Chanakya Niti Telugu: మానవ సంబంధాలతో పాటు సమాజం, వ్యక్తిగత వికాసం, ఆర్థిక క్రమశిక్షణ పై ఆచార్య చానక్యుడు అందించిన నీతి సూత్రాలు నేటికీ మార్గదర్శకంగా నిలుస్తూ వస్తున్నాయి. మనిషి తన జీవితంలో అనుకున్న లక్ష్యాలను చేరుకోవడానికి ప్రతి ఒక్క మాత్రమే ఉంటే సరిపోదని.. అలాగే భయాన్ని అధిగమించి దృఢ సంకల్పం కూడా ఉండాలని చాణక్యనీతి స్పష్టంగా చెబుతోంది. ముఖ్యంగా మనిషిని వైఫల్యాల వైపు నెట్టే.. మూడు ప్రధాన పరిస్థితుల పట్ల ఎట్టి పరిస్థితుల్లోనూ భయపడకూడదని చాణక్య నీతి శాస్త్రం క్లియర్ గా చెబుతూ వస్తోంది. అయితే, ఎలాంటి విషయాల్లో భయపడకూడదు? అనే అంశాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ విషయాల్లో అస్సలు భయపడకూడదు..
కొత్త ప్రయత్నాల్లో వచ్చే సవాళ్లను చూసి అస్సలు భయపడకండి..
చాలామంది కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రావడానికి.. కొత్త పనులను ప్రారంభించడానికి ఎంతగానో భయపడుతూ ఉంటారు. కొత్త రంగంలోకి అడుగుపెట్టేటప్పుడు ఎదురయ్యే సవాళ్లను చూసి భయపడే వ్యక్తి ఎప్పటికీ జీవితంలో ముందుకెళ్ల లేడని.. అలాగే పురోగతి సాధించలేడని చాణక్యనీతి శాస్త్రం ఎంతో క్లియర్గా పేర్కొంది. కొత్త మార్గంలో అడ్డంకులు సహజమని.. వాటిని ఎదుర్కొన్నప్పుడే.. నైపుణ్యం పెరుగుతుందని చాణక్య నీతి శాస్త్రం వివరిస్తుంది. కష్టాలకు భయపడి ప్రారంభంలోనే ఆగిపోతే విజయం శాశ్వతంగా దూరమవుతుందని తెలిపింది.
ఓటమికి భయపడకండి..
ఏదైనా పని చేసేటప్పుడు ఎక్కడ ఓడిపోతారో.. అనే భయం మనిషిలోని ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. చాణక్యుడి అభిప్రాయం ప్రకారం.. ఓటమి అనేది అంతం కాదు.. అది సరికొత్త అనుభవాన్ని.. విజయానికి అవసరమైన పాఠాన్ని నేర్పే ఒక అవకాశమని మాత్రమేనని చాణక్యనీతి శాస్త్రం చెబుతోంది. ఒకసారి ఓడిపోయినంత మాత్రాన నిరాశ చెందకూడదని.. చేసిన తప్పులను సరిదిద్దుకొని మరింత పట్టుదలతో ముందుకు సాగాలని చాణక్యనీతి శాస్త్రం చెబుతోంది. ఓటమి భయంతో ప్రయత్నమే మానేయడం కంటే పెద్ద పొరపాటు మరొకటి ఉండదని నీతి శాస్త్రం వివరిస్తుంది..
లోకం ఏమంటుంది అన్న భయం ఏ మాత్రం ఉండకూడదు..
ఒక మంచి పని లేదా.. సరికొత్త లక్ష్యం దిశగా ప్రయాణించేటప్పుడు పదిమంది ఏమనుకుంటారోనని చాలామంది మనసులో ఒక నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది.. ఇది ఒక బలహీనతనని చాణక్యనీతి శాస్త్రం చెబుతోంది. ఇతరుల విమర్శలకు లేదా అంచనాలకు భయపడితే వ్యక్తిగత కలలు మధ్యలోనే ఆగిపోతాయి. సరైన మార్గంలో.. న్యాయమైన లక్ష్యంతో పనిచేస్తున్నప్పుడు ఎవరి మాటలకు జంకాల్సిన అవసరం లేదని.. చాణక్యనీతి శాస్త్రం స్పష్టం చేస్తోంది. ఎవరైనా సాధించిన ఫలితాలను చూసి మాత్రమే సమాజం గుర్తిస్తుందని.. కాబట్టి లోకపు అభిప్రాయాలకు భయపడకుండా పని పైనే దృష్టి పెట్టాలని ఆయన తెలిపారు..