సుప్రియ స్పాట్ లోనే దుర్మరణం చెందగా, మరో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. 

వెంటనే వీరిని ఆస్పత్రికి తరలించారు. ఇక సుప్రియ మరణ వార్త తెలియగానే మహబూబాబాద్‌ లో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. 

మరోవైపు మృతురాలి భర్త కొదుమూరి రంజిత్, అత్తమామలు మహబూబాబాద్‌లోని వీరభద్ర అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్నారు.  మహిళ డెడ్ బాడీని తొందరగా స్వగ్రామంకు తీసుకొచ్చేలా స్థానిక నేతలు, ప్రభుత్వం చర్యలు తీసుకొవాలని బాధిత బంధువులు కోరుతున్నారు.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

ZEENEWS TRENDING STORIES