Gajwel Tahsildar suspended over derogatory remarks on farmer: సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో రైతుపై ఎమ్మార్వో చేసిన అనుచిత వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ గామారింది. అంతే కాకుండా బాధిత రైతు కలెక్టర్ కు ఫిర్యాదు చేశాడు. ఈ వీడియో కూడా అధికారి వరకు చేరడంతో దీనిపై కలెక్టర్ సీరియస్ అయ్యారు. ఘటనపై విచారణకు ఆదేశించారు.
దీనిపై రెవెన్యూ డివిజనల్ అధికారి ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా కలెక్టర్ ఎమ్మార్వోను సస్పెండ్ చేస్తు ఆదేశాలు జారీ చేశారు. అంతే కాకుండా అధికారులంతా కార్యాలయాలకు వచ్చే వారి పట్ల బాధ్యతతో, నిబద్దతో పనిచేయాలని ప్రవర్తించాలని ఆదేశించారు.
గజ్వేల్ ఎమ్మార్వో వివాదం ఏమిటంటే..?
ఇటీవల రైతు తన భూమికి చెందిన సమస్యపై ఫిర్యాదు చేసేందుకు ఎమ్మార్వో ఆఫీస్‌కు వెళ్లాడు.అయితే అక్కడికి వచ్చిన రైతును చూసి తహసీల్దార్ చిట్టంపల్లి స్వామి అవహేళనగా మాట్లాడారు. నువ్వు ఇంకా పురుగుల మందు తాగలేదా..?.. బతికే ఉన్నావా..?.. అంటూ నీచంగా మాట్లాడాడు.
అంతే కాకుండా ఇలా మాట్లాడటం ఏంటని రైతు అడిగితే.. బరా బర్ వస్తది అంటూ ఇంకాస్త అహాంకారంతో మాట్లాడాడు. ఇది కాస్త ఉన్నతాధికారుల వరకు వెళ్లడంతో దీనిపై అధికారులు ఎమ్మార్వోపై చర్యలు తీసుకున్నారు.
మొత్తంగా ఈ ఘటన కాస్త వైరల్గా మారడంతో దీనిపై నెటిజన్లు సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే విధంగా.. అనుమతి లేకుండా హెడ్‌క్వార్టర్స్ విడిచి వెళ్లరాదని సైతం కలెక్టర్ తమ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.