SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

వామ్మో.. చేతులతోనే కొండచిలువకు మటన్ తినిపిస్తున్న యువకుడు.. వీడియో!

Giant Python Video: తాజాగా సోషల్ మీడియాలో ఒక కొండచిలువకు యువకుడు మటన్ ముక్కలను తినిపిస్తున్న దృశ్యాలు అందరినీ ఆశ్చర్యపోయేలా చేస్తున్నాయి. పెంపుడు పాముకి ఆ యువకుడు తినిపిస్తున్న తీరును చూసి సోషల్ మీడియా వినియోగదారులు విపరీతంగా కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియోకి సంబంధించిన అన్ని వివరాలు తెలుసుకోండి..

Written By Dharmaraju Dhurishetty
Published: Oct 19, 2026, 03:13 PM IST | Updated: Oct 19, 2026, 03:15 PM IST
Image Credit: ZEE TELUGU NEWS
Join

Giant Python Video: ప్రతిరోజు సోషల్ మీడియాలో ఎన్నో వింతలతో పాటు విశేషాలు సోషల్ మీడియా వినియోగదారులను ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి. ముఖ్యంగా విష సర్పాలతో పాటు భారీ కొండచిలువలకు సంబంధించిన వీడియోలు క్షణాల్లో వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా ఒక వ్యక్తి తన ఇంట్లో పెంచుకుంటున్న భారీ కొండచిలువకు ఏమాత్రం భయం లేకుండా చేతులతో స్వయంగా మటన్ ముక్కలను తినిపిస్తున్న ఒక అరుదైన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ను షేక్ చేస్తుంది. అసలు ఈ వీడియో ఎంతలా వైరల్ అవుతుంది అంటే చెప్పడం చాలా కష్టం. ఈ వీడియోకు సంబంధించిన అన్ని వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..

సాధారణంగా కొండచిలువ పేరు వింటేనే ఎవరైనా ఆమడ దూరం పరిగెత్యాల్సిందే.. అలాంటిది ఈ వీడియోలో కనిపించే వ్యక్తి చేసిన పనికి సోషల్ మీడియా వినియోగదారులంతా ఆశ్చర్యపోతున్నారు. అతడు ఒక పెద్ద కవర్లో తాజా మటన్ ముక్కలను తీసుకొని.. కొండచిలువ దగ్గరకు వెళ్లాడు.. అంతేకాకుండా తలవద్దకు తీసుకెళ్లి ఆ భారీ పాముకు చేతులతో మాంసం ముక్కలను అందించాడు. పదునైన దవడలతో ఆ పాము మెల్లగా అందుకొని గొంతులోకి లాగేసుకుంది. ఈ సమయంలో ఆ పాము కు సంబంధించిన పళ్ళు కూడా మీరు క్లియర్‌గా చూడొచ్చు..

ఎలాంటి భయం, బాటి లేకుండా అతడు చేసిన ఈ పని చూసి సోషల్ మీడియా వినియోగదారులు ఆశ్చర్యపోతున్నారు. ఆ పాము అతనికి పూర్తిగా అలవాటు పడినట్లుంది.. కుటుంబ సభ్యులా.. ఆ పాము ప్రవర్తించడం ఈ వీడియోలో అందరినీ ఆసక్తిగా చూసేలా చేస్తుంది. పెంపుడు కుక్క లేదా పిల్లలకు ఆహారం పెట్టిన అంత తేలికగా ఆ యువకుడు ఆ భారీ సర్పానికి ఆహార అందించడం అందరినీ ఆశ్చర్యపోయేలా చేస్తోంది..

ఈ వీడియో వైరల్ కావడంతో ఇంస్టాగ్రామ్‌తో పాటు యూట్యూబ్, వివిధ సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురుస్తోంది. బందర్ సోషల్ మీడియా వినియోగదారులు ఈ వ్యక్తి ధైర్యానికి సెల్యూట్ చేయాల్సిందే.. ఆ పాము ఎంత శాంతంగా ఉందో చూడండి అంటూ కొంతమంది కామెంట్లు పెడుతున్నారు. మరి కొంతమంది వన్యప్రాణి సంరక్షకులు ఈ వీడియో చూసిన వెంటనే హెచ్చరికలు చేస్తున్నారు. కొండచిలువ ఎంత మజ్జిగ చేసుకున్నప్పటికీ సహజసిద్ధంగా.. అడవి జంతువులని.. ఆకలి వేసినప్పుడు.. చిన్నపాటి పొరపాటు జరిగిన అవి క్షణాల్లో దాడి చేసే ప్రమాదం ఉందని వారి అభిప్రాయపడుతున్నారు..

 

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..

ZEENEWS TRENDING STORIES