SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Video Viral: వామ్మో.. నడి రోడ్డు మీద మాజీ భర్తను హగ్ చేసుకున్న మహిళ.. భర్త పరుగో పరుగు.. వీడియో వైరల్..

Ex wife funny video viral: మాజీ భార్య రోడ్డు మీద హగ్ చేసుకుని మరీ రచ్చ చేసింది.ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.

Written By Inamdar Paresh
Published: Nov 19, 2026, 13:02 IST | Updated: Nov 19, 2026, 13:16 IST
Image Credit: Ex wife hugs husband after divorce video
Join

Man runs away after ex wife demands re marriage bangladesh: సోషల్ మీడియాలో ఫన్నీగా ఉండే వీడియోలు  ఎక్కువగా ట్రెండింగ్ గా మారుతుంటాయి. కొన్ని వీడియోలు చూస్తుంటే ఫన్నీగాను, మరికొన్ని వీడియోలు ఆశ్చర్యంకు గురిచేసేవిలా ఉంటాయి. నెటిజన్లు కూడా ఎక్కువగా ఫన్నీగా ఉండే వీడియోలను చూసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల భార్యభర్తలకు చెందిన ఘటనలు ఎక్కువగా వార్తలలో ఉంటున్నాయి. చక్కగా పెళ్లిళ్లు చేసుకుని అన్యోన్యంగా ఉండకుండా ఒకరిపై మరోకరు దాడులు చేసుకుంటున్నారు. చిన్న చిన్న విషయాల్ని పెద్దది చేసుకుని ఆత్మహత్యల వరకు వెళ్లిపోతున్నారు. సుపారీలు ఇచ్చి మరీ దారుణాలకు పాల్పడుతున్నారు. ఇక చిన్న విషయాలకు డైవర్స్ వరకు కొంత మంది వెళ్లిపోతున్నారు.ఈ నేపథ్యంలో ప్రస్తుతం బంగ్లాదేశ్ లో చోటు చేసుకుందని చెబుతున్న ఒక వీడియో నెట్టింట బాగా వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

 

 

వైరల్గా మారిన వీడియో బంగ్లాదేశ్ లో చోటు చేసుకుంది. దీనిలో ఒక మహిళ రోడ్డు మీద ఒక వ్యక్తిని హగ్ చేసుకుని అస్సలు కదలనివ్వడంలేదు. అతను వదలాలని ఎంతగా  ప్రాధేయ పడుతున్న కూడా వదల్లేదు. అయితే.. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. వీరిద్దరు భార్యభర్తలు. నాలుగు నెలల క్రితం పెళ్లి జరిగిందని ఆ తర్వాత బేధాభి ప్రాయాలు రావడంతో విడిపోయారు. కానీ సదరు మహిళ మాత్రం డైవర్స్ అయ్యాక రియలైజ్ అయ్యింది. 

ఇంతలో సడెన్ గా తన మాజీ భార్త కన్పించడంతో అతడ్ని గట్టిగా హగ్ చేసుకుంది. అంతే కాకుండా నీతోనే ఉంటానని రోడ్డు మీద మాజీ భర్తతో వాగ్వాదంకు దిగింది. అతను ఆమెతో విడ్పించుకుందామనిచూసిన కూడా ఆమె విన్పించుకోలేదు. చివరకు ఎంతో కష్టపడి మాజీ భార్య నుంచి విడిపించుకుని మరీ అక్కడి నుంచి బతుకు జీవుడా అంటూ అతగాడు పారిపోయాడు. దూరం నుంచి కొంత మంది వీరి గొడవలను సీక్రెట్ గా వీడియో తీసి  వైరల్ చేయడంతో  ఈఘటన కాస్త నెట్టింట వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు షాక్ అవుతున్నారు.డైవర్స్ అయిన కూడా మాజీ భర్తకు ఈ టార్చర్ ఏంట్రాబాబు అంటూ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

ZEENEWS TRENDING STORIES