Tiger kills Man Video: పెద్దపులి ఎన్ క్లోజర్ లోకి దూకిన వ్యక్తి.. చూస్తుంగానే దారుణం.. వీడియో వైరల్..
Man dies after tiger attack in Uk: సౌత్ యార్క్‌షైర్ లోన జూలో ఒక వ్యక్తి పెద్ద పులి ఉన్న ఎన్ క్లోజర్ లోకి దూకాడు. దీంతో అది పరిగెత్తుకుంటూ వచ్చి అతనిపై దాడి చేసింది.ఈ ఘటనకు చెందిన వీడియో వైరల్గా మారింది.
Man dies after tiger attack at Yorkshire wildlife zoo: సాధారణంగా చాలా మంది తరచుగా స్నేహితులు, బంధువులతో కలిసి జూలకు వెళ్తుంటారు. కొంత మంది అత్యుత్సాహంతో మూగ జీవాలపై దాడులు చేస్తారు. కొన్ని సందర్భాలలో బోనులో ఉన్నవాటిని రాళ్లతో కొట్టడం లేదా దాన్నిఏదో విధంగా డిస్టర్బ్ చేయడం వంటివి చేస్తారు. ఇదంత మనం రోటీన్ గా చూస్తుంటాం. కానీ కొంత మంది తప్పతాగి లేదా రీల్స్ పిచ్చిలో క్రూర జంతువుల ఎన్ క్లోజర్ లోకి వెళ్లడం వంటివి చేస్తారు.
ఇదంతా మనం రోటీన్ గా చూస్తుంటాం. కొన్నిసందర్భాల్లో ఇలాంటి పనుల వల్ల ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా ఉన్నాయి. తాజాగా.. యూకేలోని యార్క్‌షైర్ వైల్డ్‌లైఫ్ పార్క్ లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.
యూకేలోని యార్క్‌షైర్ వైల్డ్‌లైఫ్ పార్క్‌లో ఒక వ్యక్తి సరదాగా జంతువులను చూసేందుకు వచ్చాడు. ఇంతలో అతను పులుల ఎన్ క్లోజర్ ను చూశాడు. మరీ అతనికి ఏమనిపిచ్చిందో కానీ ఒక్కసారిగా దానిలోకి దూకాడు. వెంటనే పెద్దపులి పరిగెత్తుకుంటూ వచ్చి అతనిపై దాడి చేసింది. అతను పెద్దపులిని చూసి వణికిపోయాడు. దానితో పొరాటంకు దిగాడు.
కానీ పులి మాత్రం సదరు యువకుడిపై అత్యంత క్రూరంగా దాడి చేసింది. చుట్టుపక్కల వారి అరుపులతో జూ సిబ్బంది అప్రమత్తమయ్యారు. వెంటనే ఎయిర్ గన్ ను ఉపయోగించి పెద్దపులి దూరంగా వెళ్లేలా చేశారు. కానీ అప్పటికే అతను తీవ్రంగా గాయపడ్డాడు.
వెంటనే అతడ్ని కాపాడి ఆస్పత్రికి తరలించారు. అతడికి చాలా రక్తం పొవడం వల్ల ఐసీయూలో ఉంచి మరీ చికిత్స అందించారు. అయిన కూడా అతని ప్రాణాలు దక్కేలేదు. అతగాడు మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ విషాద ఘటనతో జూను సిబ్బంది మూసివేశారు. ఈ పులిదాడి ఘటనకు చెందిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.